News
News
X

టాటా నెక్సాన్ ఈవీలో కొత్త మోడల్ - ధర మ్యాక్స్ కంటే తక్కువే!

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కంటే తక్కువగా ఉండనుంది.

FOLLOW US: 

టాటా మోటార్స్ ఇటీవల భారతదేశంలో నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను పెద్ద బ్యాటరీ ప్యాక్, మరిన్ని రేంజ్ ప్లస్ అదనపు ఫీచర్లతో విడుదల చేసింది. ఇప్పుడు స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో, నెక్సాన్ ఈవీ ప్రైమ్ ద్వారా మరిన్ని ఫీచర్లు కొన్నింటిని అందించనున్నారు. మల్టీపుల్ రీజెన్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, i-TPMS వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆసక్తికరంగా, ఈ అప్‌డేట్‌లు ఇప్పటికే ఉన్న నెక్సాన్ ఈవీ ఓనర్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అందుతాయి. జూలై 25 తర్వాత దాని సర్వీస్ సెంటర్‌ల ద్వారా దీన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. పవర్, బ్యాటరీ ప్యాక్ పరంగా నెక్సాన్ ఈవీ, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఒకేలా ఉన్నాయి. కానీ పవర్ విషయంలో మాత్రం నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మరింత శక్తివంతంగా ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే నెక్సాన్ ఈవీ ప్రైమ్ 312 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. దీని ధర కూడా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కంటే తక్కువగా ఉండనుంది.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ కారు ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్ ఎక్స్‌జెడ్+ వేరియంట్ ధర. ఇందులో టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.19.24 లక్షలుగా ఉంది. రెగ్యులర్ నెక్సాన్ ఈవీ ధర రూ.14.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.

రెండు సంవత్సరాల క్రితం లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే వెర్షనే ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్. ఇందులో ఎక్కువ కెపాసిటీ ఉన్న లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. శక్తివంతమైన మోటార్, కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

దీని డిజైన్ రెగ్యులర్ నెక్సాన్ ఈవీ తరహాలోనే ఉంది. ఇంటెన్సీ టియాల్, డేటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ కొంచెం కొత్తగా ఉండనుంది. 16 అంగుళాల అలోయ్ వీల్స్, ఈవీ మ్యాక్స్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

రెగ్యులర్ ఈవీ తరహాలోనే నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డిజైన్ కూడా ఉండనుంది. వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, క్రూజ్ కంట్రోల్ కూడా ఇందులో అందించారు. 

వీటితో పాటు ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 437 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని కంపెనీ అంటోంది. నెక్సాన్ ఈవీ 312 కిలోమీటర్ల రేంజ్‌తో లాంచ్ అయింది. ఇందులో 40.5 కేడబ్ల్యూహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీని అందించారు. దీంతోపాటు 3.3 కేడబ్ల్యూ చార్జర్‌ను అందించనున్నారు. వినియోగదారులు 80 కేడబ్ల్యూ ఫాస్ట్ చార్జర్‌ను కొనుగోలు చేస్తే 56 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 19 Aug 2022 06:41 PM (IST) Tags: Tata Nexon EV Tata Nexon EV Prime Price in India Tata Nexon EV Prime Tata Nexon EV Prime Features Tata Nexon EV Prime Specifications

సంబంధిత కథనాలు

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Electric Aircraft: అద్భుతం, గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్ 'ఆలిస్'

Electric Aircraft: అద్భుతం, గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్ 'ఆలిస్'

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Bengaluru: చారాణా కోడికి బారాణా మసాలా! రూ. 11 లక్షలు పెట్టికొన్న కారుకు రూ. 22 లక్షల రిపేర్ బిల్లు

Bengaluru: చారాణా కోడికి బారాణా మసాలా! రూ. 11 లక్షలు పెట్టికొన్న కారుకు రూ. 22 లక్షల రిపేర్ బిల్లు

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!