అన్వేషించండి

Hyundai Exter Price India: సరికొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ – స్టైలిష్ లుక్, అదిరిపోయే టెక్నాలజీతో టాటా పంచ్‌కు గట్టి పోటీ!

Hyundai Exter Price India: హ్యుందాయ్ ఇండియా 2026 ఎక్స్టర్ మోడల్‌ను రూ. 5.80 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇందులో కొత్త డిజైన్, హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ ఎక్స్టర్ 2026 రూ. 5.80 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది.
  • కొత్త గ్రిల్, అలాయ్ వీల్ డిజైన్, విశాలమైన బూట్ స్పేస్ తో వస్తుంది.
  • డ్యాష్‌క్యామ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్లతో వస్తుంది.
  • 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ వెర్షన్ తో అందుబాటులో ఉంది.

Hyundai Exter Price India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai), భారత మార్కెట్లో తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ 'ఎక్స్టర్' (Exter) 2026 వెర్షన్‌ను తాజాగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.42 లక్షల వరకు ఉంది. టాటా పంచ్‌కు గట్టి పోటీనిచ్చే ఈ కారులో డిజైన్, ఇంటీరియర్ పరంగా కంపెనీ పలు కీలక మార్పులు చేసింది. మెకానికల్ గా చూస్తే పాత ఇంజిన్ నే కొనసాగించినప్పటికీ, ఫీచర్ల విషయంలో మాత్రం ఈ కారు మరింత అప్‌డేట్ అయ్యింది.

కొత్త డిజైన్ హైలైట్స్

2026 హ్యుందాయ్ ఎక్స్టర్ ఎక్స్ టీరీయ‌ర్ రూపంలో కొన్ని మార్పులు జరిగాయి. ముందు భాగంలో డార్క్ ఫినిషింగ్ ఉన్న సరికొత్త గ్రిల్ డిజైన్ ఆకట్టుకుంటుంది. బంపర్ మధ్యలో కొత్త గార్నిష్ అమర్చారు. 15-అంగుళాల అలాయ్ వీల్స్‌కు కొత్త డిజైన్ ఇవ్వడంతో పాటు వెనుక వైపు పెద్ద స్పాయిలర్‌ను చేర్చారు. టెయిల్ గేట్, సి-పిల్లర్ వద్ద కొత్త గార్నిష్ వర్క్ కనిపిస్తుంది. 1,643 మిమీ ఎత్తుతో తన సెగ్మెంట్‌లోనే అత్యంత ఎత్తైన కారుగా ఇది నిలిచింది. ఇందులో గోల్డెన్ బ్రాంజ్, టైటానియం బ్లాక్ మ్యాట్ వంటి రెండు కొత్త రంగులతో కలిపి మొత్తం 8 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రీమియం ఇంటీరియర్

కారు లోపలి భాగం ఇప్పుడు నేవీ, గ్రే కలర్ డ్యూయల్-టోన్ థీమ్‌తో మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై కార్బన్ ప్యాటర్న్ ఉన్న 3D ఫినిషింగ్, డి-కట్ (D-cut) స్టీరింగ్ వీల్ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. స్పోర్టీ లుక్ కోసం మెటల్ పెడల్స్ అమర్చారు. ప్రయాణీకుల సౌకర్యం కోసం ఫోల్డింగ్ డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ సౌకర్యం కల్పించారు. కారులో 391 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ ఉండటం వల్ల లగేజీకి ఇబ్బంది ఉండదు.

అత్యాధునిక ఫీచర్లు

ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా డ్యాష్‌క్యామ్ (Dashcam) ఫీచర్‌ను హ్యుందాయ్ పరిచయం చేసింది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సదుపాయం ఉంది. వెనుక సీటు ప్రయాణీకుల కోసం టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ ఇచ్చారు. బ్లూలింక్ (Bluelink) టెక్నాలజీ ద్వారా 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు వాడుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే 300 వాయిస్ కమాండ్స్ ఈ కారు ప్రత్యేకత.

ఇంజిన్, పర్ఫార్మెన్స్

ఇందులో 1.2 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మాన్యువల్ (MT), ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. పొదుపుగా ప్రయాణించాలనుకునే వారి కోసం సీఎన్‌జీ (CNG) వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్‌జీ మోడల్‌లో 225 లీటర్ల డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని వాడటం వల్ల డిక్కీలో కొంత స్పేస్ లభిస్తుంది. తక్కువ ధరలో మంచి ఎస్‌యూవీ ఫీచర్లు కోరుకునే వారికి 2026 ఎక్స్టర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్ప‌వ‌చ్చు.

Frequently Asked Questions

2026 హ్యుందాయ్ ఎక్స్టర్ ధర ఎంత?

2026 హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ. 5.80 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.42 లక్షల వరకు ఉంది.

కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ డిజైన్ లో వచ్చిన మార్పులు ఏమిటి?

కొత్త ఎక్స్టర్ లో డార్క్ ఫినిషింగ్ గ్రిల్, కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, వెనుక పెద్ద స్పాయిలర్, టెయిల్ గేట్, సి-పిల్లర్ వద్ద కొత్త గార్నిష్ వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్స్టర్ లో కొత్తగా ఏ ఫీచర్లు వచ్చాయి?

ఈ సెగ్మెంట్ లో మొదటిసారిగా డ్యాష్‌క్యామ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెనుక సీటు ప్రయాణీకుల కోసం టైప్-సి యూఎస్‌బీ పోర్ట్, బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్స్టర్ లో ఎన్ని రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?

హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్‌జీ (CNG) వెర్షన్ లో కూడా లభిస్తుంది. మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
పెట్రోల్‌తో 24.77km, సీఎన్‌జీతో 34.47km.. 2026 టయోటా గ్లాంజా మైలేజీకి ఫిదా అవ్వాల్సిందే!
టయోటా గ్లాంజా, మారుతి బలెనో, హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ - ఏ కారు మైలేజ్‌ ఎక్కువ?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget