అన్వేషించండి

Royal Enfield Bullet 650 ఆవిష్కరణ ఈ రోజే - క్లాసిక్‌ లుక్‌తో మోడర్న్‌ అప్‌డేట్స్‌

Royal Enfield ఈ రోజు (మంగళవారం) మిలాన్‌లో జరగబోయే EICMA 2025లో Bullet 650 ని ఆవిష్కరించనుంది. క్లాసిక్‌ 650లోని 648 సీసీ ఇంజిన్‌, కొత్త డిజైన్‌తో ఈ బైక్‌ యూత్‌ని అట్రాక్ట్‌ చేస్తుంది.

Royal Enfield Bullet 650 Launch Date Specifications: మోటార్‌ సైకిల్‌ ప్రేమికులందరికీ మంచి వార్త. రాయల్ ఎన్‌ఫీల్డ్‌, తన లెజెండరీ బుల్లెట్‌ మోడల్‌ను కొత్త తరహాలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ రోజు (మంగళవారం, 4 నవంబర్‌ 2025) మిలాన్‌లో జరుగుతున్న 'EICMA 2025 షో'లో బుల్లెట్ 650ని గ్లోబల్‌గా ఆవిష్కరించనుంది. ఈ బ్రాండ్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో షేర్‌ చేసిన టీజర్‌లో, రైడర్‌ పర్‌స్పెక్టివ్‌లో కనిపించే ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో పాటు క్లాసిక్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎగ్జాస్ట్‌ థంప్‌ వినిపించింది. “A new chapter in motorcycling’s oldest legacy” అనే ట్యాగ్‌లైన్‌తో, బుల్లెట్‌ వారసత్వంలో మరో కొత్త అధ్యాయం మొదలవబోతోందని ఇది స్పష్టం చేస్తోంది.

బుల్లెట్ 650 ఇంజిన్‌ & పెర్ఫార్మెన్స్‌
ఈ బుల్లెట్ 650లో కూడా, సుపరిచితమైన 648 cc పారలల్-ట్విన్‌ ఇంజిన్‌నే కంపెనీ ఉపయోగిస్తోంది. ఇది 47 హార్స్‌పవర్‌, 52.3 Nm టార్క్‌ ఇచ్చే పవర్‌ఫుల్‌ ఇంజిన్‌. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, స్లిప్పర్-అసిస్ట్‌ క్లచ్‌తో వస్తుందని అంచనా. అయితే, బుల్లెట్‌ స్పూర్తికి తగ్గట్టు కొంచెం రిలాక్స్‌డ్‌ ట్యూనింగ్‌ ఉండొచ్చని సమాచారం.

బుల్లెట్ 650 ప్రత్యేకతలు
డిజైన్‌ పరంగా ఈ బైక్‌ ఒక క్లాసిక్‌ ఆర్ట్‌ వర్క్‌లా కనిపిస్తోంది. హెడ్‌ల్యాంప్స్‌ చుట్టూ క్రోమ్‌ హుడ్‌, ఫ్యూయల్‌ ట్యాంక్‌ మీద హ్యాండ్‌ పెయింటెడ్‌ పిన్‌స్ట్రైప్స్‌, మెటల్‌ ట్యాంక్‌ బ్యాడ్జెస్‌ - ఇవన్నీ పాత బుల్లెట్‌ స్టైల్‌కి సరిగ్గా సరిపోతాయి. ఈసారి డిజైన్‌లో చిట్టచివరి టచ్‌లలో కూడా మోడర్న్‌ ఫినిషింగ్‌ ఇచ్చారు.

ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ క్లాసిక్ 650లో వాడిన డిజిటల్-అనలాగ్‌ యూనిట్‌తో సేమ్‌గా కనిపిస్తోంది. స్పీడోమీటర్‌ ఆనలాగ్‌ మోడ్‌లో, ఫ్యూయల్‌ గేజ్‌, ఓడామీటర్‌ చిన్న డిజిటల్‌ డిస్‌ప్లేలో ఉన్నాయి. అదనంగా.. బ్రేక్‌, క్లచ్‌ లీవర్స్‌ అడ్జస్టబుల్‌ చేసుకునేందుకు అవకాశం ఉండి, ట్రిప్పర్‌ నావిగేషన్‌ పాడ్‌‌ను ఐచ్ఛికంగా అందించే అవకాశం ఉంది.

ఇప్పటికే బలమైన లైనప్‌
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పటికే ఇంటర్సెప్టర్ ‍‌(Interceptor), కాంటినెంటల్ GT (Continental GT), షాట్‌గన్ (Shotgun), క్లాసిక్ 650 (Classic 650) మోడల్స్‌తో 650 సీసీ సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లెట్ 650తో ఆ జాబితా మరింత విస్త్రతమవుతుంది.  

తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత ఉంటుంది?
భారతీయ మార్కెట్‌లో ఈ బైక్‌ ప్రారంభ ధర (ఎక్స్‌-షోరూమ్‌) సుమారు రూ. 3.30 లక్షల వద్ద ఉండొచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ఎక్స్‌-షోరూమ్‌ రేటు ఉండవచ్చు. హైదరాబాద్‌, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో ఇది 2025 చివరి నాటికి అందుబాటులోకి రావచ్చు.         

లెజెండరీ బుల్లెట్‌ సౌండ్‌ (థంప్‌), క్లాసిక్‌ లుక్‌, న్యూ జనరేషన్‌ టచ్‌ - ఈ మూడింటి మేళవింపుతో వస్తున్న బుల్లెట్ 650, యూత్‌కి “మస్ట్-వాచ్” బైక్‌గా మార్చబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది.         

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Advertisement

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Embed widget