అన్వేషించండి

కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌ న్యూస్‌ - Maruti Alto K10 ధర భారీగా తగ్గింది, రూ.లక్ష ఆదా!

Maruti Alto K10 New GST Price: మారుతి ఆల్టో K10 ను కొత్త హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఈ కారు K-సిరీస్ 1.0-లీటర్ డ్యూయల్-జెట్ & డ్యూయల్-VVT ఇంజిన్‌తో పని చేస్తుంది.

Maruti Alto K10 New GST Price: మీరు ఈ దీపావళికి కొత్త కారు, అదీ బాగా చవగ్గా కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌పై ఏకంగా 1,07,600 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్‌ ఈ నెల (అక్టోబర్‌ 2025) మొత్తం అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తం డిస్కౌంట్‌లో, కొత్త జీఎస్‌టీ (GST 2025) స్లాబ్ నుంచి 80,600 రూపాయల పన్ను ప్రయోజనం కూడా కలిసి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, గతంలో 4,23,000 రూపాయలుగా ఉన్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు 3,69,900 రూపాయలకు (Maruti Alto K10 ex-showroom price, Hyderabad Vijayawada) తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర
ఈ నెలలో మీరు మారుతి సుజుకీ ఆల్టో K10 కారును కొంటే, దాని ఎక్స్‌-షోరూమ్ ధర రూ. 3,69,900. రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 52,000 చెల్లించాలి. కారు బీమా కోసం దాదాపు రూ. 22,000 కట్టాలి. ఇతర అవసరమైన ఖర్చులు కూడా కలుపుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ కారును దాదాపు రూ. 4.44 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు (Maruti Alto K10 on-road price, Hyderabad Vijayawada) వస్తుంది. అంటే, గతంలో ఆల్టో K10 ఎక్స్‌-షోరూమ్‌ ధర (రూ. 4.23 లక్షలు) ఎంత ఉందో, ఇప్పుడు అంతకంటే స్వల్ప పెరుగుదలతో ఆన్‌-రోడ్‌ ప్రైస్‌లో వస్తోంది.

మైలేజీ
మారుతి ఆల్టో K10ను, కొత్త & దృఢమైన హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ నిర్మించింది. ఈ కారు K-సిరీస్ 1.0- లీటర్ డ్యూయల్ జెట్ & డ్యూయల్ VVT ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 66.62 PS పవర్‌ & 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Maruti Alto K10 ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కిలోమీటర్ల మైలేజీని (Maruti Alto K10 Automatic Mileage) అందిస్తుంది, మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కిలోమీటర్ల మైలేజీ (Maruti Alto K10 Manual Mileage) ఇస్తుంది. CNG వేరియంట్ కిలోగ్రాముకు 33.85 కిలోమీటర్ల దూరం ‍(Maruti Alto K10 CNG Mileage) ప్రయాణించగలదు.

6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉన్న కారు
మారుతి ఆల్టో K10 ధరకు తక్కువైనా, మోడ్రన్‌ ఫీచర్లకు మాత్రం తక్కువ కాదు. కంపెనీ, ఈ కారులో చాలా ఆధునిక ఫీచర్లను చేర్చింది. దీనివల్ల, ఈ చిన్న కారు గతంలో కంటే స్మార్ట్ & సేఫ్టీగా మారింది. ఈ కారు ఇప్పుడు ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లతో ప్రామాణికంగా వస్తుంది, ఇంత తక్కువ ధరలో ఉన్న కారులో ఇది ఒక ముఖ్యమైన మార్పు. 

మోడ్రన్‌ ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 7 -అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆల్టో K10లో చూడవచ్చు. ఇంకా.. USB , బ్లూటూత్ & AUX వంటి ఇన్‌పుట్ ఆప్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన కొత్త మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను ఈ కారులో అమర్చారు. దీనివల్ల, డ్రైవ్‌ చేస్తున్నప్పుడే చేతి వేళ్లతో కారు మొత్తాన్ని నియంత్రించవచ్చు, ఇది డ్రైవింగ్‌ను మరింత సులభంగా చేస్తుంది. ఈ ఫీచర్లు గతంలో S- ప్రెస్సో, సెలెరియో & వ్యాగన్ఆర్ వంటి కార్లలోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆల్టో K10 లో కూడా అందుబాటులోకి వచ్చాయి. 

మన మార్కెట్‌లో, మారుతి ఆల్టో K10 - Renault Kwid, S-Presso, Tata Tiago & Celerio వంటి కార్లతో పోటీ పడుతోంది.

టాప్ హెడ్ లైన్స్

KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget