2025 Tata Nexon: ఒక్క రూపాయి కూడా డౌన్‌పేమెంట్ లేకుండా కొత్త SUV - కేవలం ₹7,999 EMIతో కొత్త టాటా నెక్సాన్ మీదే!
Zero Downpayment Car: 2025 టాటా నెక్సాన్, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో శక్తిమంతమైన సేఫ్టీ, ₹0 డౌన్‌పేమెంట్ ఆఫర్‌తో భారత మార్కెట్లో హాట్ టాపిక్ అయ్యింది.

Tata Nexon 2025 Price, Mileage And Features In Telugu: ప్రస్తుతం, భారతదేశంలో SUV కలిగి ఉండడం ఒక క్రేజీ ట్రెండ్ అయి కూర్చుంది. ఈ సమయంలో, టాటా మోటార్స్ తన నెక్సాన్ 2025 ఎడిషన్‌తో ఈ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. కొత్త రూపం, ఆకట్టుకునే ఫీచర్లు, శక్తిమంతమైన ఇంజిన్, మెరుగైన సేఫ్టీ, ఇంకా అంతకు మించి – ₹0 డౌన్‌పేమెంట్ & కేవలం ₹7,999 EMI తో ఈ కారును మీ ఇంటికే తీసుకెళ్లే అవకాశం వచ్చింది. ఇదంతా కలలా అనిపించినా, ఇదే నిజం.
₹0 డౌన్‌పేమెంట్ ఆఫర్ – SUV కలను నిజం చేసుకోండి
టాటా మోటార్స్ కొత్తగా ప్రవేశపెట్టిన ఫైనాన్స్ ప్లాన్‌లో భాగంగా, మీరు ముందుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కొత్త నెక్సాన్‌ను కొనగలరు. ఈ స్కీమ్ కింద కేవలం ₹7,999 EMI తో మీరు డ్రైవింగ్ ప్రారంభించవచ్చు. బ్యాంకులు, NBFCలతో టాటా కలసి రూపొందించిన ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్, చాలా మంది యువత డ్రీమ్ SUV కలను నిజం చేస్తోంది. ముఖ్యంగా కారు కొనుగోలులోకి కొత్తగా అడుగు పెట్టే మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది గొప్ప అవకాశం.
బయట మోడరన్, లోపల గల్జరీ టచ్
2025 నెక్సాన్ డిజైన్‌లో టాటా ఎటువంటి రాజీ పడలేదు. కొత్త ఫ్రంట్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, మస్క్యులర్ బాడీ లైన్, రెండు టోన్ కలర్ ఆప్షన్స్, స్టయిలిష్ అలాయ్ వీల్స్ ఈ కారును అగ్రెసివ్‌గా చూపిస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు ట్రెండీగా కనిపిస్తాయి.
కారు లోపల అడుగు పెట్టగానే ప్రీమియం ఆంబియన్స్ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ (వైరలెస్ Android Auto, Apple CarPlay) ప్రధాన ఆకర్షణ. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ HVAC కంట్రోల్స్, అంబియంట్ లైటింగ్, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్, సన్‌రూఫ్, రియర్ AC వెంట్‌లు లగ్జరీ కార్లను గుర్తుకు తెస్తాయి. టాప్ వేరియంట్లలో, స్టీరింగ్ వీల్‌పై ఇల్యూమినేటెడ్ టాటా లోగో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
సేఫ్టీకి ఫుల్ మార్క్స్
భారత వినియోగదారులు ఇప్పుడు కేవలం స్టైల్ మీద కాకుండా సేఫ్టీ మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీనికి అనుగుణంగా, టాటా నెక్సాన్ 2025లో అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఉన్నాయి. ESC, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్టు, రియర్ పార్కింగ్ కెమేరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి ఈ కారును సేఫ్టీ పరంగా మేటిగా నిలబెడతాయి.
మైలేజ్ కింగ్ - డీజిల్, టర్బో పెట్రోల్ వేరియంట్ కూడా
నెక్సాన్ రెండు శక్తిమంతమైన ఇంజిన్ ఆప్షన్లలో వస్తోంది, అవి – 1.2L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్. ఈ రెండూ BS6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. మాన్యువల్, AMT, DCT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ముఖ్యంగా డీజిల్ వేరియంట్, టెస్ట్ కండిషన్లలో 35 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. దీర్ఘదూర ప్రయాణాలకు, రోజూ పని చేసే ఉద్యోగులకు ఇది ఒక మినీ జాక్‌పాట్.
SUV సెగ్మెంట్‌లో టాప్ కంటెండర్
రూ. 10 లక్షల లోపు బడ్జెట్‌లో ప్రీమియం SUV కోసం వెతుకుతున్నవారికి నెక్సాన్ 2025 బెస్ట్ పిక్. డిజైన్, ఫీచర్స్, సేఫ్టీ, ఫైనాన్స్, ఇలా అన్నిటిలోనూ ఇది నెక్స్ట్ లెవెల్. అందుకే ఈ కారు మరలా మార్కెట్లో హిట్ అనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.





















