అన్వేషించండి

Tata Nexon లేదా Kia Sonet కార్లలో ఏది బెస్ట్.. ధర, మైలేజీ చూసి డిసైడ్ అవ్వండి

Kia Sonet SUV | టాటా నెక్సాన్, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రెండూ కస్టమర్ల ఆదరణ పొందిన కార్లు. వీటిలో మీకు ఏది బెస్ట్ అని తెలియాలంటే ధర, ఇంజిన్, మైలేజ్ వివరాలు తెలుసుకోండి.

Tata Nexon vs Kia Sonet | భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ SUV విభాగంలో అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో టాటా నెక్సాన్, కియా సోనెట్ కార్ల మధ్య మార్కెట్లో గట్టి పోటీ ఉంది. ఈ రెండు కార్లు 4 మీటర్ల కంటే తక్కువ పొడవుతో వస్తున్నాయి. స్టైల్, ఫీచర్లు, బెస్ట్ పనితీరును కోరుకునే కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. టాటా నెక్సాన్ సేఫ్టీ, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీపై ఎక్కువ ఫోకస్ చేస్తుండగా.. కియా సోనెట్ ప్రీమియం లుక్, మోడ్రన్ క్యాబిన్ ఫీచర్లతో అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. 

ధర, వేరియంట్‌లు

భారత మార్కెట్‌లో స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్ వంటి ట్రిమ్‌లలో టాటా నెక్సాన్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర దాదాపు రూ. 7.32 లక్షలు, కాగా దీని టాప్ వేరియంట్‌ రూ. 14.15 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు కియా సోనెట్ HTE నుండి X-Line వరకు మొత్తం 9 వేరియంట్లలో వస్తుంది. కియా సోనెట్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 7.30 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 13.65 లక్షల వరకు ఉంటుంది. ధర పరంగా చూస్తే 2 కార్లు దాదాపు ఒకటే బడ్జెట్‌లో ఉన్నాయి. 

ఇంజిన్ ఎంపికలు, పనితీరు

టాటా నెక్సాన్‌లో పెట్రోల్, డీజిల్, CNGతో సహా మూడు ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లు పవర్‌ఫుల్. పలు ట్రాన్స్‌మిషన్ ఎంపికలను మీకు అందిస్తాయి. కియా సోనెట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో కూడా వస్తుంది, టర్బో పెట్రోల్ ఎంపిక దీనిని మరింత స్పోర్టీగా చేస్తుంది. సోనెట్‌లో మాన్యువల్ నుండి DCT, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వరకు పలు వేరియంట్లు ఉన్నాయి.

మైలేజ్‌లో ఎవరు ముందున్నారు?

మైలేజ్ విషయానికి వస్తే టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ ఒక లీటరుకు దాదాపు 24 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అయితే పెట్రోల్ వేరియంట్ దాదాపు 17 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది. కియా సోనెట్ ఈ విషయంలో టాటా నెక్సాన్ కు గట్టి పోటీ ఇస్తుంది. కియా సోనెట్ డీజిల్ వేరియంట్ దాదాపు లీటరుకు 24.1 కి.మీ మైలేజీ, పెట్రోల్ వేరియంట్ దాదాపు 19.2 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

సేఫ్టీ ఫీచర్లు..

 భద్రతా పరంగా టాటా నెక్సాన్ కు తిరుగులేదని కస్టమర్లు నమ్ముతారు. పలు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. కియా సోనెట్ దాని ప్రీమియం క్యాబిన్, పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో ఫేమస్ అవుతోంది. మీరు సేఫ్టీ, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కోసం చూస్తున్నట్లయితే టాటా నెక్సాన్ మీకు మంచి ఛాయిస్. మీరు స్టైలిష్ లుక్, ఎక్కువ టెక్నాలజీ ఫీచర్లు కోరుకుంటే, కియా సోనెట్ మీకు బెటర్ అని కంపెనీ చెబుతోంది. ఈ రెండు కార్లు దాదాపు ఒకే ధరలో ఉన్నా, కియా సోనెట్ ధర కాస్త తక్కువ, డీజిల్ వేరియంట్లలో మైలేజీ ఒకేలా ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లో కియా సోనెట్ మైలేజీ కాస్త ఎక్కువ ఇస్తుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget