అన్వేషించండి

Maruti Fronx, Tata Nexon లేదా Hyundai Exter లను EMI పద్ధతిలో కొనేందుకు ఏ కారు ఖర్చు తక్కువ

Maruti Fronx, Nexon and Exter EMI Plan: మారుతి ఫ్రాంక్స్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వాహనాల్లో ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తే ఏది అత్యంత అందుబాటు ధరలో EMI ద్వారా కొనవచ్చో తెలుసుకోండి.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUVలకు రోజురోజుకూ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ సెగ్మెంట్‌లో మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx), హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter),  టాటా నెక్సాన్ (Tata Nexon) అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా నిలిచాయి. ఈ కార్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆకట్టుకునే ఫీచర్లతో వస్తాయి. ఒకవేళ మీరు ఈ మూడింటిలో ఏదైనా ఒక కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే, వాటిని కేవలం పూర్తి నగదు చెల్లించకుండా ఫైనాన్స్ (EMI) సౌకర్యంతో కొనుగోలు చేసి సొంతం చేసుకోంది. అయితే ముందుగా ఆ కార్ల ధరలు, వాటి నెలవారీ ఈఎంఐ (EMI) ఫైనాన్స్ వివరాలు పూర్తిగా తెలుసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. 

మొదటగా మారుతి ఫ్రాంక్స్ ధర విషయానికి వస్తే, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.7.5 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ అయితే ధర ఎక్కువగా ఉంటుంది. ఆయా రాష్ట్రాలు నగరాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అదేవిధంగా టాటా నెక్సాన్ ప్రారంభ ధర దాదాపు రూ. 8 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.79 లక్షలుగా ఉంది. ఈ లెక్కన టాటా నెక్సాన్ ధర ఇతర కార్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దీని నెలవారీ EMI కూడా ఎక్కువే ఉంటుంది.

ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?
మీరు కారు కొనేటప్పుడు 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నారనుకుందాం. లోన్ కాలపరిమితి 5 ఏళ్లు, మీ సిబిల్ స్కోరును బట్టి వడ్డీ రేటు 9% గా ఉంటే, EMIలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

మారుతి ఫ్రాంక్స్: బేస్ మోడల్‌కు నెలవారీ EMI సుమారు రూ. 13,000 నుండి రూ. 14,000 వరకు ఉండవచ్చు.

టాటా నెక్సాన్: ఈ ఎస్‌యూవీ కొనుగోలు చేశాక మీరు ప్రతి నెల సుమారు రూ.14,500 నుండి రూ.15,500 వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫ్రాంక్స్‌తో పోలిస్తే నెలకి సుమారు 1,000 నుండి రూ. 1,500 వరకు తేడా ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్: ఒకవేళ మీరు SUV ఎక్స్‌టర్‌ను 1 లక్ష డౌన్ పేమెంట్‌తో కొంటే, 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలపరిమితికి మీరు ప్రతి నెల రూ.11,380 EMI చెల్లించాల్సి ఉంటుంది.  ఈ మూడు కార్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ మీకు అత్యంత తక్కువ EMIకి లభిస్తుంది. కార్ల ధరలు ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటుంది. పైగా రాష్ట్రాల్లోనూ ట్యాక్స్ భిన్నంగా ఉంటుంది.

ఎన్ని ఏళ్లకు ఎంత EMI కట్టాలి? 
  మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొనడం మంచిది. అయితే, మీరు లోన్ కాలపరిమితిని తగ్గిస్తే నెలవారీ EMI మొత్తం పెరుగుతుందని గమనించాలి. మీ కార్ లోన్ కాలపరిమితి 5 ఏళ్లు  అయితే కనుక మీరు ప్రతినెలా ఈఎంఐ 11,380 చెల్లించాలి. ఒకవేళ 4 ఏళ్లకు లోన్ తీసుకుంటే కనుక 13,642, లేక 3 ఏళ్ల కాలపరిమితికి ఫైనాన్స్ తీసుకుంటే మీరు నెలవారీ ఈఎంఐ రూ. 17,432 చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget