JSW MG మోటార్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా, అంటే మార్చి నెలలో బంపర్ ఆఫర్లను ప్రకటించింది.
Car Discounts: ఎంజీ మోటార్ ఇండియా భారీ డిస్కౌంట్! ఇప్పుడు కారు కొంటే 3.70 లక్షల వరకు ఆదా!
Car Discounts: ఈ ఆఫర్‌లో కేవలం నగదు తగ్గింపులే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్, లాయట్లీ రివార్డులు, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి బహుళ ప్రయోజనాలు కలిసి ఉన్నాయి.

- JSW MG మోటార్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులో భారీ కార్ల డిస్కౌంట్లు ప్రకటించింది.
- గ్లోస్టర్ SUV పై గరిష్టంగా 3.70 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.
- హెక్టర్, ఆస్టర్ SUV లతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.
- ఈ ఆఫర్లు మార్చి 31 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాయి.
Car Discounts: భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న JSW MG మోటార్ ఇండియా, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా కొనుగోలుదారుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. 2026 మార్చి నెలలో తన పోర్ట్‌ఫోలియోలోని ప్రముఖ మోడళ్లపై ఏకంగా 3.70 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న పోటీని తట్టుకోవడంతోపాటు, ఆర్థిక సంవత్సరం ముగింపులో విక్రయాలను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ భారీ డిస్కౌంట్‌లను ప్రకటించినట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఆఫర్‌లో కేవలం నగదు తగ్గింపులే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్, లాయట్లీ రివార్డులు, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి బహుళ ప్రయోజనాలు కలిసి ఉన్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఎస్‌యూవీలు, నగర ప్రయాణాలకు అనువైన ఎలక్ట్రిక్ కార్లపై ఈ తగ్గింపులు ఎక్కువగా ఉన్నాయి.
ఎంజీ గ్లోస్టర్- గరిష్టంగా 3.70 లక్షల తగ్గింపు
ఈ నెల ఆఫర్లలో అత్యధిక లబ్ధి పొందుతున్న మోడల్ ఎంజీ గ్లోస్టర్. ఫుల్ సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న ఈ కారుపై కంపెనీ అన్ని వేరియంట్లపై నేరుగా 3.5 లక్షల రిటైల్ బెనిఫిట్‌ను అందిస్తోంది. దీనికి అదనంగా, పాత కారును ఎక్స్చేంజ్ చేసుకునే వారికి 20వేల బోనస్ కూడా లభిస్తుంది. వెరసి, ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేసే వారు మొత్తం మీద 3.7 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఇది సెగ్మెంట్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్‌గా చెప్పవచ్చు.
ఎంజీ హెక్టర్ 1.45 లక్షల వరకు ప్రయోజనాలు
ఎంజీ బ్రాండ్‌కు భారత్‌లో పునాది వేసిన హెక్టర్ మోడల్స్‌పై కూడా కంపెనీ భారీగా రాయితీలు ప్రకటించింది. దీనిని రెండు విభాగాలుగా చూడొచ్చు. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు చెందిన పెట్రోల్, డీజిల్ మోడళ్లపై 1.05 లక్షల వరకు రిటైల్ డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్చేంజ్, లాయల్టీ, కార్పొరేట్ ప్రయోజనాలను కలిపితే మొత్తం తగ్గింపు 1.45 లక్షల వరకు చేరుతుంది.
లేటెస్ట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మోడళ్లపై, ముఖ్యంగా డీజిల్ మాన్యువల్ వేరియంట్లపై 50వేల రిటైల్ ఇన్సెంటివ్ ఉంది. ఇతర అదనపు ప్రయోజనాలతో కలిపి దీనిపై 90 వేల కంటే ఎక్కువ ఆదా చేయవచ్చు.
ఎంజీ ఆస్టర్- మధ్యతరహా ఎస్‌యూవీ ఆఫర్లు
మిట్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న ఎంజీ ఆస్టర్ బేస్ ట్రిమ్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లపై సమానమైన ఆఫర్లు ఉన్నాయి. దీనిపై మిగిలిన అన్ని వేరియంట్లపై సమానమైన ఆఫర్లు ఉన్నాయి. దీనిపై 20వేల రిటైల్ ఇన్సెంటివ్‌తోపాటు ఎక్స్చేంజ్, లాయల్టీ బోనస్‌లు లభిస్తున్నాయి. కార్పొరేట్ బెనిఫిట్స్‌తో కలిపి మొత్తం మీద 65 వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి
ఎంజీ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచేందుకు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ మొత్తం విక్రయాల్లో ఈవీలు గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. ఎంజీ ZS EV అన్ని వేరియంట్లలో 20 వేల రిటైల్ బెనిఫిట్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్, కార్పొరేట్ ఆఫర్లను కలిపితే మొత్తం 60 వేల వరకు ప్రయోజనం కలుగుతుంది. ఎంజీ కామెట్ ఈవీని సిటీ డ్రైవింగ్ కోసం రూపొందించిన ఈ చిన్న ఎలక్ట్రిక్ కారుపై వేరియంట్‌ను బట్టి పదివేల నుంచి 30వేల వరకు రిటైల్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. లాయల్టీ కార్పొరేట్ బోనస్‌లు కలిపితే దీనిపై 50వేల కంటే ఎక్కువ ఆదా చేయవచ్చు.
JSW MG మోటార్ ఇండియా ఈ మార్చి నెలలో చేపట్టిన ఈ దూకుడు విధానం కొత్త కారు కొనాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం. గ్లోస్టర్ వంటి లగ్జరీ ఎస్‌యూవీల నుంచి కామెట్ వంటి ఎకనామికల ఈవీల వరకు అన్ని వర్గాల వినియోదారులకు ఏదో ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌లు మార్చి 31 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని సమాచారం.
Frequently Asked Questions
JSW MG మోటార్ ఇండియా ఏ నెలలో ఆఫర్లను ప్రకటించింది?
JSW MG మోటార్ ఇండియా అందిస్తున్న గరిష్ట తగ్గింపు ఎంత?
JSW MG మోటార్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోని ప్రముఖ మోడళ్లపై ఏకంగా 3.70 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
ఏ MG మోడల్ పై అత్యధిక తగ్గింపు లభిస్తుంది?
MG గ్లోస్టర్ పై అత్యధికంగా 3.70 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో 3.5 లక్షల రిటైల్ బెనిఫిట్ తో పాటు 20వేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది.
MG హెక్టర్ పై ఎంత తగ్గింపు ఉంది?
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పెట్రోల్, డీజిల్ మోడళ్లపై 1.05 లక్షల వరకు తగ్గింపు ఉంది, అదనపు ప్రయోజనాలతో కలిపి 1.45 లక్షల వరకు పొందవచ్చు.
JSW MG మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఆఫర్లు అందిస్తుందా?
అవును, MG ZS EV పై 60 వేల వరకు, MG కామెట్ ఈవీపై 50 వేల కంటే ఎక్కువ ఆదా చేయవచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















