Grand Vitara Hybrid: దేశీయ మార్కెట్లోకి మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ - ధర, ప్రత్యేకతలు ఇవే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ మిడ్ సైజ్ SUV స్పేస్‌లోకి మళ్లీ అడుగు పెట్టింది. 2013లో గ్రాండ్ విటారాను నిలిపి వేసిన కంపెనీ.. తిరిగి సరికొత్తగా వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చే మారుతి సుజుకి కంపెనీ.. తాజాగా మరో లేటెస్ట్ కారును భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. గ్రాండ్ విటారా హైబ్రిడ్ పేరుతో మిడ్ సైజ్ SUV పరిచయం చేసింది. గ్రాండ్ విటారా అనేది యూరోపియన్ గ్రాండ్ విటారాను ఇంచుమించు పూర్తి స్థాయిలో డెవలప్ చేసిన కారు. దీని పునర్నిర్మాణం టయోటా ఇండియా భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. గ్రాండ్ విటారా పవర్ ఫుల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఇందులో పెట్రోల్ మిల్లు, ఎలక్ట్రిక్ మోటార్, ప్రధాన USP అయిన బ్యాటరీని కలిగి ఉంది. ఇటీవల విడుదల చేసిన టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ తో పాటు మరే ఇతర మిడ్ రేంజ్ SUV ఈ హైబ్రిడ్ టెక్‌తో అందించబడలేదు.
టయోటా ఇండియా గత కొంత కాలంగా మారుతి సుజుకి కార్లను రీబ్యాడ్జ్ చేసి దేశీయ మార్కెట్లో తన బ్యానర్ క్రింద విక్రయిస్తోంది. అలాగే మారుతి సుజుకికి గ్రాండ్ విటారా కోసం హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అదే కంపెనీ అందిస్తున్నది. టయోటా 1500cc మూడు-సిలిండర్ ఇంజన్ అట్కిన్సన్ సైకిల్‌పై నడుస్తుంది. దాదాపు 91 BHP, 122 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంటర్నల్ కంబషన్ 79 BHP, 141 Nm టార్క్‌ను విడుదల చేసే ఎలక్ట్రిక్ మోటారుతో కలపడింది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 115 BHP పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. e-CVT గేర్ బాక్స్‌కు అటాచ్ చేయబడింది.
EVల మాదిరిగా ఈ వాహనం యొక్క బ్యాటరీని ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ ద్వారా బ్యాటరీ ఆటోమేటిక్‌గా రీఛార్జ్ అవుతుంది. మారుతి 4.3 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న కారు కోసం 27.97 కిమీ/లీ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. కారు యొక్క పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 45 లీటర్లు. ట్యాంక్ ఫుల్ తో సుమారు 1,000 కిమీ నుంచి 1,100 కిమీల మధ్య దూరాన్ని పొందే అవకాశం ఉంది.
డిజైన్, ఫీచర్లు
మారుతి-సుజుకి గ్రాండ్ విటారా 4,345mm పొడవు, 1795mm వెడల్పు,1645mm ఎత్తును కలిగి ఉంది. ఇది పొడవైన కార్లలో ఒకటి. 2,600mm వీల్‌బేస్‌తో వస్తుంది. 208mm గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీ 373-లీటర్ బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఇది దాని నాన్-హైబ్రిడ్ వెర్షన్ కంటే తక్కువగా ఉంటుంది.
మారుతి-సుజుకి గ్రాండ్ విటారా డిజైన్.. సుజుకి S-క్రాస్ డిజైన్ నుంచి స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. ట్రై-ఎల్‌ఈడీ ప్యాటర్న్‌తో ఎగువన LED DRLలను పొందుతుంది. హెడ్‌లైట్ అసెంబ్లీలు బంపర్‌పై ఉంచబడ్డాయి. ఇది పెద్ద గ్రిల్, సుజుకి లోగోను కలిగి ఉన్న మందపాటి క్రోమ్ స్ట్రిప్ తో వస్తుంది. గ్రాండ్ విటారా మస్కులర్ ఫ్రంట్-ఎండ్‌ను కలిగి ఉంది. వెనుక వైపున, ట్రై-LED నమూనాతో అనుసంధానించబడిన టెయిల్ ల్యాంప్ డిజైన్ తో వస్తుంది. వెనుక బంపర్ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్ తో సమానంగా ఉంటుంది. పెద్ద సిల్వర్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్ ను కలిగి ఉంటుంది.
ఇక ఈ కారు ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ థీమ్‌తో వస్తుంది. ప్రీమియం లుక్, ఫీల్ కోసం డాష్‌బోర్డ్, డోర్ సైడ్ ప్యానెల్స్‌పై సాఫ్ట్-టచ్ మెటీరియల్ కలిగి ఉంది. స్టీరింగ్ వీల్ సాధారణ మారుతి-సుజుకి కార్ల మాదిరిగానే ఉంటుంది. D-కట్ వీల్ కాదు.ఇక 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైట్, టైర్ ప్రెజర్ మానిటర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆరు ఎయిర్‌బ్యా గ్‌లను కలిగి ఉంది.
ధర ఎంతంటే?
మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వెర్షన్ Zeta+, Alpha+ వేరియంట్‌లలో మాత్రమే వస్తుంది, వీటి ధర ₹17.99 లక్షలు, ₹19.49 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ఫిక్స్ చేసింది. ఈ కారు ఇప్పటికే 53,000 బుకింగ్‌లను సంపాదించింది.
Also Read: ఇండియాలో టాప్ 5 ఫాస్టెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే!
Also Read: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?