అన్వేషించండి

Mahindra Thar ROXX: మహీంద్రా థార్ రోక్స్‌ టాప్-5 ఫీచర్లు ఇవే - లాంచ్ ఎప్పుడంటే?

Mahindra Thar ROXX Best Features: మోస్ట్ అవైటెడ్ మహీంద్రా థార్ రోక్స్ మనదేశంలో ఆగస్టు 15వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కంపెనీ అందించనుంది.

Mahindra Thar ROXX Features: మహీంద్రా థార్ రోక్స్ భారతీయ మార్కెట్లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మహీంద్రా కారు లాంచ్ గురించి మార్కెట్లో చాలా బజ్ ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి కొత్త థార్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్లపైనే ఉంది. దాని 3 డోర్ మోడల్లో లేని ఫీచర్లను ఇందులో చూడవచ్చని తెలుస్తోంది. మహీంద్రా కొద్ది రోజుల క్రితం థార్ రోక్స్ విడుదల తేదీని ప్రకటించింది. మహీంద్రా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు ఆగస్ట్ 15వ తేదీన విడుదల కానుంది. కొత్త థార్ 4*4 డీజిల్, పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది. మహీంద్రా రూపొందించిన ఈ కారు ప్రీమియం ఎస్‌యూవీ అవుతుంది.

మహీంద్రా థార్ రోక్స్‌లో కనిపించనున్న టాప్ 5 ఫీచర్లు ఇవే...
1. టచ్‌స్క్రీన్
మహీంద్రా థార్ రోక్స్ 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లను పొందవచ్చు. కానీ అవి ఎక్స్‌యూవీ700 లాగా కనెక్టెడ్ కాదు. కొత్త థార్‌లో కనిపించే స్క్రీన్ 3 డోర్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ కొత్త థార్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చు. మహీంద్రా థార్ రోక్స్ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభం అయింది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

2. 360 డిగ్రీ కెమెరా
కొత్త థార్ కూడా 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఎస్‌యూవీలో ఈ ఫీచర్‌ను పొందడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ ఫీచర్ మహీంద్రా స్కార్పియో ఎన్‌లో కూడా కనిపించలేదు. ఈ ఫీచర్ పెద్ద థార్ రోక్స్‌ను సరిగ్గా పార్కింగ్ చేయడంలో సహాయపడుతుంది.

3. పనోరమిక్ సన్‌రూఫ్
మహీంద్రా థార్ రాక్స్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫీచర్ 3 డోర్ మోడల్‌లో కూడా కనిపించలేదు. రోక్స్ మెటల్ హార్డ్‌టాప్ రూఫ్‌ను కూడా పొందనుంది.

4. ఏడీఏఎస్ లెవల్ 2
మహీంద్రా లాంచ్ చేయనున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఏడీఏఎస్ లెవల్ 2 ఫీచర్ కూడా చూడవచ్చు. ఎక్స్‌యూవీ700తో పోలిస్తే ఈ ఎస్‌యూవీలో మరిన్ని తాజా ఫీచర్లను చేర్చవచ్చు.

5. సెక్యూరిటీ ఫీచర్లు
రియర్ ఏసీ వెంట్లను థార్ రోక్స్‌లో కూడా చూడవచ్చు. కారులో ముందు, వెనుక ఆర్మ్‌రెస్ట్‌లను కూడా అందించవచ్చు. ఈ కారులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కంపెనీ అమర్చనుందని సమాచారం. అలాగే సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందించవచ్చు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

517 KM రేంజ్, అద్భుతమైన ఫీచర్లు.. MG Hector Tomahawk EV కోసం EMI ఎంత చెల్లించాలి
517 KM రేంజ్, అద్భుతమైన ఫీచర్లు.. MG Hector Tomahawk EV కోసం EMI ఎంత చెల్లించాలి
CNG కార్లకు వరుస అప్‌డేట్స్‌ వదిలిన మారుతి.. ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌లో కూడా AMT ఆప్షన్‌
ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌ CNG వెర్షన్ల డ్రైవింగ్‌ మరింత స్మూత్‌.. AMT గేర్‌బాక్స్‌ ఇచ్చిన మారుతి
రూ.8.32 లక్షలకే Maruti Baleno CNG AMT.. కిలోకు ఏకంగా 34.47 కిలోమీటర్లు!
మారుతి బలెనో CNGలో 'ఆటోమేటిక్‌' అప్‌డేట్.. కొత్త వేరియంట్‌ మైలేజ్ ఎంతంటే?
పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌
సాధారణ రోడ్లపై Royal Enfield Himalayan 440 పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది? - ఎక్స్‌పర్ట్‌ రిపోర్ట్‌

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
South Coast Railway: కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Team India Selection Controversy:  ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
Embed widget