Maruti Suzuki Dzire: తగ్గేదెలే అంటున్న మారుతి సుజుకి డిజైర్.. ప్రీమియం ఫీచర్లతో రంగ ప్రవేశం!
Maruti Suzuki Dzire:త్వరలో విడుదల కానున్న న్యూ మారుతి సుజుకి డిజైర్ ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఇప్పుడున్న డిజైర్‌తో పోల్చితే భారీ మార్పులు, కొత్త కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది.
Maruti Dzire Launching With Premium Features: సరికొత్త మారుతి డిజైర్ మోడ్రన్ లుక్‌తో పాటు కొనుగోలుకి అందుబాటులో ఉన్న ఇతర మారుతి లైనప్స్ కంటే ఎక్కువ ఫీచర్లు, భారీ డిజైన్‌తో మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. మారుతి స్విఫ్ట్ తర్వాత ఫేమస్ కారుగా ఈ డిజైర్ ఉంది. స్టైలింగ్ పరంగా న్యూ జనరేషన్ డిజైర్ ప్రస్తుత వేరియంట్ కంటే భిన్నంగా కనిపించనుంది. ఈ సరికొత్త సెడాన్ దీని అసలైన డిజైర్ రూపాన్ని కోల్పోనుంది. ఇది స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇందులో పెద్ద గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు మరికొన్ని ప్రీమియం పొజిషనింగ్ యాడ్ ఆన్స్‌తో సరికొత్త అవతారంలో కనిపించనుంది.
కొత్త హంగులతో..
ఈ మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ ముఖ్యంగా ప్రీమియం కొనుగోలుదారులను ఆకట్టుకోనుంది. సెడాన్ సెగ్మెంట్‌లో మారుతి చాలా కాలంగా కొత్తగా వేరియంట్లను విడుదల చేయలేదు. కాబట్టి ఇందులో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన స్పై ఫోటోస్ కూడా దీనిని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇక డిజైర్ పాతదాని కంటే పెద్దదిగా.. ఇంటీరియర్స్ స్విఫ్ట్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఇది ఢిఫరెంట్ కలర్ స్కీమ్ ఆప్షన్స్‌తో రంగం ప్రవేశం చేయనుంది. ఫీచర్లతో పాటు అధునాతన సాంకేతికతో కూడిన టెక్నాలజీని ఇందులో మారుతి అందించనుంది.
ఇక దీని ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే ప్లస్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతోపాటు స్టాండర్డ్ సన్‌రూఫ్‌తో రానుంది. ఈ డిజైర్ ఇప్పటి వరకు సన్‌రూఫ్ లేదు. ఇప్పుడు దీనిలో ఈ ఫీచర్‌ని అందించనున్నారు. ఈ న్యూ జనరేషన్ మారుతి సుజుకి సేల్స్ పరంగా మైక్రో ఎస్‌యూవీలతో పోటీ పడే అవకాశం ఉంటుంది. మంచి ఇంటీరియర్ స్పేస్ భారీ డిజైన్ కలిగిన సెడాన్‌లో ఇది బెస్ట్‌గా ఉండనుంది.
అదే ఇంజిన్‌తో..
ఇక దీని పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ఇది మునుపటి మోడళ్ల మాదిరిగానే అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. అయితే ఇది ఇంకా అధిక మైలేజీని అందించేలా కంపెనీ ఇంజిన్‌ని అప్‌డేట్ చేయనుంది. ఇక స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ఆప్షన్‌ని కూడా అందింటనున్నారు. తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఈ సెడాన్‌ని కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో తీసుకువచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మారుతి సుజుకి ఈ సంవత్సరం పండుగ సీజన్‌లోనే అంటే రానున్న కొద్ది రోజుల్లోనే ఈ కొత్త డిజైర్‌ని విడుదల చేయనుంది. దీనిని ప్రస్తుత ధర కంటే ఎక్కువ ధరలో తీసుకువచ్చే అవకాశం ఉంది.
ధర పెరిగినా కానీ ఇందులోని స్టాండర్డ్ ఫీచర్లు, అప్‌గ్రేడ్స్ కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. మార్కెట్‌లో డిజైర్ ఇప్పటికే భారీ ఫ్యాన్‌బేస్‌ని కలిగి ఉంది. ముఖ్యంగా క్యాబ్ సర్వీసుల్లో ఎక్కువగా ఈ డిజైర్ కార్లను జనాలు ఎక్కువగా కొంటూ ఉంటారు. ఈ మార్కెట్‌ని కంటిన్యూ చేస్తూనే ప్రీమియం ఫీచర్లతో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ అవ్వాలనే ఉద్దేశంతో దీనిని మారుతి సుజుకి ప్రవేశ పెడుతుంది.
Also Read: లగ్జరీ EV SUVని లాంఛ్ చేసిన మెర్సిడిస్ బెంజ్, ధర రూ.కోటిన్నర - అదిరిపోయే ఫీచర్స్