అన్వేషించండి

Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?

Hyundai India : భారత్ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో హ్యూందాయ్‌ హవా వేరే చెప్పాల్సిన పని లేదు. మార్చి 2026 నాటికి అందుబాటులో ఉన్న మోడల్స్ గురించి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భవిష్యత్తులో ఎక్స్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌, బేయన్‌, న్యూ క్రెటాలను విడుదల చేయనుంది.

Hyundai India : భారతీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన హ్యూందాయ్‌ మోటార్ ఇండియా 2026 మార్చి నాటికి తన పట్టును మరింత పటిష్టం చేసుకుంది. 1998లో శాంట్రోతో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సంస్థ నేడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌గా ఎదిగింది. ప్రస్తుతం హ్యూందాయ్‌ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 13 మోడళ్లు ఉండగా, అందులో 10 అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మరో మూడు మోడళ్లు త్వరలో విడుదల కానున్నాయి. 

ఈ నెలలో హ్యూందాయ్‌  తన అత్యంత ఆదరణ పొందిన సెడాన్ వెర్నాను సరికొత్త హంగులతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మార్చి 9న విడుదలైన 2026 హ్యూందాయ్‌ వెర్నా, 10.98 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వెర్నాలో బాస్‌ మోడ్‌, 360 డిగ్రీ కెమెరా, భద్రత కోసం 7 ఎయిర్‌ బ్యాగ్‌లు అత్యాధునిక ఫీచర్లు జోడించారు. 

జనవరి 2026లో హ్యూందాయ్‌ తన అతి పెద్ద ఎలక్ట్రిక్‌ వాహనం స్టారియా ఎలక్ట్రిక్‌ను ఆవిష్కరించింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. ఇందులో 9 మంది కూర్చునే సౌకర్యం ఉంది. అయితే అమ్మకాల వ్యూహంలో భాగంగా నవంబర్ 2025లో టక్సన్ ఎస్‌యూవీని ఇండియాలో నిలిపివేసింది. 

హ్యూందాయ్ కార్ల ధరల జాబితా

ప్రస్తుతం హ్యూందాయ్‌ కార్ల శ్రేణి సామాన్యుడి నుంచి లగ్జరీ ప్రియుల వరకు అందరికీ అందుబాటులో ఉంది. అత్యంత తక్కువ ధర కలిగిన గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కారు అయోనిక్ 5 వరకు ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 

మోడల్ పేరు     ఎక్స్ షోరూమ్‌ ధర(లక్షల్లో)
హ్యూందాయ్‌ గ్రాండ్‌ఐ 10 నియోస్‌    ₹5.55-₹7.92
హ్యూందాయ్‌ ఐ20 ₹5.99-₹11.53  
హ్యుందాయ్ ఎక్స్టర్ ₹5.64 - ₹9.38
హ్యుందాయ్ ఆరా ₹6.00 - ₹8.54
హ్యుందాయ్ వెన్యూ ₹8.00 - ₹15.51
హ్యుందాయ్ క్రెటా ₹10.79 - ₹20.05
హ్యుందాయ్ వెర్నా (2026) ₹10.98 - ₹18.25
హ్యుందాయ్ అల్కజార్ ₹14.50 - ₹21.06
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ₹18.02 - ₹23.82
హ్యుందాయ్ అయానిక్ 5 ₹46.30

ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని ఆధిపత్యం 

హ్యూందాయ్‌ ఇండియా లైన్‌లో 9 ఎస్‌యూవీలు ఉన్నాయి. 

హ్యూందాయ్‌ ఎక్స్టర్‌- ఇది హ్యూందాయ్ నుంచి లభిస్తున్న అత్యంత చౌకైన ఎస్‌యూవీ. ఇది టాటా పంచ్‌, సిట్రోయెస్‌ సీ 3 మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. 

హ్యూందాయ్‌ క్రెటా- భారత్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా క్రెటా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సెప్టెంబర్‌ 2025లో విడుదలైన క్రెటా కింగ్‌ వేరియంట్‌ 17.89 లక్షల ధరతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

హ్యూందాయ్‌ అల్కజార్‌-  పెద్ద కుటుంబాల కోసం క్రెటా ఆధారిత 3-రో ఎస్‌యూవీా అల్కజార్ మహీంద్రా స్కార్పియో ఎన్‌, హెక్టార్‌ ప్లస్‌తో తలపడుతోంది. 

ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహం 

పర్యావరణ హితమైన ప్రయాణం కోసం హ్యూందాయ్‌ తన ఎలక్ట్రిక్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ప్రస్తుతం క్రెటా ఎలక్ట్రిక్‌ 18.02 లక్షల వద్ద ప్రారంభమవుతుండగా, లగ్జరీ ఈవీ విభాగంలో ఆయానిక్‌5 రూ. 46.30లక్షలతో హై ఎండ్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది. భవిష్యత్‌లో అయానిక్ 6, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్‌ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసే యోజనలో కంపెనీ ఉంది. 

రాబోయే కార్లు ఇవే 

ఈ ఏడాది ద్వితీయార్థంలో 2027లో మరికొన్ని మోడల్స్‌ను హ్యాందాయ్‌  సిద్ధం చేస్తోంది. 

హ్యాందాయ్‌ ఎక్స్ట్‌ర్‌ ఫేస్‌లిఫ్ట్‌- 2026 మధ్యలో ఆశించవచ్చు. 

హ్యాందాయ్‌ బేయన్‌- ఇది సరికొత్త క్రాస్ ఓవర్‌ ఎస్‌యూవీ, 2026 చివరలో వచ్చే అవకాశం ఉంది. 

న్యూక్రెటా- దీనిని 2027లో లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

నిపుణుల సూచనలు ఏ కారు ఎవరి కోసం సూచిస్తున్నారంటే?

సిటీ డ్రైవింగ్ కోసం 

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి హ్యూందాయ్ ఎక్స్టర్ లేదా వెన్యూ వేరియంట్లు ఉత్తమం. 

సౌకర్యం- ఆరోగ్యం

వెన్నునొప్పితో బాధపడేవారు క్రెటా IVT ఆటోమేటిక్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే దీని సస్పెన్షన్‌ వ్యవస్థ ప్రయాణాన్ని అత్యంత సుఖమయం చేస్తుంది. 

మైలేజీ ప్రాధాన్యత-   

నెలకు 3వేల కిలోమీటర్లు కంటే ఎక్కువ ప్రయాణించేవారు వెన్యూ డీజిల్ ఆటోమేటింక్‌ వేరియంట్‌ పరిశీలించవచ్చు. 

Frequently Asked Questions

ప్రస్తుతం హ్యూందాయ్‌ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని మోడళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి?

ప్రస్తుతం హ్యూందాయ్‌ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 13 మోడళ్లు ఉండగా, అందులో 10 అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget