Maruti Suzuki Discount: మారుతి సుజుకీ మరో బంపర్ ఆఫర్.. Maruti Jimnyపై రూ. 1 లక్ష డిస్కౌంట్, నో కండీషన్స్
Maruti Jimny Discount: మారుతి సుజుకీ సంస్థ మారుతి జిమ్నీ మోడల్ ఆల్ఫా వేరియంట్ మీద రూ.1 లక్ష డిస్కౌంట్ ప్రకటించింది. ఇదివరకే వాగన్ ఆర్ మీద సైతం లక్షకు పైగా తగ్గింపు ఇస్తోంది.

Maruti Suzuki Discount: భారతదేశంలో కారు అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న సంస్థల్లో మారుతి సుజుకీ ఒకటి. తమ పోటీదారులైన టాటా, టయోటా, హ్యుందాయ్ సంస్థలకు ధీటుగా మారుతి సుజుకీ నూతన మోడళ్ల కార్లను మార్కెట్‌లోకి పరిచయం చేస్తోంది. లాంగ్ జర్నీ చేసేవారికి జిమ్నీ ఒక నమ్మకమైన SUVగా ఫేమస్ అవుతోంది. పర్ఫార్మెన్స్, భద్రత, ఆఫ్-రోడ్ సామర్థ్యాల పరంగా ఇది వాహన ప్రియులచే ప్రధాన ఎంపికగా నిలుస్తోంది.
జిమ్నీ కారుపై రూ. 1 లక్ష తగ్గింపు
మారుతి సుజుకీ రూపొందించిన స్టైలిష్ SUV మోడల్ కారు జిమ్నీ. ఈ ఆగస్టు నెలలో అన్ని ప్రముఖ కార్ల సంస్థలు డిస్కౌంట్లు ప్రకటిస్తుండగా, మారుతి సుజుకీ తమ జిమ్నీ మోడల్ కారుపై రూ. 1 లక్ష డిస్కౌంట్ ప్రకటించింది. ఈ తగ్గింపు అల్ఫా వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఎటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్ గానీ, కార్పొరేట్ స్కీం గానీ కాదని.. కారు ధరలో నేరుగా లక్ష రూపాయల నగదు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు మారుతి వెల్లడించింది.
జిమ్నీ ధర & ప్రత్యేకతలు
చెన్నై మార్కెట్‌ను తీసుకుంటే, జిమ్నీ ధర రూ. 12.76 లక్షల నుంచి రూ. 14.96 లక్షల వరకు ఉంది. ఈ కారుకు మహీంద్రా థార్ తరహా ఆకర్షణీయమైన డిజైన్ ఉంది. ఇది కేవలం సాదా రోడ్లకే కాకుండా, గుట్టల రహదారులు, గడ్డకట్టిన మార్గాల్లో కూడా నడిపేందుకు అనువుగా రూపొందించారు.
ఇంజిన్, పనితీరు
ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
ఇందులో 1.5 లీటర్ల K15B పెట్రోల్ ఇంజిన్ అమర్చారు.
ఇది 103 BHP శక్తి మరియు 134.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, అలాగే 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లు ఉన్నాయి.
సాధారణ రోడ్లలో గానీ, కష్టతరమైన మార్గాల్లో గానీ, ఈ కారు వెలువైన ఎంపికగా నిలుస్తుంది.
కారులో సేఫ్టీ ఫీచర్లు
జిమ్నీ కారులో సేఫ్టీ ఫీచర్లు బాగున్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఏబిఎస్ (ABS) వ్యవస్థ ఈబిడీ (EBD) తో కలిపి ఇచ్చారు. హిల్ హోల్డ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఇది పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్‌కి ఉపయోగపడుతుంది. బ్రేక్ అసిస్టెన్స్, పార్కింగ్ కెమేరా వంటి అనేక ఫీచర్లు జిమ్నీ కారులో ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ ప్రయాణాల కోసం కల్పించారు.
ఆధునిక సదుపాయాలు
ఈ కారులో ఆటోమేటిక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఫాగ్ లాంప్స్, కారును ఆన్/ఆఫ్ చేయడానికి పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణికుల సౌకర్యం కోసం టచ్ స్క్రీన్ డిస్‌ప్లే వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి.
ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కి బెస్ట్ చాయిస్
పర్వత ప్రాంతాల్లో లేదా గుట్టలు లాంటి మార్గాల్లో వాహనాలు నడపాలనుకునే వారికి జిమ్నీ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. కఠినమైన ప్రదేశాల్లో నడిపే కార్లలో ఇది ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం ప్రకటించిన 1 లక్ష రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చాలామందికి ఉపయోగపడుతుంది.
జిమ్నీ కారులో జెటా, అల్ఫా అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్ అల్ఫా వేరియంట్‌కు మాత్రమే వర్తించనుందని, జెటా వేరియంట్‌కు ఎలాంటి తగ్గింపు డిస్కౌంట్ లేదని స్పష్టం చేసింది..
ఇంజిన్ పరిమాణం వివరాలు
ఈ కారులో 1462 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది
ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం: 40 లీటర్లు
కారు పొడవు: 3985 మిల్లీమీటర్లు
వెడల్పు: 1645 మిల్లీమీటర్లు
ఎత్తు: 1720 మిల్లీమీటర్లు
స్టీరింగ్: పవర్ స్టీరింగ్
బ్రేక్స్: ముందు భాగంలో డిస్క్ బ్రేక్స్
టయర్లు: అలాయ్ మరియు స్టీల్ వేరియంట్లు
దూర ప్రయాణాలకు అనువైన SUV






















