అన్వేషించండి

2025 Renault Triber: కేవలం ₹4.23 లక్షలకే అత్యంత చవకైన 7-సీటర్‌ కారు! - లీటరుకు 33 km మైలేజీ - ఇదంతా నిజమేనా?

Most Affordable 7-Seater Car: మూడో వరుస సీట్లను తొలగించినప్పుడు బూట్‌స్పేస్‌ 625 లీటర్లకు పెరుగుతుంది. విభిన్న అవసరాలు కలిగిన భారతీయ కుటుంబాలకు ఇది అనువైనది.

2025 Renault Triber Price, Mileage And Features In Telugu: భారతదేశంలో, రెనాల్ట్‌ ట్రైబర్‌ను లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇది ఒక సంచలనంగా మారింది. ఇదొక బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్యామిలీ కార్‌. అత్యంత తక్కువ ధరతో, ఆధునిక ఫీచర్లతో ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే, సంవత్సరాలుగా ఇది చాలా మారిపోయింది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న కొన్ని వాదనల ప్రకారం... రెనాల్ట్‌ ట్రైబర్‌ ధర కేవలం ₹4.23 లక్షలు & ఇది 33 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ వాదనలు నిజమేనా?, ట్రైబర్‌ ధర ₹4.23 లక్షలేనా?, లీటరుకు 33 km మైలేజ్‌ ఇవ్వగలదా?. 

2025లో రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంత?
రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ ధర ₹4.23 లక్షలకు దగ్గరగా ఉంది, కానీ ఇది 2019లోది. గతం నుంచి వర్తమానం (2025)లోకి వస్తే, ఈ కారు ఎంట్రీ-లెవల్ RXE వేరియంట్ రేటు (ఎక్స్-షోరూమ్) ₹6.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దీని టాప్-ఎండ్ RXZ AMT డ్యూయల్-టోన్ వేరియంట్ ధర (ఎక్స్-షోరూమ్) ₹8.97 లక్షల వరకు చేరుకుంటుంది. రాష్ట్ర పన్నులు & బీమాను బట్టి ఆన్-రోడ్ ధరలు మారుతూ ఉంటాయి. 

హైదరాబాద్‌ & విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాల నగరాల్లో, ట్రైబర్ ఎంట్రీ-లెవల్ RXE వేరియంట్‌ ఆన్-రోడ్ ధర ₹7.54 లక్షల నుంచి ₹7.60 లక్షల వరకు ఉంటుంది. టాప్-ఎండ్ RXZ AMT డ్యూయల్-టోన్ వేరియంట్ ధర (ఆన్‌-రోడ్‌) ₹11 లక్షల వరకు చేరుకుంటుంది. 

కాబట్టి, ₹4.23 లక్షల ధర పాతది. అయితే, భారతదేశంలో అమ్మకానికి ఉన్న చౌకైన సరైన 7-సీటర్ ఇదే అని ఇప్పటికీ చెప్పవచ్చు, ఈ ధర ప్రకారం దానిని సరైన విలువ దొరికినట్లే.

లీటరుకు 33 కి.మీ. మైలేజ్ నిజమేనా?
ట్రైబర్ 33 కి.మీ./లీటర్‌ మైలేజ్‌ అందిస్తుందని క్లెయిమ్ చేస్తూ కొన్ని బ్లాగ్‌లు లేదా యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. నిజానికి:
ARAI-సర్టిఫైడ్ మైలేజ్: 18.4 కి.మీ./లీ (మాన్యువల్), 19 కి.మీ./లీ (AMT)
రియల్‌-వరల్డ్‌లో దీని మైలేజ్: 15–18 కి.మీ./లీ., లోడ్ & డ్రైవింగ్ పరిస్థితులను బట్టి ఇది మారవచ్చు. 

రెనాల్ట్‌ ట్రైబర్ లీటరుకు 33 కి.మీ. మైలేజీ ఇస్తుందని సమర్థించే అధికారిక మూలం ఏదీ లేదు. బహుశా ఇతర విభాగాలను, CNG లేదా డీజిల్ వాహనాల మైలేజీలను కలగలిపి గందరగోళంగా మార్చారు. అయితే, నేచరల్లీ ఆస్పిరేటెడ్‌ 1.0L ఇంజిన్‌తో ఉన్న పెట్రోల్ 7-సీటర్‌ విషయంలో ఈ మైలేజ్‌ నంబర్‌ ఇప్పటికీ గౌరవనీయమైనదే, ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో.

పనితీరు
ట్రైబర్‌లో 72 PS & 96 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ AMTతో యాడ్‌ అయింది.

