![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొద్ది వారాల క్రితమే కొన్ని మోడల్స్ ధరలు పెంచిన సంస్థ, ఈ సారి మరికొన్ని బైకుల ధరలను పెంచేసింది. రూ.2,755 నుంచి 5,000 వరకు హైక్ చేసింది.
![Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే? Royal Enfield Hunter Classic Himalayan 411 Prices Hiked Check New Rate Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/8c7a4edbfea0de4d462d407779fac8431685519521139544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాయల్ ఎన్‌ఫీల్డ్ వినియోగదారులకు ఆ కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది. మరోసారి తమ బైక్‌ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెరిగిన ధరల వివరాలను వెల్లడించింది. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లాగ్‌షిప్ ఆఫర్ అయిన సూపర్ మీటోర్ 650 ధరలను పెంచిన కొన్ని వారాల తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, క్లాసిక్ 350, స్క్రామ్ 411, హిమాలయన్ 411 ధరలను పెంచింది. ఈ బైక్‌ల ధరలను సుమారు రూ. 5 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధర పెంపు, కొత్త ధరల వివరాలు
హంటర్ 350: రూ. 2,755 పెంపు
భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన బైకులలో ఇది ఒకటి. ప్రారంభించిన నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. ప్రస్తుతం హంటర్ విభాగంలో అందుబాటులో ఉన్న రెండు బైకుల ధరలు రూ. 2,755 పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం హంటర్ 350 డాపర్ కలర్స్ ధర రూ.1,66,901 నుంచి రూ. 1,69,656 రూపాయలకు పెరిగింది. హంటర్ 350 రెబెల్ కలర్స్ ధర రూ. 1,71,900 నుంచి రూ. రూ.1,74,655కి చేరింది.
క్లాసిక్ 350: రూ.2,988 నుంచి రూ. 3,458 వరకు పెంపు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 విభాగంలో 6 బైకులు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ కూడా మంచి ఆరదణ పొందింది. వీటిలో ఆయా మోడల్ ను బట్టి ధర రూ.2,988 నుంచి రూ. 3,458 వరకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. క్లాసిక్ 350 రెడ్డిచ్ ధర రూ. 1,90,092 నుంచి 1,93,080కి పెరిగింది. క్లాసిక్ 350 హాల్సియాన్ డ్రమ్ ధర రూ. 1.92,890 నుంచి రూ. 1,95,919కు పెరిగింది. క్లాసిక్ 350 హాల్సియాన్ డిస్క్ ధర రూ. 1,98,971 నుంచి రూ. 2,02,904కు చేరింది. క్లాసిక్ 350 సిగ్నల్స్ ధర రూ. 2,10,385 నుంచి రూ. 2,13,852కి చేరింది. క్లాసిక్ 350 మాట్టే ధర రూ. 2,17,588 నుంచి రూ. 2,20,991కి పెరిగింది. క్లాసిక్ 350 క్రోమ్ ధర రూ. 2,21,297 నుంచి రూ. 2,24,755కి చేరింది.
స్క్రామ్ 411: ధర రూ. 3,849 నుంచి రూ. 3,391కి పెంపు
స్క్రామ్ 411 అనేది 19-అంగుళాల ఫ్రంట్ వీల్ తో హిమాలయన్ యూత్‌ఫుల్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో మూడు బైకులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 3,849 నుంచి రూ. 3,391కి పెరిగింది. స్క్రామ్ 411 గ్రాఫైట్ రంగు బైక్ ధర రూ. 2,03,085 నుంచి 2,06,934కు చేరింది. స్క్రామ్ 411 బ్లేజింగ్ బ్లాక్/స్కైలైన్ బ్లూ ధర రూ. 2,04,921 నుంచి రూ. 2,08,257 వరకు పెరిగింది. స్క్రామ్ 411 వైట్ ఫ్లేమ్/సిల్వర్ స్పిరిట్ ధర రూ.2,08,593 నుంచి రూ. 2,11,984 వరకు పెరిగింది.
హిమాలయన్ 411: ధర రూ. 5,000 పెంపు
హిమాలయన్ 411 అనేది కంపెనీ అత్యంత ఆఫ్-రోడ్-కేబుల్ ఆఫర్. ఇది ఇది సరికొత్త లిక్విడ్-కూల్డ్, 450cc మోడల్‌తో త్వరలో అందుబాటులోకి వస్తుంది. దీని ధర కూడా పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. హిమాలయన్ గ్లేసియర్ బ్లూ/స్లీట్ బ్లాక్ ధర రూ. 2.23 లక్షలు కాగా రూ. 5 వేలు పెరిగి రూ.2.28 లక్షలకు చేరుకుంది.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)