ట్యాంక్ ఫుల్ చేస్తే 1000 km ఇచ్చే Tata Tiago - రూ.లక్ష డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం, EMI డీటైల్స్ తెలుసుకుంటారా?
Tata Tiago On EMI: మీరు టాటా టియాగో కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీకు ఈ కారు ఎంత EMI కి లభిస్తుంది & ఇది ఏ కార్లతో పోటీ పడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Tata Tiago Price, Down Payment, Car Loan and EMI Details: ఆఫీసుకి వెళ్లిరావడానికి, డైలీ యూజ్ కోసం అధిక మైలేజ్ ఇచ్చే కార్లలో టాటా టియాగో ఒకటి. పైగా, ఇది మధ్య తరగతి ప్రజల బడ్జెట్ కారు. ఇటీవలి జీఎస్‌టీ (GST 2025) తగ్గింపు తర్వాత, ఈ హ్యాచ్‌బ్యాక్ ధర ఇంకా తగ్గింది. మీరు ఈ కారును కేవలం ₹1,00,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫైనాన్స్ ప్లాన్ పర్‌ఫెక్ట్‌గా ఉంటే ఈ కారు వచ్చి మీ ఇంటి ముందర ఆగుతుంది.
GST సంస్కరణలు 2.0 (GST Reforms 2025) కింద, చిన్న కార్లపై GST రేటును 28% నుండి 18%కి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీని ఫలితంగా టాటా టియాగోపై రూ. 75,000 వరకు ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 4.57 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ -స్పెక్ వేరియంట్‌కు రూ. 7.84 లక్షల వరకు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో ధర
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో టాటా టియాగో బేస్ వేరియంట్ (XE పెట్రోల్) ఎక్స్-షోరూమ్ ధర 4,57,490 రూపాయలు (Tata Tiago ex-showroom price, Hyderabad Vijayawada). దీనికి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాదాపు రూ. 63,000, బీమా దాదాపు రూ. 31,000, ఇతర అవసరమైన ఖర్చులను కలిపితే, సుమారు రూ. 5.52 లక్షల ఆన్-రోడ్ ధర (Tata Tiago on-road price, Hyderabad Vijayawada) వస్తుంది. రూ. 1,00,000 డౌన్ పేమెంట్ చేశాక, బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి మొత్తం దాదాపు రూ. 4.52 లక్షల కార్ లోన్ తీసుకోవాలి. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు ఈ రుణాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు EMI ప్లాన్ తెలుసుకుందాం.
7 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా లోన్ తీసుకుంటే, మంత్లీ EMI రూ. 7,269 అవుతుంది.
6 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే, నెలవారీగా రూ. 8,144 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే, మంత్లీ EMI రూ. 9,379 బ్యాంక్‌లో జమ చేయాలి.
4 సంవత్సరాల రుణ కాలపరిమితిని ఎంచుకుంటే నెలనెలా రూ. 11,243 EMI చెల్లించాలి.
బ్యాంక్ మంజూరు చేసే రుణం, వడ్డీ రేటు అనేవి మీ క్రెడిట్ స్కోర్ & బ్యాంక్ విధానాలపై ఆధారపడి ఉంటాయి. ఇంకా, టాటా టియాగో ఆన్-రోడ్ ధర.. వేరియంట్ & నగరాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు.
టాటా టియాగో మైలేజ్
టాటా టియాగో పెట్రోల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 35 లీటర్లు. కంపెనీ లెక్క ప్రకారం, ఈ కారు లీటరు పెట్రోలుకు 19 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ లెక్కన, ఇది ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 665 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మీరు CNG వేరియంట్ తీసుకుంటే, దీనికి 60 లీటర్ల CNG ట్యాంక్ ఉంటుంది. ఇది కిలోగ్రాముకు 24 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ లెక్కన, ఫుల్ ట్యాంక్ CNGతో 1,440 కిలోమీటర్లు తిరిగి రావచ్చు, ఇది సుదూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.
టాటా టియాగో, ప్రధానంగా, మారుతి సుజుకి స్విఫ్ట్ , హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, మారుతి సుజుకి సెలెరియో & మారుతి సుజుకి వ్యాగన్ R వంటి హ్యాచ్‌బ్యాక్‌లతో పోటీ పడుతుంది.





















