Buying Used Car: సెకండ్ హ్యాండ్ కార్ కొనేవాళ్లు కచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు - అమాయకంగా ఉంటే మోసపోతారు
Second Hand Car Buying Tips: కొత్త కారు కొనేంత బడ్జెట్ లేనప్పుడు పాత కారును కొంటుంటారు. అయితే, జాగ్రత్తగా లేకపోతే మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది.

Old Car Or Pre-Owned Car Buying Tips: భారతదేశంలో, కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ ఎక్కువ. చాలా మంది, కొత్త కారుకు బదులుగా పాత కారును కొనడాన్ని తెలివైన & బడ్జెట్-ఫ్రెండ్లీ నిర్ణయంగా భావిస్తారు. అయితే, సెకండ్ హ్యాండ్ కారు కొనడం అంత సులభం కాదు. జాగ్రత్తగా లేకపోతే మీరు మోసపోవచ్చు. సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ముందు మీరు కచ్చితంగా గుర్తుంచుకోవలసిన 5 ముఖ్యమైన చిట్కాలు ఇవి:
1. వాహనాన్ని ఎలా తనిఖీ చేయాలి?
- సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు, దాని సాంకేతిక పరిస్థితిని కచ్చితంగా తనిఖీ చేయాలి. కారు బాగున్నా ఇంజిన్ బాగోలేకపోతే మీ డబ్బు వృథా.
- ఇంజిన్ సరిగ్గా పనిచేస్తుందా, రన్నింగ్‌లో ఏదైనా వింత శబ్దం చేస్తుందా వంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలి.
- టైర్ల పరిస్థితి ఎలా ఉందో చూడాలి, అవి పెద్దగా అరిగిపోకూడదు.
- బ్రేక్‌లు బాగా పడుతున్నాయో, లేదా చూడాలి?.
- కారు బాడీపై ఎలాంటి గీతలు, డెంట్లు లేదా పెయింట్ డ్యామేజ్ కనిపించకూడదు.
- ఇంజిన్ ఆయిల్ లేదా కూలెంట్ ఎక్కడి నుండైనా లీక్ అవుతుందా చూడాలి
- మీకు వాహనాల గురించి తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే, మీతో పాటు నమ్మకమైన మెకానిక్‌ను తీసుకెళ్లండి.
- ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయండి. దీనివల్ల, వాహనం వాస్తవ పనితీరు & అంతర్గత సమస్యలను అర్థం చేసుకోవచ్చు.
2. వాహన పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి
- కారు కొనే ముందు, ఆ బండికి సంబంధించిన అన్ని పత్రాలను సరిగ్గా తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
- రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) చెక్ చేయండి - పేరు & చిరునామా సరిగ్గా ఉన్నాయా, వాహనంపై ఏదైనా రుణం బకాయి ఉందా తనిఖీ చేయండి.
- బీమా పత్రాలు అడిగి తీసుకోండి - బీమా యాక్టివ్‌గా ఉందా, లేదా & మునుపటి క్లెయిమ్‌లు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోండి.
- కాలుష్య ధృవీకరణ పత్రం (PUC) చెల్లుబాటు అవుతుందా, లేదా చూడండి.
- సర్వీస్ హిస్టరీ - ఆ వాహనానికి సకాలంలో సర్వీస్‌లు జరిగాయో, లేదో తెలుసుకోండి.
- VIN నంబర్ & ఇంజిన్ నంబర్: ఆన్‌లైన్ ద్వారా ఆ వాహనం అసలు వివరాలు పొందండి.
3. కారు ఖచ్చితమైన ధరను ఎలా కనుగొనాలి?
- కారు రేటు అడిగేప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
- ఆ కారు ఎంత పాతది? ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తింది?
- వాహనం మోడల్, వేరియంట్ & కండిషన్ ఏంటి?
- కారును ఎప్పుడైనా మోడిఫై చేశారా?
- వాహనం ఎప్పుడైనా ప్రమాదానికి గురైందా లేదా వరద వంటి విపత్తులో దెబ్బతిన్నదా?
- మీరు Cars24, OLX Autos, CarDekho వంటి వెబ్‌సైట్‌లలో ఆ మోడల్ ధరను చూడవచ్చు.
- ఒక డీలర్ చాలా చౌక ధరను కోట్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి. దానిలో ఏదో కనిపించని లోపం ఉండవచ్చు.
4. వాహనం పూర్తి చరిత్రను అర్థం చేసుకోండి
- ఉపయోగించిన కారు గురించి నిజమైన నిజం దాని గత సమాచారం ద్వారా తెలుస్తుంది.
- ఇంతకు ముందు ఎంత మంది ఆ కారును కొన్నారో తెలుసుకోండి.
- వాహనం ఎప్పుడైనా ప్రమాదంలో లేదా ఏదైనా విపత్తులో దెబ్బతిన్నదా తెలుసుకోండి.
- సకాలంలో నిర్వహణ అందించారో, లేదో అర్ధం చేసుకోవడానికి సర్వీస్ రికార్డ్‌ను తనిఖీ చేయండి.
- ఆ కారును ఎక్కువసార్లు కొని, అమ్మేసినా లేదా లక్షల కిలోమీటర్ల నడిచినా ఆ బండిని కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.
5. విశ్వసనీయత ఉన్న దగ్గరే కారు కొనండి
- సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేటప్పుడు, నమ్మదగిన & రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్ లేదా విశ్వసనీయ వ్యక్తితో మాత్రమే మాట్లాడండి.
- మహీంద్రా ఫస్ట్ ఛాయిస్, స్పిన్నీ, కార్స్24 వంటి కంపెనీల నుండి కొనవచ్చు.
- మీకు తెలిసిన ఎవరైనా మీకు సరైన సమాచారం ఇస్తుంటే, అది కూడా సరైన ఎంపిక కావచ్చు.
- ఈ ప్లాట్‌ఫామ్‌లు ఇంజిన్ & బాడీ రిపోర్ట్‌లు, RC బదిలీ & వారంటీ వంటివి అందిస్తాయి.
- తెలియని వ్యక్తితో ఎప్పుడూ తొందరపడి లేదా నగదు రూపంలో డీల్ చేయవద్దు.
- డీలర్ ఏదైనా హామీ లేదా సర్వీస్ ప్యాకేజీని అందిస్తుంటే, అన్నింటినీ లిఖితపూర్వకంగా పొందండి.
మీరు ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటించకపోతే మోసానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త.





















