అన్వేషించండి

EV Cars and Two Wheelers: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న ధరలు

Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. CNG, బయోగ్యాస్ ధరలతో పాటు కొన్ని ఖనిజాల ధరలపై సుంకాలు తగ్గించారు.

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026లో వాహనదారులకు శుభవార్త చెప్పారు. వాహనదారులకు ఖర్చులు తగ్గించేందుకు CNG, బయోగాస్ ను చౌకగా అందేలా చేస్తామని ప్రకటించారు. దీంతో CNG వాహనాలు నడిపేవారికి ఇంధన ఖర్చులో నేరుగా ఆదా అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులకు కూడా ఉపశమనం లభిస్తుంది.

నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 లో బయోగాస్ మిశ్రమ CNG పై కస్టమ్స్ సుంకం లెక్కించే విధానంలో మార్పులు చేస్తామని ప్రకటించారు. దీని కారణంగా, ఇప్పుడు కస్టమ్స్ ట్యాక్స్ విధించే సమయంలో బయోగాస్ ధరలో కూడా రాయితీ ఇవ్వనున్నారు.

త్వరలో ఆ వాహనాలతో తగ్గనున్న ఖర్చులు 

ప్రభుత్వ నిర్ణయం వల్ల బయోగాస్ ఆధారిత ఇంధనం చౌకగా మారుతుంది. దీని ప్రభావం CNG వాహనాల ధరలతో పాటు  ఆటో పరిశ్రమపై కూడా పడుతుంది. అంతేకాకుండా బడ్జెట్ లో EV బ్యాటరీలను కూడా చౌక ధరలకు లభించేలా చేస్తామని ప్రకటించారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సైతం కొంతమేర దిగిరావొచ్చు. లేదా కొత్తగా బ్యాటరీ తీసుకునే వారికి ఖర్చులు తగ్గనున్నాయి. 

EV బ్యాటరీని మార్చడం త్వరలో మరింత చౌక 

EV బ్యాటరీ చౌకగా ఉండటం అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణ పెట్రోల్-డీజిల్ వాహనాల ధరలకు దగ్గరగా వస్తాయి. దీంతో పాటు ఇప్పటికే EV ఉన్నవారికి పాత బ్యాటరీని మార్చడం మరింత తేలిక అవుతుంది. బ్యాటరీ ఖర్చులు తగ్గడంతో ఈవీ వాహనాల విక్రయాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఏదైనా ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో 40 నుండి 50 శాతం ఖర్చు బ్యాటరీకి మాత్రమే ఉంటుందని తెలిసిందే. పైగా బ్యాటరీ పాడైతే కొత్త బ్యాటరీ కొనడానికి మధ్యతరగతి వారు ఎంతగానో ఆలోచిస్తారు. తాజా బడ్జెట్ లో లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ముఖ్యమైన ఖనిజాల దిగుమతిపై సుంకాన్ని తగ్గించడం వల్ల బ్యాటరీ తయారీకి తక్కువ ఖర్చు అవుతుందని సమాచారం. .

వినియోగదారులకు నేరుగా ప్రయోజనం

ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేంద్రం పలు ఖనిజాల దిగుమతిపై సుంకాలు తగ్గించడంతో బ్యాటరీ ఉత్పత్తి వ్యయంలో 15 నుండి 20 శాతం తగ్గుతుంది. దీని వలన అటు తయారీదారులతో పాటు ఇటు వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఇక ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలలో కొంతమేర తగ్గుదల కనిపించవచ్చు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki YMC EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!
ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!
TVS Orbiter vs Bajaj Chetak:టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs బజాజ్‌ చేతక్‌! బడ్జెట్‌ ఈవీ రేసులో ఏ స్కూటర్‌ కింగ్‌?
టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs బజాజ్‌ చేతక్‌! బడ్జెట్‌ ఈవీ రేసులో ఏ స్కూటర్‌ కింగ్‌?
Toyota Fortunerకు అదిరిపోయే మేకోవర్ - కొత్త జనరేషన్ SUVలా మార్చేసిన ఓనర్
పాత Toyota Fortunerకు నెక్స్ట్ జనరేషన్ లుక్ - మోడిఫికేషన్ చూస్తే మతిపోవాల్సిందే!
1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ
8 సిలిండర్‌ బైక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? - ఈ బండికి పెట్టే రేటుతో ఏకంగా 10 కార్లు కొనవచ్చు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
Raksha Gowda: గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
World Cup Black Magic: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
Embed widget