GST 2.0 ఎఫెక్ట్: Meteor 350, Yezdi Roadster రేట్లు డౌన్ - ఏ బైక్ తక్కువలో వస్తుంది?
GST 2.0 తర్వాత Royal Enfield Meteor 350, Yezdi Roadster ధరలు రూ.15,000 కు పైగా తగ్గాయి. ఏ బైక్ ధర ఎంత? ఫీచర్లు, డిజైన్, పనితీరు పరంగా ఏది బెటర్?.

Royal Enfield Meteor 350 vs Yezdi Roadster Comparison: GST 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత, 350cc కేటగిరీలోకి వచ్చే బైక్‌ల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా Royal Enfield Meteor 350, Yezdi Roadster లాంటి మోడళ్ల ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. ఈ రెండు మోటార్ సైకిళ్ల రేట్లు కనీసం రూ. 15,000 వరకు తగ్గడంతో, ఈ సెగ్మెంట్‌లో బైక్ ప్రేమికులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.
Royal Enfield Meteor 350 ధర తగ్గుదల
Meteor 350 లో 349cc ఇంజిన్ ఉంది. కాబట్టి, కొత్త GST రూల్స్ ప్రకారం 350cc కంటే తక్కువ కేటగిరీలోకి వచ్చింది. దీని వల్ల ట్యాక్స్ రేటు తగ్గి, బైక్ ధరలు పడిపోయాయి. ముందుగా Meteor 350 ధరలు ₹2.08 లక్షల నుంచి ₹2.33 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు ₹1.91 లక్షల నుంచి ₹2.14 లక్షల వరకు తగ్గాయి. అంటే సుమారు ₹19,000 వరకు తేడా వచ్చింది.
ఈ బైక్‌లో, తాజాగా, LED హెడ్‌ల్యాంప్స్, స్లిప్పర్ క్లచ్, కొత్త కలర్ ఆప్షన్లు, అలాగే ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్లు ఇప్పుడు స్టాండర్డ్‌గా (బేస్ వేరియంట్ నుంచి) లభిస్తున్నాయి. 349cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో ఇది 20.4hp పవర్ & 27Nm టార్క్ ఇస్తుంది. నగరాల్లోనూ, హైవేలపై కూడా స్మూత్‌గా నడుస్తుంది.
Yezdi Roadster ధర తగ్గుదల
ఇక Yezdi Roadster లో 334cc ఇంజిన్ ఉంది కాబట్టి ఈ మోటార్ బైక్ కూడా 350cc కంటే తక్కువ కేటగిరీలోకి వచ్చింది & దీని ధర కూడా బాగానే తగ్గింది. 2025 మోడల్ ధర మొదటగా ₹2.10 లక్షలుగా ఉండగా, ఇప్పుడు GST 2.0 అమలు తర్వాత ₹1.94 లక్షలకే దొరుకుతోంది. అంటే ₹16,000 ఆదా చేస్తోంది.
కొత్త Yezdi Roadster డిజైన్ అప్‌డేట్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. స్మాల్ రియర్ ఫెండర్, స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ నంబర్ ప్లేట్ హోల్డర్‌తో బాబర్ లుక్ ఇచ్చారు. టెయిల్ ల్యాంప్, ఇండికేటర్లు కొత్తగా రీడిజైన్ అయ్యాయి. ఇందులో ఉన్న 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 29.1hp పవర్ & 29.6Nm టార్క్ ఇస్తుంది. ఇది Meteor కంటే ఎక్కువ శక్తిమంతమైనదే కానీ కాస్త టఫ్ రైడ్ ఫీల్ ఇస్తుంది.
Meteor vs Roadster - ఏ బైక్ బెటర్?
ధర పరంగా చూస్తే Royal Enfield Meteor 350 కాస్త చౌక. Meteor బేస్ వేరియంట్ ₹1.91 లక్షలకే లభిస్తుండగా, Yezdi Roadster బేస్ వేరియంట్ ₹1.94 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. Meteor బేస్ వేరియంట్‌లో స్పోక్ వీల్స్ ఉండగా, Yezdiలో ట్యూబ్‌లెస్ టైర్లు లభిస్తాయి, ఇది ప్రాక్టికల్‌గా మంచి ఆప్షన్.
Meteor హయ్యర్ వేరియంట్లలో ట్యూబ్‌లెస్ టైర్లు, టాల్ టూరింగ్ విండ్ స్క్రీన్ కూడా వస్తాయి. అయితే మార్కెట్ విశ్వసనీయత పరంగా చూస్తే Royal Enfield Meteor కొంత ముందుంది. Yezdi, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌లో కొన్ని చిన్నపాటి ఇబ్బందులను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే, GST 2.0 వల్ల ఈ రెండు బైక్‌లు ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చాయి. Meteor 350 స్థిరమైన పనితీరు, సాఫ్ట్ రైడ్ కోసం అయితే, Yezdi Roadster యూత్‌ఫుల్ లుక్, పవర్ కోసం సరైన ఎంపిక. అంటే, మీరు ఎంచుకోవాల్సింది - కంఫర్ట్ లేదా క్రేజ్.





















