Citroen Aircross vs Maruti Victoris: రెండు కార్లకూ భారత్ NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ - స్కోరింగ్‌లో దేనిది పైచేయి?
Citroen Aircross & Maruti Victoris రెండూ Bharat NCAP లో 5 స్టార్ సేఫ్టీ సాధించాయి. అయితే ఈ రెండు కార్లలో ఒకటి Adult & Child సేఫ్టీలో కొంత మెరుగైన స్కోర్లు సాధించింది.

Citroen Aircross vs Maruti Victoris Safety Comparison: భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) తాజాగా కొన్ని ప్రముఖ కార్లపై క్రాష్ టెస్ట్‌లు నిర్వహించింది. అందులో Citroen Aircross & Maruti Victoris ఫలితాలు ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశమయ్యాయి. రెండు SUVలు కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి, కానీ స్కోరింగ్‌లో మాత్రం Victoris కొంచెం అదనపు భద్రతను చూపించింది.
Citroen Aircross సేఫ్టీ రిపోర్ట్
Aircrossకు.... Bharat NCAP ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డీఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో డ్రైవర్, కో-డ్రైవర్ తల, మెడకు “Good” ప్రొటెక్షన్ లభించింది. కానీ డ్రైవర్ ఛాతి భాగం “Marginal”, కో-డ్రైవర్ ఛాతి భాగం “Adequate” గా రేటింగ్ పొందింది. పెల్విస్ ప్రాంతానికి “Marginal”, డ్రైవర్ టిబియాస్‌కు “Adequate”, కో-డ్రైవర్‌కు “Good” రేటింగ్ వచ్చింది. సైడ్ మూవబుల్ బారియర్ & సైడ్ పోల్ టెస్టుల్లో అన్ని ముఖ్య భాగాలకు “Good” ప్రొటెక్షన్ లభించింది.
చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 18 నెలలు, 3 ఏళ్ల మోడల్ బేబీ డమ్మీలు రియర్ ఫేసింగ్ చైల్డ్ సీట్లలో ఉంచారు. ఈ రెండు డమ్మీలు ఫ్రంట్ & సైడ్ ఇంపాక్ట్ టెస్టుల్లో పూర్తి పాయింట్లు పొందాయి (8/8, 4/4). అయితే వాహన పరీక్ష (Vehicle Assessment)లో Aircross కేవలం 4/13 మాత్రమే సాధించడంతో చైల్డ్ సేఫ్టీ రేటింగ్ 4 స్టార్‌గానే నిలిచింది.
Maruti Victoris సేఫ్టీ రిపోర్ట్
Victoris టెస్ట్ ఫలితాలు Aircross కంటే ఒక మెట్టుపైనే ఉన్నాయి. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో డ్రైవర్, కో-డ్రైవర్ తల, మెడ భాగాలు “Good” రక్షణ పొందాయి. డ్రైవర్ ఛాతి “Adequate”, కో-డ్రైవర్ ఛాతి, పెల్విస్, టిబియాస్ ప్రాంతాలకు “Good” రేటింగ్ లభించింది. సైడ్ బారియర్ & పోల్ టెస్టుల్లో Victoris అన్ని క్రిటికల్ బాడీ పార్ట్స్‌లో “Good” ప్రొటెక్షన్ చూపించింది.
చైల్డ్ సేఫ్టీ విషయంలో కూడా Victoris అద్భుతంగా నిలిచింది - రెండు డమ్మీలకు ఫ్రంట్, సైడ్ టెస్టుల్లో ఫుల్ స్కోర్ (8/8 & 4/4) రావడంతో పాటు, వాహన పరీక్షలో 7/13 పాయింట్లు సాధించింది. అందువల్ల ఇది పెద్దవారి రక్షణ (adult occupant protection - AOP) & పిల్లల రక్షణ (child occupant protection - COP) రెండింటిలోనూ పూర్తి 5 స్టార్ సేఫ్టీ పొందిన SUVగా నిలిచింది.
ఈ రెండు SUVలు 5 స్టార్ రేటింగ్‌లు సాధించినా, డ్రైవర్ & కో-డ్రైవర్ రక్షణలో Victoris కొద్దిగా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. చైల్డ్ సేఫ్టీ స్కోర్ కొద్దిగా తక్కువగా రావడంతో స్టార్ రేటింగ్‌లో Aircross కొంచం వెనుకబడింది.
సేఫ్టీ ఫీచర్లు
Citroen Aircross: 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ABS + EBD, ESC, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ISOFIX చైల్డ్ మౌంట్స్, TPMS.
Maruti Victoris: 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS + EBD, ESC, 360° కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, TPMS, ఫ్రంట్-రియర్ సెన్సర్లు, Level-2 ADAS సిస్టమ్ (పెట్రోల్-AT వెర్షన్‌లో).
ధరలు (ఎక్స్-షోరూమ్)
Citroen Aircross - ₹ 8.32 లక్షల నుంచి ₹ 14.10 లక్షల వరకు
Maruti Victoris - ₹ 10.50 లక్షల నుంచి ₹ 19.99 లక్షల వరకు
ఈ రెండు SUVలు కూడా Maruti Grand Vitara, Hyundai Creta, Kia Seltos, Toyota Hyryder, Volkswagen Taigun, Skoda Kushaq, Honda Elevate వంటి SUVలతో నేరుగా పోటీ పడుతున్నాయి.





















