అన్వేషించండి

Simple Ultra vs Ola S1 X Comparison: ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య బిగ్ ఫైట్.. సింపుల్ అల్ట్రా Vs ఓలా ఎస్1 ఎక్స్+! మైలేజీలో ఏది తోపు?

ఇండియ‌న్ మార్కెట్లో సింపుల్ అల్ట్రా, ఓలా ఎస్1 ఎక్స్+ 5.2 kWh మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండింటిలో రేంజ్, స్పీడ్ పరంగా ఏది బెస్ట్ అనిపిస్తుందో తెలుసుకుందాం.

Simple Ultra vs Ola S1 X Comparison News: ఇండియ‌న్ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా పుంజుకుంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రేంజ్, పర్ఫార్మెన్స్ విషయంలో కంపెనీలు సరిహద్దులు దాటుతున్నాయి. తాజాగా సింపుల్ ఎనర్జీ నుండి వచ్చిన 'సింపుల్ అల్ట్రా', ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశపెట్టిన 'ఎస్1 ఎక్స్+ 5.2 kWh' (S1 X+ 5.2 kWh) మోడళ్లు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. ఈ రెండు లాంగ్ రేంజ్ స్కూటర్లలో ఏది ఎంచుకోవాలి? వీటి ధరలు, మైలేజీ ఫీచర్లు ఎలా ఉన్నాయో, వాటి పనితీరు, ఇతర వివరాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

ధరల వివరాలు..
ధర విషయంలో ఈ రెండు స్కూటర్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సింపుల్ అల్ట్రా ఎక్స్‌షోరూమ్ ధర రూ. 2.35 లక్షలుగా ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వివిధ నగరాల్లో టెస్ట్ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఓలా ఎస్1 ఎక్స్+ 5.2 kWh వేరియంట్ ప్రారంభ ధర రూ. 1.30 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) ప్రకటించారు. అయితే ఈ తక్కువ ధర ఆఫర్ ఏప్రిల్ 15, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని తర్వాత ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

రేంజ్ - పర్ఫార్మెన్స్..
మైలేజీ (Range) విషయానికి వస్తే సింపుల్ అల్ట్రా పేపర్ మీద తిరుగులేని విజేతగా నిలుస్తోంది. ఇందులో 6.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఏకంగా 400 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్లలో ఇది ఒకటి. దీనికి పోటీగా ఉన్న ఓలా ఎస్1 ఎక్స్+ కూడా 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌తో సెగ్మెంట్‌లో మంచి పోటీ ఇస్తోంది అని కంపెనీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 

వేగం విషయంలో మాత్రం ఈ రెండు వెహికల్స్ వేర్వేరు అప్రోచ్ కలిగి ఉన్నాయి. సింపుల్ అల్ట్రా గరిష్టంగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. కేవలం 2.77 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో ఓలా ఎస్1 ఎక్స్+ లో 11 kW మిడ్-డ్రైవ్ మోటార్ ఉండటం వల్ల దీని టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లుగా ఉంది. అంటే వేగం పరంగా ఓలా కొంచెం ముందుంది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

స్మార్ట్ ఫీచర్లు..
ఫీచర్ల పరంగా చూస్తే సింపుల్ అల్ట్రాలో నాలుగు స్థాయిల 'ట్రాక్షన్ కంట్రోల్' కలదు. సాధారణంగా స్కూటర్లలో ఇలాంటి ఫీచర్ ఉండటం అరుదు. దీనికి తోడు ఏడు అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే ఉంది. ఓలా ఎస్1 ఎక్స్+ లో 4.3 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే, బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఓలా స్కూటర్ లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన '4680 భారత్ సెల్' వాడటం ఒక గొప్ప విశేషం. బడ్జెట్ తక్కువలో ఉండి స్పీడ్ కావాలనుకునే వారికి ఓలా, అదే అసలు రాజీ లేని రేంజ్ కావాలనుకునే వారికి సింపుల్ అల్ట్రా సరైన ఎంపిక అని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Electric Vehicles: ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EVల ధర ఎందుకు పెరుగుతోంది
ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EV Cost ఎందుకు పెరుగుతోంది
రూ.13.50 లక్షల నుంచి Kia Syros EV - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు? కొనాలంటే ఏది బెస్ట్‌?
Kia Syros EVలో 7 వేరియంట్లు - ఏ వేరియంట్‌ బెస్ట్‌? మీ డబ్బుకు పూర్తి విలువ ఇచ్చేది ఏది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Turbo Brezza కొనాలా? NA Brezza తీసుకోవాలా? - డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో తేడాలు ఏంటి?
కొత్త Maruti Brezzaలో Turbo పెట్రోల్‌ Vs సాధారణ పెట్రోల్‌ - తేడాలు ఏంటో తెలుసా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget