XUV700 కాదు, ఇకపై XUV 7XO: మహీంద్రా కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే 8 కొత్త ఫీచర్లు
Mahindra XUV700కి మిడ్ సైకిల్ అప్‌డేట్‌గా వచ్చిన XUV 7XOలో ట్రిపుల్ స్క్రీన్, 540 డిగ్రీ కెమెరా, 16 స్పీకర్ ఆడియో వంటి 8 కొత్త ఫీచర్లు జోడించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Mahindra XUV 7XO Features: మహీంద్రా 2021లో లాంచ్ చేసిన XUV700, ఇండియన్ SUV మార్కెట్‌లో టెక్నాలజీ పరంగా పెద్ద బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఇప్పుడు 2026 మిడ్ సైకిల్ అప్‌డేట్‌తో, మహీంద్రా తమ ICE ఫ్లాగ్‌షిప్ SUVకి XUV 7XO అనే కొత్త పేరును పెట్టింది. పేరు మారడమే కాదు, ఫేస్‌లిఫ్ట్ రూపంలో కొన్ని కీలకమైన కొత్త ఫీచర్లు కూడా జోడించింది. ఇంజిన్ ఆప్షన్లు మాత్రం పాతవే కొనసాగుతున్నాయి.
ఇప్పుడు XUV700తో పోలిస్తే XUV 7XOలో కొత్తగా వచ్చిన "8 ముఖ్యమైన ఫీచర్లు"పై ఓ లుక్కేద్దాం.
1. ట్రిపుల్ స్క్రీన్ సెటప్
XUV 7XOలో డాష్‌బోర్డ్ మొత్తానికి సరిపోయిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఇచ్చారు. డ్రైవర్ డిస్‌ప్లే, సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ సైడ్ స్క్రీన్ - ఈ మూడు స్క్రీన్లు కూడా 12.3 అంగుళాల సైజ్‌లో ఉంటాయి. ఈ సెటప్‌ను మనం ఇంతకుముందు XEV 9S EVలో చూశాం. కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా అదే డిజైన్ ఫ్యామిలీకి చెందినదే, అయితే టచ్ బటన్లకు బదులుగా ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి.
2. 16 స్పీకర్ Harman Kardon ఆడియో
XUV700లో ఉన్న 12 స్పీకర్ Sony సిస్టమ్ స్థానంలో, XUV 7XOలో 16 స్పీకర్ Harman Kardon సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. అదనంగా Dolby Atmos సపోర్ట్ కూడా ఉండటంతో, క్యాబిన్‌లో ఆడియో అనుభవం మరింత ప్రీమియంగా మారింది.
3. 540 డిగ్రీ కెమెరా సెటప్
ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఇదే. XUV 7XOలో 540 డిగ్రీ కెమెరా ఇచ్చారు. ఇది ట్రాన్స్‌పరెంట్ బోనెట్ వ్యూ చూపిస్తుంది. టాటా సఫారి, MG హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి ప్రత్యర్థుల్లో ఈ ఫీచర్ లేదు. రియల్ టైమ్ రికార్డింగ్ కూడా చేయగల సామర్థ్యం ఇందులో ఉంది.
4. సెకండ్ రో సీట్లకు వెంటిలేషన్
ఇంతకుముందు రిక్లైనింగ్ మాత్రమే ఉన్న సెకండ్ రో సీట్లు, ఇప్పుడు వెంటిలేషన్ ఫంక్షన్‌తో వచ్చాయి. ముఖ్యంగా డ్రైవర్‌తో ప్రయాణించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
5. సెకండ్ రో వైర్‌లెస్ చార్జర్ & సన్‌షేడ్స్
రెండో వరుస సీట్లకు వైర్‌లెస్ చార్జర్ (కూలింగ్‌తో) అందించారు. విండో సన్‌బ్లైండ్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ లాంగ్ జర్నీల్లో మంచి కంఫర్ట్ ఇస్తాయి.
6. BYOD యాక్సెసరీ హోల్డర్లు
ఫ్రంట్ సీట్ల వెనుక భాగంలో BYOD (Bring Your Own Device) హోల్డర్లు ఇచ్చారు. వీటితో పాటు Type-C ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి.
7. పవర్డ్ కో-డ్రైవర్ సీట్
XUV 7XOలో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్‌కి ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ ఇచ్చారు. ఇది కంఫర్ట్‌తో పాటు మరిన్ని అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్లు ఇస్తుంది.
8. పవర్డ్ Boss మోడ్
కో-డ్రైవర్ సీట్ పవర్డ్ కావడంతో, ఇప్పుడు పవర్డ్ Boss మోడ్ అందుబాటులోకి వచ్చింది. XUV700లో ఇది మాన్యువల్‌గానే ఉండేది.
మొత్తం మీద ఎలా ఉంది?
XUV 7XO, కేవలం పేరులో మార్పు కాదు. టెక్నాలజీ, కంఫర్ట్, ప్రీమియం ఫీచర్ల పరంగా XUV700 కంటే ఒక మెట్టు పైకి వెళ్లింది. ఫ్లాగ్‌షిప్ ICE SUVగా మహీంద్రా దీనిని మరింత బలంగా నిలబెట్టింది అని చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















