అన్వేషించండి

బాక్సీ లుక్‌, Ioniq 5 స్టైల్‌ టెయిల్‌ల్యాంప్స్‌తో సూపర్‌ డిజైన్‌ - కెమెరాకు చిక్కిన కొత్త హ్యుందాయ్ టెస్టింగ్‌ SUV

భారత్‌లో, తొలిసారి కొత్త హ్యుందాయ్ SUV టెస్టింగ్‌లో కనిపించింది. Ioniq 5 తరహా టెయిల్‌ల్యాంప్స్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు దీనిలో కనిపించాయి. ఇది పూర్తిగా కొత్త మోడల్‌గా భావిస్తున్నారు.

New Hyundai SUV India 2026: భారత ఆటో మార్కెట్‌లో హ్యుందాయ్ నుంచి మరో కొత్త సర్‌ప్రైజ్‌ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, కొత్త హ్యుందాయ్ SUV ఒకటి ముంబై రోడ్లపై టెస్టింగ్‌లో తొలిసారి కనిపించింది. ఈ SUV పూర్తిగా కొత్త మోడల్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌లో ఎక్కడా కనిపించని ఈ వాహనం, డిజైన్‌ పరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

లుక్‌ & డిజైన్‌ ఇలా ఉండొచ్చు!
స్పై ఫోటోల ప్రకారం, ఈ కొత్త హ్యుందాయ్ SUVకి నిటారుగా ఉండే SUV తరహా స్టాన్స్‌, బాక్సీ డిజైన్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మందపాటి MRF టైర్లు, సుమారు 16 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ డైమండ్‌ కట్‌ అలాయ్ వీల్స్‌ దీనికి మస్కులర్‌ లుక్‌ను ఇస్తున్నాయి. వీల్‌ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్‌ బాడీ క్లాడింగ్‌ ఉండటం వల్ల ఇది ఆఫ్‌ రోడ్‌ స్పూర్తితో రూపొందించిన మోడల్‌గా అనిపిస్తోంది.

డిజైన్‌ వివరాల్లోకి వెళ్తే, ఫ్లష్‌ ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, మందపాటి C పిలర్‌, బ్లాక్‌ రూఫ్‌ రైల్స్‌ స్పష్టంగా కనిపిస్తున్నాయి. డాటెడ్ ప్యాటర్న్‌లో ఉన్న LED టెయిల్‌ల్యాంప్స్‌ ఈ కారు వెనుక భాగంలో ప్రత్యేకంగా కనిపించే అంశం. ఇవి హ్యుందాయ్ Ioniq 5 నుంచి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే, ఫంకీ డిజైన్‌ ఉన్న రియర్‌ స్పాయిలర్‌, అందులోనే ఇంటిగ్రేట్‌ చేసిన స్టాప్‌ ల్యాంప్‌ ఈ SUVకి మరింత ఆధునిక లుక్‌ను ఇస్తున్నాయి.

ఇంకా గమనించదగిన అంశాల్లో షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా, వెనుక వైపు పైకి వంపు తిరిగిన బ్లాక్‌డ్‌ అవుట్‌ విండో లైన్‌, ఫ్లాట్‌ టెయిల్‌ గేట్‌, నంబర్‌ ప్లేట్‌ను హౌస్‌ చేసే బీఫీ రియర్‌ బంపర్‌ ఉన్నాయి. మొత్తం చూసుకుంటే, ఇది ఇప్పటివరకు హ్యుందాయ్ నుంచి వచ్చిన SUVలకంటే భిన్నమైన డిజైన్‌ లాంగ్వేజ్‌ను అనుసరించినట్లు తెలుస్తోంది.

ఇంటీరియర్‌ ఇలా ఉండొచ్చు!
ఇంటీరియర్‌ విషయానికి వస్తే, స్పై షాట్స్‌లో కేబిన్‌ స్పష్టంగా కనిపించకపోయినా, కొన్ని కీలక వివరాలు బయటపడ్డాయి. ఇందులో సుమారు 10 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ORVMలపై కనిపించిన నోడ్యూల్స్‌ ఆధారంగా, ఈ SUVలో 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ కూడా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అసలు ఈ SUV ఏ మోడల్‌ అన్నది ఇప్పటివరకు హ్యుందాయ్ స్పష్టం చేయలేదు. అయితే, గత ఏడాది అక్టోబర్‌లో హ్యుందాయ్ తన ఇన్వెస్టర్‌ ప్రెజెంటేషన్‌లో ‘మస్కులర్‌, ఆఫ్‌ రోడ్‌ సామర్థ్యం ఉన్న కొత్త SUV’ గురించి టీజ్‌ చేసింది. ఇదే ఆ మోడల్‌ కావచ్చని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది మోనోకాక్‌ ప్లాట్‌ఫామ్‌పై, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌తో రావచ్చని సమాచారం. మరోవైపు, ఇది Kia EV2కి హ్యుందాయ్ వెర్షన్‌, అంటే చిన్న ఎలక్ట్రిక్ SUV అయ్యే అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతోంది.

మొత్తానికి, ఈ కొత్త హ్యుందాయ్ SUV భారత్‌లో ఎలాంటి సెగ్మెంట్‌ను టార్గెట్‌ చేస్తుందో, ఎలక్ట్రిక్‌ మోడలా లేదా ICE వెర్షనా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ, ఒక విషయం మాత్రం ఖాయం - హ్యుందాయ్ నుంచి రాబోయే ఈ కొత్త SUV మార్కెట్‌లో మంచి ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Clean Cloudy Car Headlights: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget