MG M9 Review: MG M9 వెనుక సీటు అనుభవంపై రివ్యూ, ఈ కారు లాంగ్ డ్రైవ్‌కు పనికొస్తుందా?
MG M9 Rear Seat Review: ప్రయాణంలో ఉన్నప్పుడు తమ కారును ఆఫీస్ లేదా లివింగ్ రూమ్‌గా మార్చుకోవాలనుకునే వారి కోసం MG M9 ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

MG M9 Rear Seat Review: MG మోటార్ కొత్తగా విడుదల చేసిన MPV 'MG M9', ఇండియన్ మార్కెట్‌లో ఒక లగ్జరీ కారు. వెనుక సీట్లో కూర్చున్న వారికి ఈ కారు ఫస్ట్-క్లాస్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నిజంగానే ఈ కారు వెనుక సీటు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందా, Toyota Vellfire ను బీట్ చేయగలదా?. వివరంగా తెలుసుకుందాం.
MG M9 వెనుక సీటు అనుభవం
MG M9 రియర్ సీట్లను ప్రెసిడెన్షియల్ సీట్లు అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ కారులో వెనుక వైపు అమర్చిన రెండు పెద్ద ప్రత్యేక పవర్డ్ కెప్టెన్ సీట్ల కారణంగా ప్రయాణీకులకు రాయల్ ట్రీట్‌మెంట్ లభిస్తుంది. ఈ సీట్లలో కూర్చోవడానికి కారుకు రెండు వైపులా స్లైడింగ్ పవర్డ్ డోర్లు ఉన్నాయి. వీటిని రిమోట్, డోర్ హ్యాండిల్ లేదా బటన్ ద్వారా లోపలి నుంచి తెరవవచ్చు.
రియర్ సీట్ల చాలా సౌకర్యవంతంగా & పరిమాణంలో పెద్దవిగా ఉన్నాయి. వాటిలో 16-వే పవర్ అడ్జస్ట్‌మెంట్, 8-వే మసాజ్ మోడ్, హీటింగ్ & వెంటిలేషన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే, పెంచుకోలిగిన లెగ్ రెస్ట్ ఉంది, ఇది సీటును మంచంలా మార్చేస్తుంది. మీరు సుదీర్ఘ ప్రయాణం లేదా ఆఫీస్ సమావేశాల తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఈ సెటప్ ఖచ్చితంగా సరిపోతుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
MG M9 వెనుక క్యాబిన్ ప్రీమియం ఫీచర్ల పుట్ట. ఇవి ఈ కారును న్యూ లగ్జరీ రేంజ్‌కు తీసుకువెళతాయి. రెండు వెనుక సీట్లలో ప్రత్యేక టచ్‌స్క్రీన్ రిమోట్ కంట్రోల్స్ ఉన్నాయి, వీటి సహాయంతో ప్రయాణీకులు తమ సౌలభ్యం ప్రకారం సీటు స్థానం, లైటింగ్ & ఎయిర్ కండిషనింగ్ వంటి చాలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. వినోదం కోసం ప్రతి ప్రయాణీకుడికి ప్రత్యేక డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంది.
ఇంకా... క్యాబిన్‌కు మరింత ప్రీమియం ఫీల్ అందించడానికి పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ & క్లైమేట్ కంట్రోల్ జోన్ అందించారు. సౌండ్ క్వాలిటీ కూడా వేరే లెవెల్‌లో ఉంది. JBL 13-స్పీకర్ ఆడియో సిస్టమ్ గొప్ప స్పష్టత & ధ్వనితో అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.
స్పేస్ & కంఫర్ట్
MG M9 లోపలి భాగం చాలా పెద్దది. లెగ్ స్పేస్ అయినా హెడ్‌రూమ్ అయినా, ప్రయాణీకులకు ప్రతి దిశలో ఓపెన్‌గా & స్వేచ్ఛగా కదిలే అనుభవాన్ని పొందుతారు. సీట్లకు రెండు వైపులా ఉన్న పెద్ద విండోలు క్యాబిన్‌ను మోస్ట్ ప్రీమియంగా మార్చేశాయి. మరో ప్రత్యేకత ఏంటంటే... ఈ కారులోని మూడో వరుస పిల్లలకు మాత్రమే పరిమితం కాదు, పెద్దలు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. ఇది పెద్దల సీటింగ్‌కు చక్కగా సరిపోతుంది & రెండో వరుస తరహాలోనే ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది.
MG M9 కారు Vellfire తో పోటీ పడగలదా?
ఈ ప్రశ్నకు "అవును" అంటూ స్పష్టంగా సమాధానం ఇవ్వవచ్చు. స్పేస్, ఫీచర్లు, టెక్నాలజీ & ముఖ్యంగా వెనుక సీటు అనుభవం పరంగా MG M9, Toyota Vellfire కు గట్టి పోటీ ఇస్తుంది. డ్రైవింగ్ కంటే వెనుక క్యాబిన్‌లో సౌకర్యం & లగ్జరీ అనుభవాన్ని ఎక్కువగా కోరుకునే కస్టమర్లకు MG M9 ఒక అద్భుతమైన కారు కాగలదు.





















