Hero Splendor+ Xtec ఎందుకు స్పెషల్?, కొనేముందు ఈ విషయాలు మీకు తప్పక తెలియాలి
Hero Splendor+ Xtec ఇప్పుడు ఎక్కువ ఫీచర్లతో వస్తోంది. డిస్క్ బ్రేక్, బ్లూటూత్, ఎల్సీడీ డిస్‌ప్లే, సేఫ్టీ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా మారింది. కొనేముందు తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఇవి.

Hero Splendor Plus Xtec Price, Mileage And Features Telugu: హీరో స్ప్లెండర్ పేరు చెప్పగానే, చాలా మందికి “ఇంధన ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ” బైక్ అని గుర్తు వస్తుంది. ఇప్పుడు ఆ క్లాసిక్ బైక్ Xtec వెర్షన్‌లో మరింత సేఫ్టీ & స్మార్ట్ ఫీచర్లతో వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దీని ధర రూ. 77,426 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. కాగా, ఇది స్ప్లెండర్ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్. కానీ, అందుకు తగిన ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.
ఈ బైక్ కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
1. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్
Xtec వేరియంట్‌లో ఇంజిన్ సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంది. సైడ్ స్టాండ్ డౌన్‌లో (వేసి) ఉంటే బైక్ స్టార్ట్ అవదు, ఇది రైడర్ సేఫ్టీకి చాలా ఉపయోగకరం.
2. డిస్క్ బ్రేక్ ఆప్షన్
ఇది స్ప్లెండర్ సిరీస్‌లో డిస్క్ బ్రేక్ కలిగిన ఏకైక మోడల్. అయితే, సింగిల్ ఛానెల్ ABS అందించలేదు. దీని ధరను దృష్టిలో పెట్టుకుంటే ఇది సహజంగా జరిగేదే.
3. ట్యూబ్‌లెస్ టైర్లు స్టాండర్డ్
బేస్ మోడల్ నుంచి మొదలుకొని అన్ని Xtec వేరియంట్లలో ట్యూబ్‌లెస్ టైర్లు వస్తాయి. ఇది పంక్చర్ సమస్యను, తద్వారా సమయం వృథాను తగ్గిస్తుంది.
4. లేటెస్ట్ LCD డిస్‌ప్లే
పాత స్ప్లెండర్‌లో ఉన్న అనలాగ్ మీటర్ స్థానంలో, ఇప్పుడు, Xtec వెర్షన్‌లో LCD డిస్‌ప్లే ఇచ్చారు. ఇది బైక్‌కి మోడ్రన్ టచ్ ఇస్తుంది.
5. బ్లూటూత్ కనెక్టివిటీ
LCD డిస్‌ప్లేతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. కాల్, SMS అలర్ట్స్ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. రైడర్‌కు ఇది కూడా చాలా ఉపయోగకరమైన అంశం.
6. అదనపు ఇన్ఫో ఫీచర్లు
ఈ డిస్‌ప్లేలో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒక్కచూపుతో బైక్ కండిషన్ తెలుస్తుంది.
7. LED DRL ఫీచర్
హీరో స్ప్లెండర్+ Xtecలో హాలోజెన్ హెడ్‌ల్యాంప్‌పై LED DRL స్ట్రిప్ ఇచ్చారు, దీని వల్ల బైక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
8. Xtec vs Xtec 2.0
Xtecలో డిస్క్ బ్రేక్ ఉంటే, Xtec 2.0లో ఫుల్ LED హెడ్‌ల్యాంప్, H-షేప్ DRL, కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్ ఉన్నాయి.
9. కలర్స్ & వేరియంట్లు
స్ప్లెండర్+ Xtec రెండు వేరియంట్లలో వస్తోంది, అవి - డ్రమ్ & డిస్క్. బ్లాక్ బేస్ కలర్‌పై రెడ్, బ్లూ, యెల్లో, గ్రే కలర్స్‌లో ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ అందుబాటులో ఉన్నాయి.
10. ధర వివరాలు
డ్రమ్ వేరియంట్ ధర - రూ. 77,428 (ఎక్స్-షోరూమ్)
డిస్క్ వేరియంట్ ధర - రూ. 80,471 (ఎక్స్-షోరూమ్)
Hero Splendor+ Xtec బైక్ మైలేజ్ మాత్రమే కాదు, సేఫ్టీ & స్మార్ట్ ఫీచర్లతో కూడిన “టెక్ అప్‌గ్రేడ్ స్ప్లెండర్”గా నిలుస్తుంది. బడ్జెట్ చూసుకునే మిడిల్-క్లాస్ కస్టమర్లకు ఈ బండి మంచి ఛాయిస్. స్మార్ట్ లుక్స్, నమ్మకమైన పెర్ఫార్మెన్స్ దీన్నుంచి పొందవచ్చు.





















