Tata Punch CNG vs Hyundai Exter CNG మైలేజ్ కంపారిజన్ - రోడ్ టెస్ట్‌లో ఏ కారు ముందుంది?
టాటా పంచ్ CNG, హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG మధ్య గట్టి పోటీ ఉంది. మైలేజ్, సౌకర్యాలు, రోడ్‌పై ప్రదర్శనలో ఏ కారు ముందుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tata Punch CNG vs Hyundai Exter CNG Mileage Comparison: టాటా పంచ్ & హ్యుందాయ్ ఎక్స్‌టర్ మధ్య పోటీ రెండున్నరేళ్లుగా కొనసాగుతుంది. మొదట పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో ఎక్స్‌టర్ మెరుగ్గా నిలిచింది. సీఎన్జీ వేరియంట్‌లు వచ్చాక ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. రెండు కార్లలోనూ డ్యూయల్ సిలిండర్ CNG సెటప్, సగటుగా 27 కిలోమీటర్ల మైలేజ్, సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అయితే నిజమైన పరీక్ష, ఫలితం తెలిసేది రోడ్డుపైనే.
ఇంటీరియర్ & కంఫర్ట్
టాటా పంచ్‌లో కూర్చోవడం, దిగడం సులభం. హై-రైడింగ్ పొజిషన్, వెడల్పైన డోర్లు వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటాయి. డ్రైవర్‌కు బానెట్ అంచులు కనిపించడం వల్ల రోడ్డు పై నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. గేర్ మార్పులు తేలికగా ఉండటం, సాఫ్ట్ క్లచ్, ప్రతి సీటుకి వేర్వేరు ఆర్మ్‌రెస్ట్‌లు వంటివి లాంగ్ డ్రైవ్‌లకు అదనపు కంఫర్ట్ ఇస్తాయి. శబ్దం తక్కువగా ఉండే మ్యూజిక్ సిస్టమ్ కూడా పంచ్ ప్రత్యేకతల్లో ఒకటి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లోనూ ప్రతి కంట్రోల్ చాలా తేలికగా పని చేస్తుంది. గేర్‌బాక్స్, స్టీరింగ్ అన్నీ సాఫ్ట్‌గా అనిపిస్తాయి - సిటీ ప్రయాణాలకు పర్‌ఫెక్ట్. సీట్లు కొంచెం చిన్నగా ఉన్నా, ఇంటీరియర్ క్వాలిటీ మాత్రం టాటా కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే గాఢమైన సింగిల్-టోన్ కలర్ థీమ్ వల్ల కేబిన్ అంతగా విశాలంగా అనిపించదు.
ఇంజిన్ & పనితీరు
రోడ్ టెస్ట్ సమయంలో... Punch CNG ఇంజిన్ సిటీలో బాగానే స్పందించింది. అయితే, ఓవర్‌టేకింగ్ సమయంలో కొంచెం కష్టపడుతుంది. కానీ హైవేపై దాని స్టెబిలిటీ అద్భుతం, ఎక్స్‌టర్ కంటే బాగా రోడ్డును అంటిపెట్టుకుని ఉంటుంది. Exter CNG మాత్రం స్మూత్‌గా దూసుకుపోతుంది. దీని 4-సిలిండర్ ఇంజిన్ సైలెంట్‌గా, పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది. గేర్ మార్పుల అవసరం పెద్దగా రాదు. ఎక్స్‌టర్ 0–100 కి.మీ. వేగం చేరడానికి 14.85 సెకన్లు మాత్రమే పడుతుంది, ఇది పంచ్ కంటే మూడు సెకన్లు ఎక్కువ వేగం.
సిటీలో Exter మైలేజ్ 22.8 కి.మీ./కిలోగ్రామ్ కాగా, Punch మైలేజ్ 20.7 కి.మీ./కిలోగ్రామ్. కానీ హైవేపై Punch 31 కి.మీ./కిలోగ్రామ్ సాధించగా, Exter 30.3 కి.మీ./కిలోగ్రామ్‌కే పరిమితమైంది. మొత్తంగా, ఈ రెండు కార్లు తమ కంపెనీలు క్లెయిమ్ చేసిన 27 కి.మీ./కిలోగ్రామ్ మైలేజ్‌కి దగ్గరగా ఉన్నాయి.
ఫీచర్లు & సేఫ్టీ
Punch CNG మిడ్ వేరియంట్‌లో క్రూజ్ కంట్రోల్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌టర్ SX టాప్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిరర్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
బూట్ స్పేస్
బూట్ స్పేస్‌లో రెండింటికీ పరిమితి ఉన్నా, పంచ్ కొంచెం ఎక్కువగా ఉపయోగపడుతుంది. టాటా పూర్తి స్థాయి స్పేర్ టైర్ ఇస్తే, ఎక్స్‌టర్‌లో కేవలం రిపేర్ కిట్ మాత్రమే ఉంది.
Tata Punch iCNG సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి సరైన ఎంపిక. దాని బలమైన బాడీ, ఎత్తైన సీటింగ్, సౌండ్ క్వాలిటీ ఆకట్టుకుంటాయి. కానీ సేఫ్టీ ఫీచర్లలో కొద్దిగా వెనుకబడి ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG మాత్రం సిటీ డ్రైవింగ్ కోసం పర్‌ఫెక్ట్. మైలేజ్, సేఫ్టీ, రిఫైన్‌మెంట్‌లో అది ముందుంది. మొత్తంగా చూస్తే, బ్యాలెన్స్‌డ్ & ప్రాక్టికల్ ప్యాకేజీగా Hyundai Exter CNG బాగుటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















