Kia Carens: ఈ కారు కొనాలనుకుంటున్నారా? అయితే బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే?
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా ఇటీవలే లాంచ్ చేసిన కియా కారెన్స్ ధరను పెంచింది.
ప్రస్తుతం మనదేశంలో కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతోపాటు పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రముఖ కార్ల బ్రాండ్ కియా తన కొత్త కారు కియా కారెన్స్ ధరను మనదేశంలో పెంచింది. కియా కారెన్స్ ధర పెరగడం ఇదే మొదటి సారి. కియా కారెన్స్ ధర మనదేశంలో రూ.70 వేల వరకు పెరగడం విశేషం. దీంతో ఈ కారు ధర రూ.9.59 లక్షల నుంచి రూ.17.69 లక్షల మధ్య ఉంది.
కియా కారెన్స్ బేస్ వేరియంట్ ధరను రూ.60 వేల వరకు పెంచారు. దీంతో ఈ కారు ధర రూ.9.59 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇక టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.20 వేలు పెరగ్గా... డీజిల్ వేరియంట్ ధర రూ.40 వేలు పెరిగింది.
కియా కారెన్స్ ఐదు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మిగతా కియా కార్లకు సంబంధించిన డిజైన్ కంటే దీని డిజైన్ కొత్తగా ఉంది. ఇందులో కొత్త స్లీక్ రేడియేటర్ గ్రిల్‌ను అందించారు. దీన్ని కియా ‘స్టార్ మ్యాప్’ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అని పిలుస్తోంది. ఇందులో ప్రధాన ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను గ్రిల్ కింద అందించారు. ముందువైపు బంపర్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్స్, సైడ్ క్లాడింగ్, 16 అంగుళాల అలోయ్ వీల్స్ కూడా ఉన్నాయి. దీని వెనకవైపు డిజైన్ కూడా కొత్తగా ఉండనుంది. 2,780 మిల్లీమీటర్ల పొడవైన వీల్ బేస్ ఇందులో ఉంది. ఈ విభాగంలో పొడవైన వీల్ బేస్ ఉన్న కారు ఇదే.
కియా కారెన్స్ ఫీచర్లు
ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టంను అందించారు. మొత్తం 66 కనెక్టెడ్ కార్ టెక్నాలజీలు ఉన్న కియా కనెక్ట్ సూట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో, మూడో వరుసల కోసం పైభాగంలో అమర్చిన ఏసీ వెంట్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఆటోమేటిక్ ఏసీ, ముందువైపు వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో వరుస సీట్ల కోసం ఎలక్ట్రిక్ ట్రంబుల్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్ ప్యూరిఫయర్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు, స్పీడ్ లిమిటర్ ఉన్న ఆటో క్రూయిజ్ కంట్రోల్, స్పోర్ట్, ఎకో, నార్మల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
ఇందులో అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం నాలుగూ డిస్క్ బ్రేకులే. దీంతోపాటు బ్రేక్ అసిస్టట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇందులో అందించారు. దీంతోపాటు రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా కూడా ఉన్నాయి.
ఇందులో 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్, 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 144 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందించారు. 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ 138 బీహెచ్‌పీ, 242 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సెవెన్-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?