అన్వేషించండి

రూ.5 లక్షల Tata Tiago, GST డ్రాప్‌తో యమా క్రేజ్‌, కొత్త రేటు ఎంతంటే?

Tata Tiago Sales Report: టాటా టియాగో ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరలు ₹5 లక్షల నుంచి ప్రారంభమై టాప్-స్పెక్ XZA AMT CNG వేరియంట్ ₹8.55 లక్షల వరకు ఉంటుంది.

Tata Tiago Best Selling Car: టాటా టియాగో, మన మార్కెట్లో ఒక పాపులర్‌ హ్యాచ్‌బ్యాక్‌. గత నెలలో (ఆగస్టు 2025), దేశవ్యాప్తంగా ఈ హ్యాచ్‌బ్యాక్‌కు చాలా బాగా అమ్ముడైంది. ఆగస్టు నెలలో, మొత్తం 5,250 మంది కొత్త కస్టమర్లు టియాగోను సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో (ఆగస్టు 2024) అమ్ముడైన 4,733 యూనిట్లతో పోలిస్తే ఇప్పుడు 11 % పెరుగుదల కనిపించింది. 

టియాగో లుక్స్‌
టాటా టియాగో కొత్త ఫ్రంట్ ఫాసియా బోల్డ్ లుక్స్ ఇస్తోంది. LED హెడ్‌ల్యాంప్స్‌, DRLs & అప్డేటెడ్ బంపర్ డిజైన్‌తో ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. టాప్ వేరియంట్‌లో ఇచ్చిన 15 అంగుళాల డ్యూయల్-టోన్ అలోయ్ వీల్స్‌, షార్క్-ఫిన్ యాంటెన్నా యూత్‌ఫుల్ టచ్‌ ఇస్తున్నాయి. ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో/యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. టియాగో NRG మోడల్‌లో రఫ్ టచ్‌లతో కూడిన బ్లాక్ క్లాయిడింగ్‌, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్‌, రూఫ్ రైల్స్ ఈ హ్యాచ్‌బ్యాక్‌కి SUV తరహా లుక్ ఇస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, టాటా టియాగో ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర 5 లక్షల రూపాయల (Tata Tiago ex-showroom price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభమై టాప్-స్పెక్ XZA AMT CNG వేరియంట్‌కు 8.55 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే, సెప్టెంబర్ 22 (సోమవారం) నుంచి అమలులోకి వచ్చే GST 2.0 తర్వాత దీని ధర సుమారు ₹ 42,000 తగ్గుతుందని అంచనా.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌
టాటా టియాగో CNG వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. టియాగో CNG లోని ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS శక్తిని & 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ కారు 242 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. టాటా టియాగో గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm, కాస్త కఠినమైన రోడ్లలోనూ ఇబ్బంది ఉండదు. ఈ టాటా కారు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

మైలేజ్‌
టాటా టియాగో పెట్రోల్ - మాన్యువల్ వేరియంట్ లీటర్ కు 20.09 కి.మీ. మైలేజీని అందిస్తుందని కంపెనీ క్లెయిమ్‌ చేసింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్ లీటరుకు 19 కి.మీ. మైలేజీని అందిస్తుండగా, CNG మోడ్‌లో మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.  

టియాగోలోని రెండు ట్యాంకులను (పెట్రోల్‌ &CNG) నింపితే, మీరు సులభంగా 900 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. టియాగో CNG మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 26.49 కి.మీ/కి.గ్రా. & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 28.06 కి.మీ/కి.గ్రా. మైలేజీ ఇస్తుంది.

ఫీచర్లు
టాటా టియాగో గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. డ్యూయల్ (రెండు) ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగులు, EBDతో కూడిన ABS, చైల్డ్ సీట్ మౌంట్లు, సీట్‌ బెల్ట్ రిమైండర్లు & ఇంపాక్ట్ -సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Embed widget