అన్వేషించండి

ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ నాన్‌స్టాప్ జర్నీ.. Maruti Fronx SUV ధర, ఫీచర్లు తెలుసా

మారుతి ఫ్రాంక్స్ 2 వేర్వేరు పెట్రోల్, CNG ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. ఇది 1.2L K-సిరీస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజిన్‌లను, అలాగే 1.0L టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుంది.

Maruti Fronx SUV | మీరు రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి మంచి మైలేజీతో పాటు తక్కువ ఖర్చు ఉండే ఏదైనా SUV కోసం చూస్తున్నారా.. అయితే మీకు మారుతి ఫ్రాంక్స్ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. ఈ కారు పెట్రోల్, సిఎన్‌జి (CNG) రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మారుతి ఫ్రాంక్స్ ధర, మైలేజీ, పూర్తి ఫీచర్లు తెలుసుకున్నాక మీరు ఓ అభిప్రాయానికి రావాలి. 

మారుతి ఫ్రాంక్స్ ధర ఎంత?
మారుతి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 6.85 లక్షలకు ప్రారంభం కాగా, టాప్ వేరియంట్ వరకు రూ. 11.98 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఫ్రాంక్స్‌లో ప్రీమియం ఫీల్, తక్కువ రన్నింగ్ కాస్ట్, మంచి స్పేస్ లభిస్తాయి.

మారుతి ఫ్రాంక్స్ తన స్టైలిష్, ప్రీమియం ఇంటీరియర్‌తో కస్టమర్లకు ఆకట్టుకుంటోంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో,  ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే 9-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్  మరింత స్మార్ట్‌గా మార్చడానికి ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ AC వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి కారు పవర్ ఎలా ఉంది?
మారుతి ఫ్రాంక్స్ 2 వేర్వేరు పెట్రోల్ ఇంజన్లు, CNG ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.2L K-సిరీస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజన్‌తో పాటు 1.0L టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇచ్చారు. ఈ SUVని 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ 2 ఇంజన్లు BS6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలను పాటిస్తాయి. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో నడుస్తాయి. దీనివల్ల పెట్రోల్ ఆదా అవ్వడమే కాకుండా పనితీరు కూడా స్మూత్‌గా ఉంటుంది.

ఈ కారు తన సెగ్మెంట్‌లో అద్భుతమైన మైలేజీని ఇచ్చే కారు. ARAI ప్రకారం, దీని 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 21.79 కిలోమీటర్లు, 1.2 లీటర్ పెట్రోల్ AMT వేరియంట్ 22.89 kmpl మైలేజీతో నడుస్తుంది. 1.2 లీటర్ CNG వేరియంట్ మైలేజీ 28.51 km/ kg గా ఉంది. దీని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అయితే లీటరకు 21.5 కిలోమీటర్లు, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 20.01 kmpl మైలేజీని అందిస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, పెట్రోల్ + CNG బై-ఫ్యూయల్ మోడల్ ఫుల్ ట్యాంక్‌పై గరిష్టంగా 1200 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను ఇవ్వడంతో వెయ్యి కిలోమీటర్ల జర్నీ కోసం ఈ కారు తీసుకెళ్తారు. 

సేఫ్టీ ఫీచర్లు: మారుతి ఫ్రాంక్స్‌లో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు (టాప్ వేరియంట్లలో), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్‌ హోల్డ్ అసిస్ట్, ABSతో కూడిన EBD వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

డిజైన్: ఇది మారుతి గ్రాండ్ విటారా ను పోలి రూపొందించిన కూపే లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. మార్కెట్లో ఈ కారు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తోంది.

 మారుతి సుజుకికి దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా దీని మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ లభ్యత చాలా సులభం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
June 2026 Car Launches India:జూన్‌ 2026లో కార్ల జాతర! భారత్‌ మార్కెట్‌లోకి వస్తున్న టాప్ మోడల్స్!
జూన్‌ 2026లో కార్ల జాతర! భారత్‌ మార్కెట్‌లోకి వస్తున్న టాప్ మోడల్స్!
India First Flex Fuel WagonR: మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ.. 
మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ.. 
Toyota Innova Crysta Launched: టయోటా ఇన్నోవా క్రిస్టా లాంచ్:  సరికొత్త అప్‌డేట్స్ తో వచ్చిన ప్రీమియం ఎమ్‌పీవీ కార్.. లుక్స్ తో పాటు అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు
టయోటా ఇన్నోవా క్రిస్టా లాంచ్:  సరికొత్త అప్‌డేట్స్ తో వచ్చిన ప్రీమియం ఎమ్‌పీవీ కార్.. లుక్స్ తో పాటు అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Naga Dosha: ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
Today Rashifal June 05: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Embed widget