Daily Use e-Scooters: రోజువారీ వాడకానికి చిన్న బడ్జెట్‌లో లభించే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - ₹79,999 నుంచి ప్రారంభం!
Budget friendly e scooters: భారతదేశంలో, ఎలక్ట్రిక్ వాహనాలే ప్రజల భవిష్యత్తుగా మారడానికి సిద్ధంగా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా & హోండా యాక్టివా E వంటి కొన్ని మోడళ్లు అత్యంత ప్రజాదరణ పొందాయి.

Affordable electric scooters for daily use 2025: భారతదేశంలో పెరిగిన పెట్రోల్ ధరలు & ట్రాఫిక్ రద్దీ ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనేలా ప్రేరేపిస్తున్నాయి. ఈ స్కూటర్లు పర్యావరణ అనుకూలమైనవి & చాలా తక్కువ నిర్వహణ చాలు. ఇవి పొగ లేదా శబ్దాన్ని ఉత్పత్తి చేయవు, చక్కటి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ప్రతిరోజూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆప్షన్లుగా మారాయి. ప్రస్తుతం, Ola S1X, TVS iQube, Bajaj Chetak, Ather Rizta & Honda Activa E వంటి స్కూటర్లు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాయి.
Ola S1 X
ఓలా S1 ఎక్స్, ఈ కంపెనీ నుంచి వచ్చిన మోస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్, దీని ధర ₹79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 2kWh నుంచి 4kWh బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కిలోమీటర్ల వరకు రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని 5.5kW మోటార్ కేవలం 2.6 సెకన్లలో 0 నుంచి 40 Km/h వేగాన్ని అందుకోగలదు. 7-అంగుళాల TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, OTA అప్‌డేట్స్ & నావిగేషన్ వంటి ఫీచర్లు దీనిని ఈ కాలపు స్మార్ట్ స్కూటర్‌గా మార్చాయి.
TVS iQube
టీవీఎస్ ఐక్యూబ్, సౌకర్యానికి ప్రసిద్ధి చెందింది. ₹96,422 ధరతో ప్రారంభమయ్యే ఈ స్కూటర్ 2.2kWh నుంచి 5.1kWh వరకు బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది 212 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తుంది. దీని 4.4kW మోటార్ కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 Km/h వేగాన్ని చేరుతుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, అలెక్సా ఇంటిగ్రేషన్, జియో-ఫెన్సింగ్ & టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి లక్షణాలు కూడా దీనిని టెక్నాలజీ కర్వ్ లైన్ కంటే ముందే ఉంచుతాయి.
Bajaj Chetak
₹1,02,400 ధరకు లభించే బజాజ్ చేతక్, దాని క్లాసిక్ డిజైన్ & మోడ్రన్ టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది. 3.5kWh బ్యాటరీ & 4kW మోటారుతో నడిచే ఈ స్కూటర్, ఫుల్ ఛార్జ్‌తో 153 కి.మీ. ప్రయాణ పరిధిని & గంటకు 73 కి.మీ. గరిష్ట వేగాన్ని అందిస్తుంది. టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ, లైవ్ ట్రాకింగ్ & రీప్రొడక్టివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. దృఢమైన మెటల్ బాడీ & 32 లీటర్ల స్టోరింగ్ సామర్థ్యం దీనిని మన్నికైన & ప్రాక్టికల్ స్కూటర్‌గా నిరూపించాయి.
Ather Rizta
ఏథర్ రిజ్టాను ప్రత్యేకంగా ఫ్యామిలీ సౌకర్యం కోసం రూపొందించారు. ₹1,04,999 ధరకు లభించే ఈ స్కూటర్ 2.9kWh లేదా 3.7kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఫుల్ ఛార్జ్‌తో ఇది 159 కి.మీ.ల దూరం ప్రయాణిస్తుంది. 4.3kW మోటారుతో నడిచే ఈ టూవీలర్ 8.3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, OTA అప్‌డేట్‌లు, వాయిస్ అసిస్టెంట్ & మల్టీ రైడ్ మోడ్స్ దీనిలో ఉన్నాయి. దీని 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ దీనిని ప్రపంచంలోనే అత్యంత విశాలమైన స్కూటర్‌లలో ఒకటిగా పాపులర్ చేసింది.
Honda Activa E
హోండా, తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేసింది. ₹1,17,428 ధరతో ఈ స్కూటర్ 1.5kWh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఈ బ్యాటరీని నిమిషాల్లో మార్చుకోవచ్చు (ప్రస్తుతం ముంబై, ఢిల్లీ & బెంగళూరులో అందుబాటులో ఉంది). సింగిల్ ఛార్జ్‌తో ఈ టూవీలర్ 102 కి.మీ. పరిధిని & గంటకు 80 కి.మీ. గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇది డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్, రోడ్‌సింక్ యాప్ & రీప్రొడక్టివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లను దీనిలో చూడవచ్చు.





















