అన్వేషించండి

Hyundai Venue Prices: హ్యుందాయ్ వెన్యూ ప్రియులకు షాక్: పెరిగిన కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత భారమంటే?

Hyundai Venue Prices: హ్యుందాయ్ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'వెన్యూ' ధరలను పెంచింది. ముఖ్యంగా డీజిల్, టర్బో-పెట్రోల్ వేరియంట్లపై ఈ పెంపు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ SUV ధరలు పెరిగాయి.
  • 1.2 లీటర్ పెట్రోల్ HX5 MT మోడల్ ధర రూ. 20,000 పెరిగింది.
  • టర్బో-పెట్రోల్ DCT వేరియంట్ల ధరలు రూ. 5,000-9,000 పెరిగాయి.
  • డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8,000 చొప్పున పెంచారు.

Hyundai Venue Prices: ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న హ్యుందాయ్ వెన్యూ ధరలు పెరిగాయి. కంపెనీ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ లైనప్‌లోని పలు వేరియంట్ల ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉన్న కార్ల ధరలు పెరిగినప్పటికీ, వెన్యూ ఓవరాల్ ధరల శ్రేణి మాత్రం రూ. 7.99 లక్షల నుండి రూ. 15.51 లక్షల మధ్యే కొనసాగుతోంది.

పెట్రోల్ వేరియంట్లపై..

1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన వేరియంట్లలో 'HX5 MT' మోడల్‌పై ఏకంగా రూ. 20,000 వరకు భారం పడింది. వెన్యూ లైనప్‌లోనే ఇదే అత్యధిక పెంపు కావడం గమనార్హం. దీనివల్ల పాత ధర రూ. 9.35 లక్షల నుండి రూ. 9.55 లక్షలకు చేరింది. అయితే బేస్ మోడల్ HX2, మిడ్-లెవల్ HX6T వంటి ఇతర పెట్రోల్ వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు.

టర్బో-పెట్రోల్ వాహానాల‌పై..

1.0 లీటర్ టర్బో-పెట్రోల్ విభాగంలో మూడు మిడ్-లెవల్ డిసిటి (DCT) వేరియంట్ల ధరలు పెరిగాయి. 'HX5 DCT', 'HX6 DCT' మోడళ్ల ధరలను రూ. 9,000 చొప్పున పెంచారు. అదేవిధంగా 'HX8 DCT' వేరియంట్ ధర రూ. 5,000 పెరిగింది. స్పోర్టీ లుక్ తో వచ్చే 'N Line' వేరియంట్ల ధరలు మాత్రం పాతవే కొనసాగుతున్నాయి. పెర్ఫార్మెన్స్ కోరుకునే టర్బో ప్రియులకు ఈ పెంపు స్వల్ప ఇబ్బంది కలిగించవచ్చని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

డీజిల్ వేరియంట్లపై భారం

డీజిల్ ఇంజిన్ కలిగిన వెన్యూ కార్ల ధరలు కూడా పెరిగాయి. HX2, HX5, HX5 AT, HX7 వంటి అన్ని డీజిల్ వేరియంట్లపై రూ. 8,000 చొప్పున పెంపుదల కనిపించింది. అయితే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన టాప్-ఎండ్ HX8 AT, HX10 AT మోడళ్ల ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. 116hp పవర్, 250Nm టార్క్ ఇచ్చే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వెన్యూలో అత్యంత శక్తివంతమైన ఆప్షన్ గా ఉంది. కార్ల తయారీ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. కొత్తగా వెన్యూ కారు కొనే ప్లాన్ లో ఉన్నవారు తమ సమీప షోరూమ్‌ను సందర్శించి అప్‌డేటెడ్ ధరల వివరాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

హ్యుందాయ్ వెన్యూ ధరలు ఎంత మారాయి?

హ్యుందాయ్ వెన్యూలో కొన్ని పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలు పెరిగాయి. డీజిల్ మోడళ్లపై అదనంగా రూ. 8,000 వరకు పెరిగింది. HX5 MT పెట్రోల్ వేరియంట్ ధర రూ. 20,000 వరకు పెరిగింది.

ఏ పెట్రోల్ వేరియంట్ల ధరలు పెరిగాయి?

1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన HX5 MT మోడల్ ధర రూ. 20,000 వరకు పెరిగింది. 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ DCT వేరియంట్లలో HX5 DCT, HX6 DCT ధరలు రూ. 9,000 చొప్పున, HX8 DCT ధర రూ. 5,000 పెరిగాయి.

డీజిల్ వేరియంట్లలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

HX2, HX5, HX5 AT, HX7 వంటి డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8,000 పెరిగాయి. అయితే, కొత్తగా వచ్చిన టాప్-ఎండ్ HX8 AT, HX10 AT మోడళ్ల ధరలు స్థిరంగా ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ మొత్తం ధరల శ్రేణి ఎంత?

ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, హ్యుందాయ్ వెన్యూ ఓవరాల్ ధరల శ్రేణి రూ. 7.99 లక్షల నుండి రూ. 15.51 లక్షల మధ్యే కొనసాగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget