Nissan Magnite Facelift Bookings: నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ - లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
Nissan New Car: నిస్సాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ కారుకు సంబంధించిన బుకింగ్స్ మనదేశంలో ఇటీవలే ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 4వ తేదీన ఈ కారు భారతదేశ మార్కెట్లో లాంచ్ కానుంది.
Nissan Magnite Facelift: నిస్సాన్ మోటార్ ఇండియా కొత్త కారు మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మరి కొద్ది రోజుల్లో లాంచ్ కానుంది. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 4వ తేదీన మార్కెట్లోకి రానుంది. కంపెనీ ఈ కారు బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. దీంతో పాటు కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన మరుసటి రోజు నుంచే అంటే అక్టోబర్ 5వ తేదీ నుంచే డెలివరీ చేయడం కూడా ప్రారంభిస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రత్యేకత ఏమిటి?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ గురించి చెప్పాలంటే... ఈ కారు ముందు భాగానికి భిన్నమైన రూపాన్ని ఇవ్వవచ్చు. గ్రిల్, హెడ్‌ల్యాంప్స్‌ను దాని ఫ్రంట్ ఫాసియా భిన్నంగా కనిపించేలా మార్చవచ్చు. టెయిల్‌లైట్ల డిజైన్‌లో కూడా మార్పు ఉండవచ్చు. ఇది కాకుండా ఈ నిస్సాన్ కారులో కొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా చూడవచ్చు.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
కొత్త మాగ్నైట్ లోపలి భాగం ఎలా ఉంటుంది?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగాన్ని కూడా కొన్ని అప్‌డేట్‌లతో తీసుకురావచ్చు. ఈ కారులో సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను చూడవచ్చు. అదే సమయంలో ఈ కారులో పెద్ద తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా కనుగొనబడుతుందని భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించవచ్చని వార్తలు వస్తున్నాయి. కారులో డ్రైవర్ కోసం ఏడు అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను కూడా కనుగొనవచ్చు.
నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్ ఇంజిన్ ఏది?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ ఇంజిన్‌ను పోలి ఉంటుంది. ఈ నిస్సాన్ కారు ఇంజన్ నేచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్, టర్బోచార్జ్డ్ యూనిట్ రెండింటిలోనూ వస్తోంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్‌లు 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇందులోని నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ 71 బీహెచ్‌పీ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. అదే సమయంలో టర్బోచార్జ్డ్ యూనిట్ 98 బీహెచ్‌పీ పవర్‌ని, 160 ఎన్ఎం టార్క్‌ను కూడా అందిస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత ఉండవచ్చు?
భారతీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ధర రూ. 11.27 లక్షల వరకు ఉంది. ఇప్పుడు దాని ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర ఎంత అనేది చూడాల్సి ఉంది. రూ.10 లక్షల్లోపు ధరలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ రావచ్చు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
Step into the new Nissan Magnite and feel the freshness of best quality air. From 400 AQI to 30 in just 20 minutes—because your ride deserves clean air! One car. One world.
— Nissan India (@Nissan_India) September 30, 2024
India bookings open. https://t.co/SBL7zIXfHo
Delivery starts October 5th.#OneCarOneWorld #NewMagnite pic.twitter.com/BzKGGDeH7q