డ్రైవింగ్‌ అనుభవం
ఈ కారులో సిటీ డ్రైవింగ్ స్మూత్‌గా సాగిపోతుంది. హైవే మీదకు ఎక్కినప్పుడు, ఒంటరిగా లేదా ఇద్దరు, ముగ్గురు ప్రయాణీకులతో డ్రైవింగ్ చేయడానికి కూడా చక్కగా సరిపోతుంది. ఈ కారు పూర్తిగా లోడ్ అయినప్పుడు శక్తి తక్కువగా 
ఉంటుంది. ట్రాన్స్‌మిషన్‌ విషయానికి వస్తే, మాన్యువల్‌ ఆప్షన్‌ రెస్పాన్సివ్‌గా ఉంటుంది; AMT స్టాప్-అండ్-గో ఆప్షన్‌ ట్రాఫిక్‌లో జెర్కీగా ఉంటుంది. ఇది పవర్-ప్యాక్డ్ ఇంజిన్ కాదు. కానీ, రోజువారీ ప్రయాణాలకు & అప్పుడప్పుడు కుటుంబ విహారయాత్రలకు బాగా పనికొస్తుంది.

స్థలం & సీటింగ్
ఇదొక బడ్జెట్ MPV తరహా కారు.  ట్రైబర్ అతి పెద్ద బలం దాని స్మార్ట్ మాడ్యులర్ సీటింగ్‌లో ఉంది. మీరు ఈ సీట్లను అనేక విధాలుగా మార్చుకోవచ్చు, స్పేస్‌ పొందవచ్చు. అంటే, బూట్ కెపాసిటీని పెంచుకోవచ్చు. అన్ని సీట్లు ఉన్నప్పుడు 84 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉంటే; మూడో వరుస సీట్లను తొలగించినప్పుడు అది 625 లీటర్లకు పెరుగుతుంది. విభిన్న అవసరాలు కలిగిన భారతీయ కుటుంబాలకు ఇది అనువైనది.

రియర్‌ AC వెంట్స్
మూడో వరుస ప్రయాణీకులకు కూడా చక్కటి ఏసీ గాలి అందుతుంది. అయితే, మూడో వరుస పెద్దలకు ఇరుగ్గా ఉంటుంది, పిల్లలకు లేదా దగ్గరి ప్రయాణాలకు సరిపోతుంది. ముందు & రెండో వరుస సౌకర్యంగా ఉంటుంది, ఈ ధరకు నిజంగా ఆకట్టుకుంటుంది.

ఆధునిక ఫీచర్లు 
ఎంట్రీ లెవెల్‌ MPV అయినప్పటికీ, ట్రైబర్‌లో ఆధునిక ఫీచర్లకు కొదవలేదు, అవి:
ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్
పుష్-బటన్ స్టార్ట్/స్టాప్
LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్
పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు
₹10 లక్షలు & అంతకంటే ఎక్కువ ధర గల కార్లలో ఆశించే ఫీచర్లు ఇవి.

భద్రత
ఇది ఈ విభాగంలో సాలిడ్‌ వెహికల్‌. గ్లోబల్ NCAP టెస్టింగ్‌లో రెనాల్ట్ ట్రైబర్‌ పెద్దల రక్షణలో 4  స్టార్లు & పిల్లల భద్రతలో 3 స్టార్లు సాధించింది. ఇది, కొన్ని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు & మిడ్-సైజ్ సెడాన్‌ల కంటే మెరుగైన విషయం. 

ప్రామాణిక భద్రత ఫీచర్లు:
డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (టాప్ వేరియంట్‌లలో 4)
EBD, ABS
రియర్‌ పార్కింగ్ సెన్సార్లు & కెమెరా
స్పీడ్ అలర్ట్స్‌
సీట్‌బెల్ట్ రిమైండర్స్‌

భద్రత కూడా మీ ప్రాధాన్యతల్లో ఒకటి అయితే, ట్రైబర్ మిమ్మల్ని నిరాశపరచదు.

2025 రెనాల్ట్ ట్రైబర్‌ను కొనుగోలు చేయవచ్చా?
₹10 లక్షల లోపులో మోడరన్‌ ఫీచర్లు ఉన్న, సురక్షితమైన, కుటుంబ కారు కావాలనుకుంటే రెనాల్ట్ ట్రైబర్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి, పెరుగుతున్న కుటుంబాలతో పాటు & చిన్నపాటి ట్రావెలింగ్‌ కంపెనీలకు కూడా ఇది సరిపోతుంది.

అయితే, 6-7 మంది ప్రయాణికులతో తరచుగా హైవే ప్రయాణం చేసే అవసరం ఉంటే, మరింత శక్తిమంతమైన కార్ల కోసం సెర్చ్‌ చేయడం తెలివైన పని కావచ్చు.

స్పస్టీకరణ: ఆటోకార్ ఇండియా, కార్‌వేల్, టైమ్స్ డ్రైవ్, ARAI వంటి విశ్వసనీయ ఆటోమోటివ్‌ సోర్స్‌ల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని అందిస్తున్నాం. ఇందులో ఎలాంటి పుకార్లు, మార్కెటింగ్ గిమ్మిక్స్‌ లేవు, ఆచరణాత్మక సమాచారం మాత్రమే ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Embed widget