Maruti Car Discounts: డిసెంబర్ బంపర్ ఆఫర్లు - Swift, Wagon R సహా 9 కార్లపై రూ.58,000 వరకు డిస్కౌంట్లు
డిసెంబర్ 2025లో మారుతి ఆరెనా షోరూమ్‌లు తొమ్మిది మోడళ్లపై రూ.58,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నాయి. స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, ఆల్టో K10, బ్రెజ్జా, సెలెరియో సహా అనేక మోడళ్లపై బంపర్ ఆఫర్లు ఉన్నాయి.

Maruti December Discounts: డిసెంబర్ నెల రాగానే ఆటోమొబైల్ రంగంలో ఆఫర్ల హడావిడి మొదలైంది. కొత్త ఏడాది సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, కార్ కొనుగోలుదారులకు మారుతి సుజుకి అరెనా భారీ తగ్గింపులు ప్రకటించింది. ఈసారి మొత్తం తొమ్మిది మోడళ్లపై బంపర్ ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా, బాగా పాపులర్ అయిన Maruti Wagon R, Swift, Alto K10, Brezza, Celerio, S-Presso, Eeco, Dzire, Ertiga వంటి మోడళ్లపై మంచి తగ్గింపులు ఉండటం యూజర్లకు పెద్ద ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది.
వ్యాగన్ ఆర్ – రూ.58,100 వరకు తగ్గింపు
ఈ నెలలో, మారుతి ఇస్తున్న అత్యధిక తగ్గింపు వ్యాగన్ ఆర్‌పై లభిస్తోంది. మొత్తం రూ.58,100 వరకు లాభం దక్కనుంది. ఇందులో రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.25,000 స్క్రాపేజ్ బోనస్, అదనంగా రూ.3,100 లాభం లభిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.6.95 లక్షల వరకు ఉన్నాయి.
స్విఫ్ట్ – రూ.55,000 వరకు తగ్గింపు
మారుతి స్విఫ్ట్ ఈసారి రూ.55,000 వరకు ఆఫర్లతో లభిస్తోంది. రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్ బోనస్ లేదా రూ.15,000 ఎక్స్‌చేంజ్ బోనస్, అదనంగా రూ.5,000 ఇతర ప్రయోజనాలు లభిస్తున్నాయి. ధరలు రూ.5.79 లక్షల నుంచి రూ.8.80 లక్షల వరకు ఉన్నాయి.
ఆల్టో K10 – రూ.52,500 వరకు తగ్గింపు
మారుతి ఆల్టో K10 అన్ని వేరియంట్లపై రూ.52,500 వరకు ఆఫర్లు ఉన్నాయి. రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.25,000 స్క్రాపేజ్ బోనస్, అదనంగా రూ.2,500 ఇతర లాభాలు అందుతున్నాయి. ధర పరిధి రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉన్నాయి.
ఎస్ ప్రెస్సో – రూ.52,500 వరకు తగ్గింపు
ఎస్ ప్రెస్సో కూడా ఇదే విధంగా రూ.52,500 వరకు బెనిఫిట్స్‌తో లభిస్తోంది. రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.25,000 స్క్రాపేజ్ బోనస్, అదనంగా రూ.2,500 ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ధరలు రూ.3.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు ఉన్నాయి.
సెలెరియో – రూ.52,500 వరకు తగ్గింపు
సెలెరియోపై కూడా మొత్తం రూ.52,500 వరకు లాభం దక్కుతుంది. క్యాష్ డిస్కౌంట్ రూ.25,000, ఎక్స్‌చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఆప్షన్, అదనంగా రూ.2,500 ప్రయోజనాలు లభిస్తున్నాయి. ధరలు రూ.4.7 లక్షల నుంచి రూ.6.73 లక్షల వరకు ఉన్నాయి.
ఈకో – రూ.52,500 వరకు ఆఫర్లు
పెట్రోల్, CNG రెండింటిపైనా ఈకోకు రూ.52,500 వరకు ఆఫర్లు ఉన్నాయి. రూ.20,000-25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.25,000 స్క్రాపేజ్ బోనస్, అదనంగా రూ.2,500 ఇతర లాభాలు లభిస్తాయి. ధర పరిధి రూ.5.21 లక్షల నుంచి రూ.6.36 లక్షల వరకు ఉంది.
బ్రెజ్జా – రూ.40,000 వరకు తగ్గింపు
మారుతి బ్రెజ్జాపై ఈసారి రూ.40,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.25,000 స్క్రాపేజ్ బోనస్, అదనంగా రూ.5,000 ప్రయోజనం ఉంటుంది. ధరలు రూ.8.26 లక్షల నుంచి రూ.13.01 లక్షల వరకు ఉన్నాయి.
డిజైర్ – రూ.12,500 తగ్గింపు
డిజైర్ అన్ని వేరియంట్లపైనా రూ.10,000 డీలర్ లెవల్ డిస్కౌంట్, అదనంగా రూ.2,500 ఇతర ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎక్స్‌చేంజ్/స్క్రాపేజ్ బోనస్ లేదు. ధరలు రూ.6.26 లక్షల నుంచి రూ.9.31 లక్షల వరకు ఉన్నాయి.
ఎర్టిగా – రూ.10,000 తగ్గింపు
ఎర్టిగా MPVపై కేవలం రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ మాత్రమే ఉంది. ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా అదనపు ప్రయోజనాలు లేవు. ధరలు రూ.8.80 లక్షల నుంచి రూ.12.94 లక్షల వరకు ఉన్నాయి.
డిసెంబర్ 2025లో కార్ కొనాలని ప్లాన్ చేసే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పాలి. ఈ డిస్కౌంట్లు నగరాన్ని బట్టి మారుతాయి. కాబట్టి మీ దగ్గర్లోని డీలర్‌ను సంప్రదిస్తే అన్ని వివరాలు మరింత క్లియర్‌గా తెలుస్తాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















