Safest Bikes: స్టైల్ + సేఫ్టీ కూడా! కేవలం 1.5 లక్షలకే 5 డ్యూయల్-ఛానల్ ABS బైక్‌లు
College Bikes Under Rs 1.50 Lakhs: మీరు స్టైల్‌తో పాటు సేఫ్టీని కూడా కోరుకుంటే, డ్యూయల్-ఛానల్ ABS ఉన్న 5 చౌకైన స్పోర్టీ బైకుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Dual Channel ABS Bikes Under Rs 1.50 Lakhs: భారతదేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, కేంద్ర ప్రభుత్వం జనవరి 01, 2026 నుంచి అన్ని ద్విచక్ర వాహనాలలో (ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా) యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను తప్పనిసరి చేయాలని ప్రకటించింది. దీని అర్థం బైక్‌లు, స్కూటర్ల విభాగంలో రైడర్ భద్రత మరింత పెరుగుతుంది, బైక్ కొనేప్పుడు ABS కూడా ఒక కీలక ఫీచర్‌గా మారుతుంది. కాబట్టి, మీరు కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తుంటే, డ్యూయల్-ఛానల్ ABS ఉన్న బైక్‌ను కొనడం తెలివైన పని అవుతుంది. అలాంటి 5 స్పోర్టీ బైక్‌ల గురించి తెలుసుకుందాం. ఇవి లుక్స్‌లో మాత్రమే కాకుండా అధునాతన భద్రతలోనూ ముందుంటాయి.
1. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ (TVS Apache RTR 200 4V )
197.75cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్ పొందుతుంది.
స్పోర్ట్ (20.5 bhp), అర్బన్ & రెయిన్ (17 bhp) అనే మూడు రైడింగ్ మోడ్‌లలో పని చేస్తుంది.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రాష్ అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/SMS అలర్ట్ & రేస్ టెలిమెట్రీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి।
డ్యూయల్-ఛానల్ ABSతో దీని బ్రేకింగ్ పనితీరు అద్భుతంగా ఉంటుంది & యువతలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
TVS Apache RTR 200 4V ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
2. బజాజ్ పల్సర్ N250 (Bajaj Pulsar N250)
లుక్స్‌లో అగ్రెసివ్‌నెస్ & రైడింగ్‌లో పవర్‌ను కోరుకునేవాళ్లకు బజాజ్ పల్సర్ N250 సరైన ఎంపిక.
249.07cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 24.1 bhp పవర్‌ను & 21.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ బైక్ మూడు ABS మోడ్‌లతో వస్తుంది.
ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ & టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
3. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V (Hero Xtreme 160R 4V)
163.2cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 16.6 bhp పవర్‌ను & 14.6 Nm టార్క్ Nm చేస్తుంది.
ఈ విభాగంలో పానిక్ బ్రేక్ అలర్ట్ & డ్యూయల్ డ్రాగ్ మోడ్స్‌తో ఉన్న మొదటి బైక్ ఇది.
KYB USD ఫ్రంట్ ఫోర్కులు, LCD డిజిటల్ కన్సోల్ & డ్యూయల్-ఛానల్ ABS వంటి అధునాతన భద్రతలు ఉన్నాయి.
4. బజాజ్ పల్సర్ N160 (Bajaj Pulsar N160)
యువ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిన స్టైలిష్ & టెక్-ఎక్విప్డ్ 160cc బైక్.
160.3cc ఇంజిన్ ఉంది, ఇది 17 bhp పవర్ & 14.6 Nm టార్క్ Nm చేస్తుంది.
డ్యూయల్-ఛానల్ ABS, USB ఛార్జింగ్ పోర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్ & ఫ్యూయల్ ఎకానమీ రీడౌట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
5. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180 (TVS Apache RTR 180)
177.4cc ఇంజిన్‌తో పని చేస్తుంది
స్పోర్ట్ & అర్బన్, రెయిన్ వంటి మల్టీ రైడ్ మోడ్స్ ఉన్నాయి.
ఇంధన స్టేషన్, ఆసుపత్రి & రెస్టారెంట్ సమాచారం, కాల్ & SMS అలెర్ట్స్, క్రాష్ అలెర్ట్స్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వల్ల బ్రేకులు ఒక్కసారిగా పట్టుకుపోకుండా ఉంటాయి, తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఈ ఫీచర్‌ను 2026 జనవరి నుంచి తప్పనిసరి చేస్తోంది.





















