అన్వేషించండి

Tata Harrier EV vs Mahindra XEV 9e:టాటా హరియర్ EV, మహీంద్ర XUV 9eలో ఏ ప్రీమియం ఎలక్ట్రిక్ SUV కొనడం మంచిది?

Tata Harrier EV vs Mahindra XEV 9e: భారతీయ మార్కెట్‌లో టాటా ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. సైజు, పనితీరు, రేంజ్ పరంగా ఏ EV మెరుగైనదో ఓసారి చూద్దాం.

Tata Harrier EV vs Mahindra XEV 9e: భారతదేశంలో EV మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు రెండు పెద్ద కంపెనీలు టాటా, మహీంద్రా తమ ప్రీమియం ఎలక్ట్రిక్ SUVsతో పోటీ పడుతున్నాయి. టాటా హ్యారియర్ EV, మహీంద్రా XEV 9e రెండూ తమ సెగ్మెంట్‌లో అత్యుత్తమ కార్లు.  ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలనుకుంటే, వాటి సైజు, పవర్, రేంజ్, ఫీచర్లను పోల్చి చూడాల్సిన అవసరం అయితే ఉంది. తద్వారా సులభంగా నిర్ణయం తీసుకోవడానికి వీలుకలుగుతుంది. అందుకే ఆ పోలికను మేం మీకు అందిస్తున్నాం.

సైజు, డిజైన్ 

మహీంద్రా XEV 9e టాటా హ్యారియర్ EV కంటే కొంచెం పెద్దది. XEV 9e పొడవు 4789mm, వీల్‌బేస్ 2775mm, అయితే హ్యారియర్ EV పొడవు 4598mm, వీల్‌బేస్ 2741mm. రెండూ 5-సీటర్ SUVs, కానీ XEV 9e డిజైన్ మరింత ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది, దీనిలో కూప్ స్టైల్ సిల్హౌట్, లైట్ బార్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 లేదా 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఎలిమెంట్స్ ఉన్నాయి.

మరోవైపు, హ్యారియర్ EV దాని ICE వెర్షన్‌కు చాలా పోలి ఉంటుంది, కానీ దీనిలో కూడా లైట్ బార్, పెద్ద వీల్స్ వంటి స్పోర్టీ, ఏరోడైనమిక్ డిజైన్ ఉంది. డిజైన్ మీ వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది, XEV 9e ఫ్యూచర్ లుక్ ఇస్తుంది, అయితే హ్యారియర్ EV ఒక సాంప్రదాయ SUV అప్పీల్‌ను కలిగి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్, రేంజ్

XEV 9eలో 286bhp సింగిల్ మోటార్ సెటప్ ఉంది, ఇది 59kWh, 79kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఈ సెటప్ 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే నిజ జీవితంలో దాదాపు 500 కిమీ రేంజ్ ఇస్తుంది. అయితే, హ్యారియర్ EV బ్యాటరీ స్పెసిఫికేషన్లు అధికారికంగా ప్రకటించలేదు, కానీ మీడియాల వస్తున్న వివరాల ప్రకారం దీనిలో డ్యూయల్ మోటార్, AWD (ఆల్-వీల్ డ్రైవ్) సెటప్ ఉంటుంది, ఇది 500Nm వరకు టార్క్ ఇస్తుంది. రేంజ్ విషయానికి వస్తే, హ్యారియర్ EV కూడా దాదాపు 500 కిమీ నిజ రేంజ్ ఇవ్వగలదు. అంటే పవర్ విషయంలో హ్యారియర్ EV కొంచెం ముందుంది.

టెక్నాలజీ, ఫీచర్లు

టెక్నాలజీ, ఫీచర్ల విషయంలో మహీంద్రా XEV 9e, టాటా హ్యారియర్ EV రెండూ ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీలతో సిద్ధమైన SUVs. ఇవి వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి ఉన్నవే. మహీంద్రా XEV 9eలో ప్యాటర్న్ లైటింగ్‌తో పనోరామిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మాస్‌తో అమర్చిన 16-స్పీకర్ హర్మన్ కార్డ్ ఆడియో సిస్టమ్, హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, రిమోట్ పార్కింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు, టాటా హ్యారియర్ EVలో కూడా ఇదే స్థాయి టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది, దీనిలో రిమోట్ డ్రైవ్ (సమ్మన్ మోడ్), ADAS లెవెల్-2, పనోరామిక్ సన్‌రూఫ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి సౌకర్యాలు ఉండవచ్చు. 

ఇప్పుడు ధర గురించి మాట్లాడుకుంటే, మహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధర 21.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాని టాప్ వేరియంట్ ధర 31.25 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, టాటా హ్యారియర్ EV ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ దాని ప్రారంభ ధర 22 లక్షల చుట్టూ ఉంటుందని, టాప్ వేరియంట్ ధర దాదాపు 30 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget