ఆగస్టులో లాంచ్ అయిన టాప్-5 కార్లు ఇవే - కొనడం కష్టమే!
2022 ఆగస్టులో లాంచ్ అయిన బెస్ట్ స్పోర్ట్స్ కార్లు ఇవే.
2022 ఆగస్టులో ఎన్నో కార్లు, బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు లాంచ్ అయ్యాయి. ఆసక్తికరంగా ఎన్నో స్పోర్ట్స్ కార్లు కూడా మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఏకంగా ఐదు స్పోర్ట్స్ కార్లు ఈ నెలలో మనదేశంలో ఎంట్రీ ఇచ్చాయి. అవేంటో ఒకసారి చూద్దాం...
ఫెరారీ 296 జీటీబీ (రూ.5.4 కోట్లు)
ఫెరారీ తన మొట్టమొదటి వీ6 ఫెరారీని మనదేశంలో లాంచ్ చేసింది.ఇక ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు. 3.0 లీటర్ ట్విన్ టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉంది. ఇందులో జీటీబీ అంటే గ్రాన్ ట్యురిస్మో బెర్లినెట్టా అని అర్థం. ఈ కారు ఏకంగా 819 బీహెచ్‌పీని, 740 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిలోమీటర్లు కాగా, కేవలం 2.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది.
పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ (రూ.3.24 కోట్లు)
పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ మనదేశంలో లాంచ్ అయింది. 911 సీసీతో వచ్చిన అత్యంత తేలికైన కారు ఇదే. ఇందులో 4.0 లీటర్ ఫ్లాట్ సిక్స్ బాక్సర్ ఇంజిన్ అందించారు. ఇది 502 బీహెచ్‌పీ, 470 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ పీడీకే గేర్ బాక్స్‌ను ఇందులో పోర్షే అందించడం విశేషం.
లాంబోర్గిని హురాకాన్ టెక్నికా (రూ.4.04 కోట్లు)
లాంబోర్గిని ఇండియా ఇటీవలే మనదేశంలో తన హురాకాన్ టెక్నికా కారును లాంచ్ చేసింది. ఇందులో 5.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ వీ10 ఇంజిన్ అందించారు. ఇది 631 బీహెచ్‌పీ, 565 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.2 సెకన్లలోనే అందుకోనుంది.
బీఎండబ్ల్యూ 50 జహ్రే ఎం ఎడిషన్ (రూ.1.53 కోట్లు)
ఈ కారు కూడా మనదేశంలో గత నెలలోనే లాంచ్ అయింది. ఇందులో 3.0 లీటర్ స్ట్రయిట్ 6 ఇంజిన్‌ను అందించారు. 510 బీహెచ్‌పీ, 650 ఎన్ఎం టార్క్‌ను ఈ కారు డెలివర్ చేయనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.5 సెకన్లలోనే అందుకోనుంది.
మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఈక్యూఎస్ 53 (రూ.2.45 కోట్లు)
మెర్సిడెస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏఎంజీ కారును గత నెలలోనే లాంచ్ చేసింది. ఇది ఒక హై పెర్ఫార్మెన్స్ లగ్జరీ కారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది. 762 బీహెచ్‌పీ, 1020 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది అందించనుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు కాగా, 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే ఈ కారు అందుకోనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?