అన్వేషించండి

New Cars: అబ్బబ్బా, ఏం ఉన్నాయ్‌ బాబాయ్‌ ఈ 4 బళ్లు - 35km మైలేజ్, ధర రూ.10 లక్షల కన్నా తక్కువ!

Upcoming Compact SUVs: రూ.10 లక్షల బడ్జెట్‌లో కొత్త, ఆధునిక, అధిక మైలేజ్, హై టెక్నాలజీ కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఈ 4 కార్‌లలో ఒకదానిని ఎంచుకోవచ్చు.

Upcoming Compact SUVs 2025: ఇండియన్‌ కార్‌ మార్కెట్‌లో వేగంగా పెరుగుతోంది. త్వరలో, తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్‌ SUVలు, హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు విడుదల కానున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ వాహనాలు లీటరుకు 35 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలవు. సేఫ్టీ ఫీచర్లలోనూ శభాష్‌ అనిపిస్తాయివి. 

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2025 (Tata Altroz Facelift 2025)
టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసింది, త్వరలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో చాలా కాస్మొటిక్‌ ఛేంజెస్‌ జరిగాయి. కొత్త ఫ్రంట్ గ్రిల్‌ & బంపర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & వెనుక భాగంలో కనెక్టెడ్‌ LED టెయిల్ లైట్ బార్ ఉన్నాయి. కార్‌ క్యాబిన్‌లో 26.03 cm డ్యూయల్ HD స్క్రీన్, యాంబియంట్ లైటింగ్ & కొత్త సీట్ ఫాబ్రిక్‌ ఏర్పాటు చేశారు. సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగులు & ఇన్‌బిల్ట్‌ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా యాడ్‌ చేశారు. మెకానికల్‌గా, ఈ కారు ప్రస్తుత ఆల్ట్రోజ్ మోడల్‌ని పోలి ఉంటుంది. అంటే, ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు లేవు.

హ్యుందాయ్ వెన్యూ 2025 (2025 Hyundai Venue)
హ్యుందాయ్‌ బ్రాండ్‌లోని పాపులర్‌ SUV 'వెన్యూ' న్యూఏజ్‌ మోడల్‌ త్వరలో లాంచ్‌ కానుంది. దీని ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. 2025 హ్యుందాయ్ వెన్యూలో కీలక అప్‌డేట్స్‌ ఉంటాయి. కొత్త హెడ్‌లైట్లు, అప్‌డేటెడ్‌ ఫ్రంట్ గ్రిల్ & టెయిల్ లాంప్ డిజైన్‌ కనిపించవచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ & అడ్వాన్స్‌డ్‌ ADAS సేప్టీ సిస్టమ్‌ కూడా ఇంటీరియర్‌కు యాడ్‌ అవుతాయి. ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు & డ్రైవర్‌ అసిస్టెన్స్‌ కోసం 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లను చేర్చారు. మైలేజ్‌ విషయానికి వస్తే.. 2025 హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 15 కి.మీ. మైలేజీని ఇవ్వగలదు & డీజిల్ వేరియంట్ లీటరుకు 21 కి.మీ. మైలేజీని ఇవ్వగలదు.

మారుతి సుజుకీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ (Maruti Suzuki Fronx Hybrid)
మారుతి సుజుకి, హైబ్రిడ్ ఇంజిన్‌తో కూడిన కూపే-స్టైల్‌ SUV 'ఫ్రాంక్స్‌'ను పరిచయం చేయబోతోంది. ఈ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్‌ ధర రూ.10 లక్షల కంటే తక్కువ. ఫ్రాంక్స్ హైబ్రిడ్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ & రియర్ AC వెంట్స్‌ వంటి ప్రీమియం ఫీచర్లు కనిపిస్తాయి. 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ & కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా యాడ్‌ అవుతాయి. భద్రత కోసం, ఈ బండిలో ADAS వ్యవస్థ కూడా పని చేస్తుంది. కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇందులో 1.2 లీటర్ Z12E 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, కంపెనీ ప్రకారం లీటరుకు 35 కి.మీ. వరకు మైలేజీ ఇస్తుంది.

మహీంద్రా XUV 3XO EV (Mahindra XUV 3XO EV)
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV XUV 3XO EV కూడా భారతీ మార్కెట్లో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వెహికల్‌గా లాంచ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. టాటా పంచ్ EVకి పోటీగా ఇది రాబోతోంది. XUV 3XO EV, మహీంద్రా ఎలక్ట్రిక్ లైనప్‌లో XUV400 కంటే లోయర్‌ పొజిషన్‌లో ఉంటుంది.  XUV 3XO EV అంచనా రేంజ్‌ 400 km - 450 km మధ్య ఉంటుంది. ఈ SUV కళ్లను మాయ చేసే స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది &అడ్వాన్స్‌డ్‌ డిజిటల్ ఫీచర్లు డ్రైవర్‌ చేతిలోకి వస్తాయి. ప్రీమియం ఫీచర్లున్న ఈ ఎలక్ట్రిక్ SUVని కామన్‌ మ్యాన్‌కు అందుబాటు ధరలో ఉంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget