అన్వేషించండి

Best-selling Electric Scooter: హీరో విడా VX2 స్కూటర్‌ను యూత్‌ ఎగబడి కొంటున్నారు, రేటు కేవలం రూ.45 వేలే!

Hero VIDA Vx2 Electric Scooter: విడా VX2 ఇ-స్కూటర్ కస్టమర్లలో, ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకర్షిస్తోంది. బ్యాటరీ అద్దె పథకంతో ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 44,990 మాత్రమే.

Hero VIDA Vx2 Specifications: హీరో మోటోకార్ప్‌ అనుబంధ VIDA బ్రాండ్ నుంచి వచ్చిన VX2 స్కూటర్ తాజాగా మార్కెట్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్‌ చేయడంతో, యూత్‌కు తెగ నచ్చుతోంది. ఈ బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్కూటర్‌ ధర కేవలం ₹44,990 (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభమవుతోంది. అంతేకాదు, దీనికి బ్యాటరీ 'రెంట్‌ మోడల్'లో ఉండటం వల్ల ప్రారంభ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

VIDA బ్రాండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
ఈ ఏడాది జులైలో, VIDA, దేశవ్యాప్తంగా 11,022 యూనిట్లను డీలర్లకు పంపించింది. రవాణా చేసిన వాహనాల్లో 10,489 యూనిట్లు వాహన రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఫలితంగా VIDA EV మార్కెట్ వాటా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయి 10.2% కు చేరుకుంది. ఇది ఈ కంపెనీకి ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక మార్కెట్‌ వాటా.

డిజైన్ & ఫీచర్లు – యువతకు నచ్చేలా
VIDA VX2 స్కూటర్‌ను, 2023లో EICMA షోలో ప్రదర్శించిన VIDA Z కాన్సెప్ట్ ఆధారంగా డిజైన్‌ చేశారు. V2 మోడల్‌తో పోలిస్తే VX2ను మరింత అర్థవంతమైన ధరతో, ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులోకి తెచ్చారు.

ఫీచర్ల విషయానికి వస్తే:

  • కలర్ TFT డిస్‌ప్లే
  • LED లైటింగ్
  • క్లీన్‌గా ఉన్న బాడీ డిజైన్ కటింగ్‌
  • కాంపాక్ట్ డైమెన్షన్లు
  • అద్భుతమైన యాక్సెలరేషన్
  • OTA (ఓవర్‌ టు ఎయిర్‌) అప్‌డేట్స్‌తో చాలా ఫంక్షనాలిటీలు

బ్యాటరీ రెంటల్‌ ప్లాన్‌ – ఈ-స్కూటర్‌కి కొత్త మలుపు
VIDA VX2 స్కూటర్‌ బ్యాటరీకి అద్దె ఆప్షన్‌ ఉన్నందువల్ల, కొనుగోలుదారులు స్కూటర్‌ను చాలా తక్కువ ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. VX2ను ₹44,990కి కొనుగోలు చేసిన తర్వాత, మీరు బ్యాటరీని అద్దెకు తీసుకోవాలి. కిలోమీటరుకు కేవలం ₹1.25 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా రోజూ తక్కువ దూరాలు ప్రయాణించే వాళ్లకు చాలా మంచి ఎంపిక.

రేంజ్, వేగం & వేరియంట్లు

VIDA VX2 స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - VX2 Go & VX2 Plus.

వేరియంట్‌   బ్యాటరీ కెపాసిటీ IDC రేంజ్ టాప్ స్పీడ్
VX2 Go  2.2 kWh 92 km  70 km/h
VX2 Plus  3.4 kWh  142 km 80 km/h

ఇవన్నీ IDC (Indian Driving Conditions) డేటా ప్రకారం ఉన్న అంచనాలు. రియల్-టైమ్‌ వినియోగం ఆధారంగా ఈ పరిధిలో కాస్త వ్యత్యాసం ఉండవచ్చు.

VX2లో ఇంకా ప్రత్యేకతలు ఏంటి?

  • VX2లో తీసి, పెట్టగలిగిన (రిమూవబుల్) బ్యాటరీ ఉంది. అంటే, మీరు ఈ బ్యాటరీని ఇంట్లోనే చార్జ్ చేయవచ్చు.
  • డ్యూయల్‌ రైడింగ్‌ మోడ్స్‌ (Eco, Power)
  • USB ఛార్జింగ్‌ పోర్ట్
  • OTA అప్‌డేట్స్‌కు సపోర్ట్
  • VIDA యాప్‌ సపోర్ట్‌తో స్కూటర్‌ను మొబైల్‌ నుంచే మానిటర్‌ చేయవచ్చు

మొదటిసారి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునేవారికి, బ్యాటరీ రెంట్‌ మోడల్‌ ద్వారా అందుబాటులో ఉన్న VIDA VX2 మంచి ఆప్షన్‌. స్మార్ట్‌ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, విశ్వసనీయ బ్రాండ్ బ్యాకప్‌ - ఇవన్నీ కలగలిసి ఇది మార్కెట్లో వేగంగా అమ్ముడవుతోంది. మీ అవసరాలకు అనుగుణంగా పరిధి, బ్యాటరీ రకం ఎంపిక చేసుకోగల స్వేచ్ఛ ఈ బండిని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget