అన్వేషించండి

ధర ఎప్పుడు ప్రకటిస్తారు సారూ? మారుతి ఇ విటారా, టయోటా ఇబెల్లా చుట్టూ ప్రైస్‌ ట్యాగ్‌ మిస్టరీ!

మారుతి ఇ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా షోరూమ్‌ల్లోకి చేరినా ఇంకా ధర ప్రకటించలేదు. ఏ కంపెనీ ముందుగా ధర వెల్లడిస్తుందోనన్న ఆసక్తి అందరిలో ఉంది.

Maruti Suzuki e Vitara EV: భారత ఈవీ మార్కెట్‌లో ప్రస్తుతం పెద్ద చర్చ ఏంటంటే - మారుతి సుజుకి ఇ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా ధర ఎప్పుడు ప్రకటిస్తారు?. ఈ రెండు కంపెనీలు తమ కార్లను షోరూమ్‌లకు పంపించాయి. బుకింగ్స్‌ కూడా ప్రారంభించాయి. పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడించాయి. కానీ అసలు ముఖ్యమైన అంశం అయిన ధరను మాత్రం ఇంకా బయట పెట్టలేదు.

మారుతి అలా...
మారుతి సుజుకి గత రెండు సంవత్సరాలుగా ఇ విటారా కథను అల్లుతూ వస్తోంది. 2023 ఆటో ఎక్స్‌పోలో eVX కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ప్రయాణం, 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రొడక్షన్ మోడల్‌ ప్రదర్శనతో మరో దశకు వెళ్లింది. 2025 డిసెంబర్‌లో అధికారికంగా లాంచ్‌ చేసినట్లు ప్రకటించింది. రేంజ్‌ వివరాలు, ఛార్జింగ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌, ఈవీ ఎకోసిస్టమ్‌ అన్నీ చెప్పింది. కానీ, 2026 ఫిబ్రవరి సగానికి చేరుకున్నా ఇప్పటి వరకు ధరను ప్రకటించలేదు.

టయోటా ఇలా...
టయోటా కూడా అదే విధానాన్ని అనుసరించింది. అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా పేరుతో తన ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను ప్రకటించింది. 2026 జనవరి 20 నుంచి బుకింగ్స్‌ ప్రారంభించింది. రెండు బ్యాటరీ ప్యాక్స్‌, లాంగ్‌ రేంజ్‌ క్లెయిమ్స్‌, ఫీచర్ల జాబితా - అన్నీ వెబ్‌సైట్‌లో ఉంచింది. కానీ అధికారిక లాంచ్‌కు కీలకమైన ధరను మాత్రం వెల్లడించలేదు.

ఇలా ధర ప్రకటించకుండా కార్లను షోరూమ్‌లకు పంపించడం మారుతి, టయోటా లాంటి పద్ధతిగా వ్యవహరించే కంపెనీలకు సాధారణం కానే కాదు. డీలర్లు రెడీగా ఉన్నారు, కస్టమర్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ధర తెలియక ఎవరూ ముందడుగు వేయలేకపోతున్నారు.

ఈ రెండు కార్లు 'కవలలు'
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ రెండు కార్లు (మారుతి ఇ విటారా & టయోటా ఇబెల్లా) ఒకే ఈవీ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యాయి. హార్డ్‌వేర్‌ దాదాపు ఒకటే. మిడ్ సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUV సెగ్మెంట్‌లో పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఎవరు ముందుగా ధర ప్రకటిస్తే, మరొకరు దాని కంటే కాస్త తక్కువ ధరతో మార్కెట్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. దీని కోసమే ఈ రెండు కంపెనీలు ఎదురు చూస్తున్నాయా అనే అనుమానం కలుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం... మారుతి ఇ విటారా & టయోటా ఇబెల్లా ధరలు రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ధర) మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ సెగ్మెంట్‌లో ప్రధాన పోటీదారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కంటే రేటు తక్కువగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. 

డిజైన్‌ పరంగా ఈ రెండు SUVలు చాలా కన్సర్వేటివ్‌గా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్‌ సాధారణంగా ఉంటుంది. రేంజ్‌ కూడా ఇండస్ట్రీ స్టాండర్డ్‌ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి, చివరికి గెలిపించే అంశం ధరే అవుతుంది.

ఇప్పుడు అందరి చూపు ఒకటే - ఏ కంపెనీ ముందుగా ధరను ప్రకటిస్తుంది?. ఆ నిర్ణయం ఈ సెగ్మెంట్‌లో పోటీని మార్చే అవకాశం ఉంది. ధరపై ఈ వారంలో స్పష్టత రావొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు ఈ ప్రైస్‌ ట్యాగ్‌ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget