Hyundai i20 Magna On EMI: కేవలం రూ.12 వేలకే హ్యుందాయ్ i20 - ప్రీమియం ఫీచర్లున్న బడ్జెట్ బండి ఇది
Hyundai i20 Magna Executive On Loan and EMI: ప్రీమియం ఫీచర్లు & అధిక భద్రతతో బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ కారును కోరుకునే వాళ్లకు ఈ హ్యుందాయ్ ఫోర్‌వీలర్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది.

Hyundai i20 Magna Executive Price And Finance Plan: హ్యుందాయ్ మోటార్స్, తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ i20 సిరీస్‌లో కొత్త వేరియంట్ "మాగ్నా ఎగ్జిక్యూటివ్"ను భారతదేశ రోడ్లపైకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ i20 Era వేరియంట్ కంటే హైలెవెల్‌లో ఉంటుంది & యూత్‌ను టార్గెట్ చేసేలా ఫీవర్ చెప్పించే ఫీచర్లు ఈ కార్‌కు యాడ్ అయ్యాయి.
రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల బడ్జెట్‌లో ఈ స్టైలిష్ కార్ వస్తుంది. యూత్ మెచ్చే స్పోర్టీ లుక్స్, జర్నీలో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ & ప్రీమియం ఫీలింగ్ ఇచ్చే ఇంటీరియర్‌ల గ్రేట్ కాంబినేషన్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్‌గా Hyundai i20 Magna Executive పేరు తెచ్చుకుంది. ఇది మీకు కూడా బెస్ట్ ఛాయిస్ కావచ్చు.
ధర
హ్యుందాయ్ ఐ20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ ఎక్స్-షోరూమ్ ధర (Hyundai i20 Magna Executive ex-showroom price) రూ. 7.51 లక్షలు. దిల్లీలో కొంటే, ఈ బండి ఆన్-రోడ్ ధర (Hyundai i20 Magna Executive on-road price) దాదాపు రూ. 8.44 లక్షలు. ఇందులో.. ఎక్స్-షోరూమ్ ధర, RTO ఛార్జీలు, బీమా & ఇతర ఛార్జీలు కలిసి ఉంటాయి.
ఫైనాన్స్ ప్లాన్
మీరు హ్యుందాయ్ ఐ20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ కొనుగోలు చేసేటప్పుడు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 7.44 లక్షలను బ్యాంక్/ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణంగా తీసుకోవాలి. మీకు 9% వార్షిక వడ్డీ రేటుతో ఈ లోన్ మంజూరైందని అనుకుందాం. అప్పుడు, మీ EMI లెక్క ఇదీ...
* 5 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 15,444 EMI చెల్లించాలి. 60 నెలల్లో (ఐదేళ్లు) మొత్తం రూ. 1,82,653 వడ్డీ చెల్లించాలి. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 9,26,653 అవుతుంది.
* 6 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 13,411 EMI చెల్లించాలి. 72 నెలల్లో (ఆరేళ్లు) మొత్తం రూ. 2,21,592 వడ్డీ చెల్లించాలి. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 9,65,592 అవుతుంది.
* 7 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 11,970 EMI చెల్లించాలి. 84 నెలల్లో (ఏడేళ్లు) మొత్తం రూ. 2,61,503 వడ్డీ చెల్లించాలి. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 10,05,503 అవుతుంది.
మీరు ఏడేళ్ల టెన్యూర్ పెట్టుకుంటే, నెలకు కేవలం రూ.12,000 చెల్లిస్తే సరిపోతుంది, 84 నెలల్లో బ్యాంక్ అప్పు పూర్తిగా తీరిపోతుంది.
బ్యాంక్ మంజూరు చేసే రుణ మొత్తం, వడ్డీ రేటు... మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, ఆదాయ వనరులు, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి.
ఫీచర్లు & సేఫ్టీ
ఖరీదైన కార్లలో కనిపించే ఫీచర్లు హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో కనిపిస్తాయి. ఎంటర్‌టైన్‌మెంట్ + ఇన్ఫర్మేషన్ కోసం పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కార్‌లో ఉంది. దీనిని మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఊరికి వెళుతూ ఉర్రూతలూగించే సంగీతం వినేందుకు బాక్స్ బద్ధలయ్యే 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. కారులో వెళుతూనే బయటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్ ఫీచర్) & TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) కూడా ఇందులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు తాజా గాలిని అందించేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ & ఆకర్షణీయమైన యాంబియంట్ లైటింగ్ ఫీచర్లతో ఈ కారు సాంకేతికత & సౌకర్యాల పరిపూర్ణ కలయికగా దూసుకొచ్చింది.
ఇంజిన్ & పనితీరు
1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో హ్యుందాయ్ ఐ20 పవర్ పొందుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83.13 hp పవర్‌ను & 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కార్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో దొరుకుతోంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ క్లాసిక్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తే & 6-స్పీడ్ CVT (iVT) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మ్యాజికల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.





















