అన్వేషించండి

Toyota Hyryder Price Mileage: ఫుల్ ట్యాంక్ తో 1,200 కి.మీ వెళ్లొచ్చు, టయోటా హైరైడర్ ధర ఎంత ? ఎవరికి బెస్ట్

Toyota Hyryder Mileage: టయోటా హైరైడర్ 3 ఇంజన్ వేరియంట్లతో వస్తుంది. అయితే మైలేజీ పరంగా ఇది బెస్ట్ అనిపించుకుంటోంది. 1200 కి.మీ వరకు ఫుల్ ట్యాంకుతో జర్నీ చేయవచ్చు.

Toyota Hyryder Price: భారత మార్కెట్లో కార్లకు అందులోనూ హైబ్రిడ్ SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అందుకు నిదర్శనం టయోటా హైరైడర్ అని చెప్పవచ్చు. ఈ మిడ్-సైజ్ SUV తన హైబ్రిడ్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్ తో ఫేమస్ అయింది. దాంతో కస్టమర్లు ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ వెంట పరుగులు తీస్తున్నారు. 

భారత మార్కెట్లో టయోటా హైరైడర్ ధర రూ. 12.87 లక్షల నుండి ప్రారంభమై గరిష్టంగా రూ. 23.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధర రాష్ట్రాల పన్నులు, ఇన్సూరెన్స్ ధరను బట్టి మారుతూ ఉండవచ్చు. ఈ కారు ఫీచర్లపై ఒకసారి లుక్కేద్దాం.

Toyota Hyryder ఫీచర్లు
టయోటా హైరైడర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. దీంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB Port, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8 వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ వస్తాయి. ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీలో పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ దీనికి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

టయోటా హైరైడర్ సేఫ్టీ ఫీచర్ల విషయంలో కూడా చాలా కార్ల కంటే ముందుంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, ESC, 360 డిగ్రీస్ కెమెరా, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ ఫీచర్లు ఇస్తున్నారు. అలాగే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఇచ్చారు. ఈ ఎస్‌యూవీ ఫ్యామిలీ జర్నీ కోసం బెస్ట్ అనిపించుకుంటోంది. 

ఇంజిన్ ఆప్షన్, పనితీరు
టయోటా హైరైడర్ 3 ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. వీటిలో 1.5 లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ (K-సిరీస్), 1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ (TNGA), 1.5 లీటర్ CNG ఇంజిన్‌లు ఉన్నాయి. ఈ ఇంజిన్‌లన్నీ వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవచ్చు. ఇవి మంచి పనితీరుతో పాటు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని (fuel efficiency) అందిస్తాయి.

టయోటా హైరైడర్ ఎస్‌యూవీ మైలేజ్ కారణంగా చాలా ప్రత్యేకం అయింది. దీని పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ 19.39 కి.మీ నుండి 21.12 కిమీ/ లీటర్, స్ట్రాంగ్ హైబ్రిడ్ 27.97 కిమీ/ లీటర్ మైలేజీ ఇస్తుంది. ఇక CNG వేరియంట్ 26.6 కిమీ/ కేజీ (ARAI) వరకు మైలేజీని ఇస్తాయి. ఫుల్ ట్యాంక్‌తో ఈ SUV సుమారు 1,200 కిలోమీటర్ల దూరం నాన్ స్టాప్ ప్రయాణించగలదు. కనుక ఇది మిడిల్ క్లాస్ వారికి చాలా పొదుపైన కారుగా మారుతుంది. 

టయోటా హైరైడర్‌లో తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, హైబ్రిడ్ టెక్నాలజీ, అద్భుతమైన మైలేజ్, టయోటా సర్వీస్ క్వాలిటీ కనిపిస్తుంది. దీంతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఇంటీరియర్, ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు దీనిని ఫ్యామిలీ ట్రిప్ లతో పాటు సిటీలో డ్రైవింగ్ చేయడానికి సరైన SUVగా మారుస్తాయి. అందుకే మిడిల్ క్లాస్ వారు సైతం బడ్జెట్ ను మించి అడుగు వేసి టయోటా హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కొనుగోలు చేస్తున్నారు. 

Also Read: మీ బడ్జెట్‌కు తగ్గట్లు రూ.10 లక్షల లోపు వచ్చే బెస్ట్‌ ఆటోమేటిక్‌ SUVలు - సిటీ ట్రాఫిక్‌కు సరైన ఆప్షన్స్‌

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Regenerative Braking In EVs: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్‌ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!
ఎలక్ట్రిక్‌ కారును 100 శాతం ఛార్జ్ చేస్తే రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎందుకు ఆగిపోతుంది? కారణమిదే!
LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
ఎలక్ట్రిక్ కారులో LFP లేదా NMC బ్యాటరీల్లో ఏది బెస్ట్? తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఏది సరిపోతుంది?
Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget