అన్వేషించండి

First E85 Fuel Station: ఢిల్లీలో దేశంలోనే తొలి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం! లీటర్ పెట్రోల్‌పై 20 రూపాయలు ఆదా!

First E85 Fuel Station:ఢిల్లీలో దేశంలోనే తొలి E85 ఇంధన కేంద్రం ప్రారంభమైంది. లీటరుకు రూ. 20 వరకు ఆదా చేసే ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ పూర్తి వివరాలు చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశ తొలి E85 ఫ్యూయల్ స్టేషన్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది.
  • E85లో 85% ఇథనాల్; లీటరుకు రూ.20 తక్కువ ధర.
  • పాత వాహనాలకు E85 సరిపోదు, ప్రత్యేక ఇంజిన్ అవసరం.
  • మారుతి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ మోడల్ విడుదల చేసింది.

First E85 Fuel Station: భారత్‌ ఇంధన మార్కెట్‌లో సరికొత్త శకం మొదలైంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని పూసా రోడ్‌లో దేశంలోనే మొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. 

అసలు ఏంటీ E85 ఫ్యాయల్

సాధారణంగా పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ ఇంధనం ఒక మిశ్రమం. E85 అంటే ఇందులో 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ప్రస్తుతం మనం వాడుతున్న E20 పెట్రోల్‌లో కేవలం 20 శాతం ఇథనాల్ మాత్రమే ఉంటుంది. ఇథనాల్ శాతం పెరగడం వల్ల ఇంధన ధర గణనీయంగా తగ్గుతోంది. 

Image

లీటర్‌కు 20 రూపాయలు ఆదా

ఈ సరికొత్త E85 ఇంధన ధరను లీటర్కు 82.12 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ20 పెట్రోల్‌ ధరలతో పోలిస్తే ఇది దాదాపు ఇరవై రూపాయలు తక్కువకు వస్తుంది. రోజువారి ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి, ముఖ్యంగా ట్యాక్సీలు, డెలివరీ వాహనదారులకు ఇది వరమని చెప్పవచ్చు. 
Image

పాత వాహనాలకు పనికిరాదు 

మీ దగ్గర పాత పెట్రోల్ కారులో నేరుగా E85 ఇంధనాన్ని పోయలేరు దీని కోసం ప్రత్యేకమైన ఫ్లెక్స్‌ ఫ్యూయల్ ఇంజన్ అవసరం. E85 ఇంధనం వాడే కార్లలో ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంకులు, కొత్త రకమైన ఫ్యూయల్ లైన్లు, రీ ప్రోగ్రామ్ చేసిన ఎలక్ట్రానికి కంట్రోల్ యూనిట్‌ ఉండాలి. 

Image

ఇథనాల్‌లో పెట్రోల్‌ కంటే తక్కువ శక్తి ఉంటుంది. దీని వల్ల కారు మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ కారణంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ధర సాధారణం కార్ల కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు. 

Image

మారుతి ముందడుగు 

భారత్‌ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఇది కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంధన కేంద్రాల నెట్‌వర్క్ పెరిగిన తర్వాత సాధారణ ప్రజలకు విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

Image

వాహనాన్ని ఎక్కువగా వాడే వారికి మాత్రమే E85కార్లు లాభసాటిగా ఉంటాయి. కారు కొనుగోలు చేసేటప్పుడు పెట్టే అదనపు ఖర్చును ప్రతి లీటరుపై ఆదా అయ్యే 20 రూపాయలతో భర్తీ చేసుకోవాలంటే నిరంతరం వినియోగం అవసరం తక్కువగా వాడే వారికి దీని వల్ల పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చు. బ్రెజిల్ వంటి దేశాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు చాలా పాపులర్. E85 వాడకం వల్ల కార్బన్ ఉద్గారాలు, కాలుష్యం తగ్గుతాయి. 

Image

Frequently Asked Questions

E85 ఇంధనం అంటే ఏమిటి?

E85 ఇంధనం అనేది పెట్రోల్ మరియు ఇథనాల్ మిశ్రమం. ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటాయి. ఇది ఇథనాల్ శాతం పెరగడం వల్ల తక్కువ ధరకే లభిస్తుంది.

భారతదేశంలో మొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ప్రారంభమైంది?

దేశ రాజధాని న్యూఢిల్లీలోని పూసా రోడ్‌లో భారతదేశంలోనే మొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన ధరల ఉపశమనానికి కేంద్రం వేసిన కీలక అడుగు.

E85 ఇంధనం వల్ల ఎంత ధర ఆదా అవుతుంది?

E85 ఇంధన ధర లీటర్‌కు 82.12 రూపాయలు. ప్రస్తుతం E20 పెట్రోల్‌తో పోలిస్తే ఇది దాదాపు ఇరవై రూపాయలు తక్కువకు వస్తుంది.

పాత పెట్రోల్ వాహనాలకు E85 ఇంధనం పని చేస్తుందా?

లేదు, పాత పెట్రోల్ కార్లలో నేరుగా E85 ఇంధనాన్ని వాడలేరు. దీనికి ప్రత్యేకమైన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్, ఫ్యూయల్ ట్యాంకులు మరియు కొత్త రకమైన ఫ్యూయల్ లైన్లు అవసరం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు
రూ.8.14 లక్షలకే Hyundai Exter Knight Edition.. బ్లాక్ లుక్‌తో మెరిసిపోతున్న కొత్త అవతార్‌
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో కొత్త 'నైట్‌ ఎడిషన్‌' - కేవలం రూ.15,000 కే స్పోర్టీ లుక్, ఆల్ బ్లాక్ క్యాబిన్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget