అన్వేషించండి

మీ బడ్జెట్ రెడీ చేసుకోండి - Hyundai Creta ను టార్గెట్ చేస్తున్న మూడు కొత్త SUVలు త్వరలో లాంచ్‌!

మూడు కొత్త SUVలు - Tata Sierra, New Gen Kia Seltos & Renault Duster త్వరలో మన మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ కార్లు క్రెటా కు టఫ్ కాంపిటీషన్‌ ఇవ్వనున్నాయి.

Hyundai Creta 2025 New Rival SUVs: గత దశాబ్ద కాలంగా, మొత్తం మిడ్-సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా టాప్‌ పొజిషన్‌లో కంటిన్యూ అవుతోంది. కానీ, 2026లో దాని సింహాసనం కదిలిపోవచ్చు. మూడు కొత్త SUVలు - Tata Sierra, New Gen Kia Seltos & Renault Duster - త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఇవి క్రెటాకు ప్రత్యామ్నాయంగా మారి ప్రత్యక్ష సవాలు విసరనున్నాయి. 

టాటా సియెర్రా
టాటా మోటార్స్, 2026 లో తన ఐకానిక్ Sierra కొత్త అవతారాన్ని విడుదల చేస్తోంది. మొదట ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రారంభిస్తారు. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను ఇది అందిస్తుంది. ఆ తర్వాత, పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ వెర్షన్‌లను టాటా పరిచయం చేస్తుంది, వీటిలో 1.5L పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్ (170hp) & 2.0L డీజిల్ (170hp, 350Nm) ఉన్నాయి.

కొత్త సియెర్రా డిజైన్ రెట్రో & మోడ్రన్‌ లుక్స్‌ కలయికతో అద్భుతంగా ఉంటుంది. బాక్సీ సిల్హౌట్, పెద్ద గ్లాస్‌ ఏరియా, LED హెడ్‌ల్యాంప్‌లు & రూఫ్ రెయిల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ను ఈ కొత్త కారులో చూడవచ్చు. క్యాబిన్‌లో త్రీ-స్క్రీన్ సెటప్, లెవల్ 2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ & హర్మాన్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹20-25 లక్షల మధ్య ఉంటుందని అంచనా. 

న్యూ ఏజ్‌ కియా సెల్టోస్
క్రెటా అతి పెద్ద ప్రత్యర్థి అయిన కియా సెల్టోస్‌లో నెక్ట్‌ జెన్‌ వెర్షన్‌ 2026లో రానుంది. మొత్తం ప్రపంచవ్యాప్త అరంగేట్రం జనవరి 2026లో జరుగుతుంది, భారతదేశంలో లాంచ్ ఫిబ్రవరి-మార్చి 2026లో జరగనుంది. కొత్త సెల్టోస్‌ 2026లో ఆపోజిట్స్ యునైటెడ్ డిజైన్ ఫిలాసఫీ ఉంటుంది, ఇందులో - స్లిమ్ LED DRLs, పెద్ద ఫ్రంట్ గ్రిల్ & కనెక్టెడ్‌ టెయిల్‌లైట్లు ఉంటాయి. ఇంటీరియర్‌లో డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవల్-2 ADAS & రీడిజైన్‌ చేసిన డాష్‌బోర్డ్ కూడా మనం చూడవచ్చు.
 
ఈ ఇంజిన్ లైనప్‌లో 1.5L పెట్రోల్ (115hp), 1.5L టర్బో పెట్రోల్ (160hp) & 1.5L డీజిల్ (116hp) ఉంటాయి. ఈ కంపెనీ, 2027లో, 1.5L పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్ వెర్షన్‌లా కూడా ప్రవేశపెడుతుంది. సెల్టోస్ ధర ₹12-21 లక్షల మధ్య ఉంటుందని అంచనా. దాని కనెక్టెడ్‌ టెక్నాలజీ (అలెక్సా ఇంటిగ్రేషన్), ప్రీమియం ఇంటీరియర్ & హైబ్రిడ్ సామర్థ్యాలతో, ఈ SUV క్రెటా & టాటా సియెర్రా రెండింటికీ పోటీగా ఉంటుంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ 
కాంపాక్ట్ SUV విభాగంలో తొలి మార్గదర్శి రెనాల్ట్ డస్టర్, 2026లో కొత్త అవతార్‌లో ప్రజల ముందుకు రానుంది. సెప్టెంబర్ 2025లో చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది, మార్చి 2026లో ప్రజల ముందుకు వస్తుంది. కొత్త డస్టర్ మరింత రగ్గ్‌డ్‌ & పవర్‌ఫుల్‌ డిజైన్‌తో రాబోతోంది. ఇందులో బాక్సీ స్టాన్స్, కొత్త గ్రిల్ & V- ఆకారపు టెయిల్‌లైట్లు ఉంటాయి. ఇంటీరియర్‌లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే), 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ & అర్కామిస్ సౌండ్ సిస్టమ్ వంటి లక్షణాలు ఉంటాయి.

భద్రత కోసం ఈ SUVకి ఆరు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ESC & ADAS లతో వంటివి ఇచ్చారు. ఇంజిన్ ఆప్షన్లు - 1.0L టర్బో పెట్రోల్ (120hp), 1.2L టర్బో పెట్రోల్ (140hp), 1.6L హైబ్రిడ్ (170hp) & CNG వేరియంట్. ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు - 6-స్పీడ్ మాన్యువల్ & CVT. దీనిలో డీజిల్ ఇంజిన్ రాదు. కొత్త డస్టర్ ధర ₹10-18 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అందుబాటు ధర, హైబ్రిడ్ టెక్నాలజీ & 7-సీట్ల బిగ్‌స్టర్ వెర్షన్‌తో, ఈ SUV మరోసారి క్రెటాను సవాలు చేయడానికి సిద్ధమవుతోంది.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget