అన్వేషించండి

Upcoming Flex Fuel Cars India 2026:భారత్ మార్కెట్‌లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల క్యూ! రేసులో దిగ్గజ కంపెనీలు! పూర్తి వివరాలు

భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రంగం వేగంగా పుంజుకోనుంది. పెట్రోల్ దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం E100 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో ఈ తరహా వాహనాలు తీసుకురావడంలో కంపెనీలు పోటీ పడుతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ పరిష్కారం.
  • మారుతి, టయోటా వంటి దిగ్గజ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ విడుదల చేస్తున్నాయి.
  • అధిక ధర, తక్కువ మైలేజీ సవాళ్లు; ప్రభుత్వ మద్దతు, ఇథనాల్ ధరలు కీలకం.

Upcoming Flex Fuel Cars India 2026:ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొందామంటే ఛార్జింగ్ సమస్యలు, రేంజ్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్ల కంపెనీలు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. భారీ సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ వెహికల్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. కేవలం పెట్రోల్‌తోనే కాకుండా, వందశాతం ఇథనాలతో నడిచే కార్లు, బైక్‌లపై పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం. 

ఇది కేవలం ఒక టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, భారత్‌ రైతన్నల పంటల నుంచి తయారయ్యే ఇథనాల్‌తో మన వాహనాలు పరుగులు తీయబోతున్న ఆత్మనిర్భర్ ప్రయాణం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. మరి ఈ కొత్త టెక్నాలజీ వల్ల మనకు వచ్చే లాభాలేంటీ? ధరలు ఎలా ఉండబోతున్నాయి?ఏయే కంపెనీలు రేసులో ఉన్నాయో చూద్దాం. 

అసలు ఏంటీ ఫ్లెక్స్‌ ఫ్యూయల్?  పెట్రోల్‌కు దీనికి తేడా ఏంటీ?

సాధారణంగా మన వాహనాలు పెట్రోల్‌ లేదా డీజిల్‌తో నడుస్తాయి. కానీ ప్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్‌ ప్రత్యేకత ఏంటంటే, ఇవి పెట్రోల్‌, ఇథనాల్ మిశ్రమంతో పని చేస్తాయి. ఇందులో కేవలం 20 శాతం ఇథనాల్‌ మాత్రమే కాకుండా, ఏకంగా వందశాతం ఇథనాల్  వాడుకోవచ్చు. ఈ ఇంజిన్‌లో ఉండే సెన్సార్లు ఇంధనంలోని ఇథనాల్ శాతాన్ని గుర్తించి, దానికి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్‌ను అడ్జెట్స్‌ చేసుకుంటాయి. ఇది వినియోగదారులకు, ప్రభుత్వానికి, పర్యావరణానికి ఒక నాన్‌ బ్రెయినర్ సొల్యూషన్ అని నిపుణులు చెబుతున్నారు. 

రేసులో ఉన్న దిగ్గజ కంపెనీలు 

2026లో భారత్ రోడ్లపైకి ఫ్లెక్సస్ ఫ్యూయల్ వాహనాలు జాతర కనిపిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ మోడళ్లను లాంచ్ చేశాయి. మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్‌ కార్‌ మారుతి వ్యాగనర్‌ ఆర్‌ బయోఫ్లెక్సస్ పేరుతో జూన్ 4న లాంచ్ చేసింది. ఇది వంద శాతం ఇథనాల్‌తో నడుస్తుంది. 

టయోటా తన పాపులర్ మోడల్ ఇన్నోవా హైక్రాస్‌తో ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్‌  ఫ్లెక్స్ ఫ్యూయల్‌ పైలట్ ప్రాజెక్టును నడుపుతోంది. టాటా మోటార్స్ వచ్చే ఏడాది ఆరంభం నాటికి తన మొదటి ప్లెక్స్ ఫ్యూయల్‌ వాహనాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. హీరో మోటోకార్ప్‌ జూన్‌3న హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ వేరియంట్లను మార్కెట్‌లోకి తెచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఇప్పటికే క్లాసిక్‌ 35 మోడల్‌ను ఫ్లెక్స్ ఫ్యూయల్‌ అనుకూలంగా మార్చింది. మిగిలిన పోర్ట్‌పోలియోను కూడా అప్‌డేట్ చేస్తోంది. 

ఫ్లెక్స్ ఫ్యూయల్ సామాన్యుడికి లాభమా? నష్టమా?

ఫ్లెక్స్ ఫ్యూయల్‌ వాహనాల విషయంలో రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్‌ కార్లు సాధారణ పెట్రోల్‌ కార్ల కంటే సుమారు 50 వేల నుంచి 85వేల వరకు ఎక్కువ ధర ఉండచ్చు. అయితే టూవీలర్స్‌ ధర వ్యత్యాసం కేవలం 4 శాతమే ఉంటుంది. ఇథనాల్‌లో పెట్రోల్ కంటే తక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి మైలేజీ 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ లోటును పూడ్చాలంటే ఇథనాల్‌ ధర పెట్రోల్ కంటే కనీసం 30 శాతం తక్కువగా ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో E85 ఇంధనం ధర 82 రూపాయలు ఉండగా, పెట్రోల్ ధర 102 కంటే ఎక్కువగా ఉంది. 

బ్రెజిల్‌లా భారత్ మారుతుందా?

ఫ్లెక్స్ ఫ్యూయల్‌ విజయంలో బ్రెజిల్‌ ప్రపంచానికి ఆదర్శం. అక్కడ విక్రయించే కొత్త కార్లలో 90 శాతం FFVs ఉన్నాయి. బ్రెజిల్‌లో ఇథనాల్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణం అది పెట్రోల్ కంటే చౌకగా లభించడమే. భారత్ కూడా అదే దారిలో వెళ్తే, మన ముడి చమురు దిగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. 

2030 నాటికి భారత్ కార్ మార్కెట్‌ 60 లక్షల వాహనాలకు చేరుతుందని అంచనా. అందులో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 20 శాతం మాత్రమే ఉన్నా, మిగిలిన వాహనాలు ఇంధనంపైనే నడవాలి. ఈ క్రమంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్‌్ కానుంది. అయితే ప్రభుత్వం ఇథనాల్ ధరలను మరింత తగ్గించి, జీఎస్టీ రాయితీలు ఇస్తే తప్ప సామాన్యులు దీని వైపు మొగ్గు చూపే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.  

Frequently Asked Questions

అసలు ఏంటీ ఫ్లెక్స్‌ ఫ్యూయల్?

ప్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌లు పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంతో పనిచేస్తాయి. ఇవి 20% నుండి 100% వరకు ఇథనాల్‌ను ఉపయోగించగలవు. ఇంజిన్‌లోని సెన్సార్లు ఇంధనంలోని ఇథనాల్ శాతాన్ని గుర్తించి, పనితీరును సర్దుబాటు చేస్తాయి.

భారత్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు ఎందుకు అడుగులు వేస్తోంది?

పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల నుండి రక్షణ పొందడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు చూస్తోంది. ఇది రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్‌తో వాహనాలను నడపడం ద్వారా స్వయం సమృద్ధిని ప్రోత్సహిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వల్ల నష్టాలు/సవాళ్లు ఏమిటి?

ఈ వాహనాల ధర సాధారణ పెట్రోల్ కార్ల కంటే రూ. 50 వేల నుండి 85 వేల వరకు ఎక్కువ ఉండొచ్చు. ఇథనాల్ తక్కువ శక్తిని కలిగి ఉండటం వల్ల మైలేజీ సుమారు 30 శాతం తగ్గే అవకాశం ఉంది.

భారతదేశంలో ఏయే కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను విడుదల చేస్తున్నాయి?

మారుతి (వ్యాగనర్ ఆర్ బయోఫ్లెక్సస్), టయోటా (ఇన్నోవా హైక్రాస్), టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను విడుదల చేస్తున్నాయి లేదా ప్రణాళిక చేస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget