Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
హ్యుండాయ్ వెన్యూ సేల్స్ మనదేశంలో మూడు లక్షల యూనిట్ల మార్కును చేరుకుందని కంపెనీ ప్రకటించింది.
హ్యుండాయ్ వెన్యూ మనదేశంలో 2019లో లాంచ్ అయింది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ అందించిన మొదటి ఎస్‌యూవీ ఇదే. ఎంజీ హెక్టార్‌లో కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉండనున్నాయని ముందే రివీల్ చేసినా... మొదట లాంచ్ అయింది మాత్రం వెన్యూనే. ఈ కారు సేల్స్ పరంగా కూడా దూసుకుపోయింది. మొత్తంగా మనదేశంలో మూడు లక్షల వెన్యూ కార్లను విక్రయించినట్లు హ్యుండాయ్ ఇటీవలే రివీల్ చేసింది.
ఈ కారులో బ్లూలింక్ కనెక్టివిటీ సూట్ ఉంది. దీంతోపాటు మోడర్న్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. వేర్వేరు ఇంజిన్, గేర్ బాక్స్ కాంబినేషన్లు దీన్ని మరింత సక్సెస్‌ఫుల్ మోడల్‌గా మార్చాయి. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వెన్యూ ఎక్కువ సేల్స్‌ను సాధించింది.
లాంచ్ అయిన మొదటి ఆరు నెలల్లోనే 50 వేల మార్కును దాటింది. 2020 జూన్ నాటికి ఈ సేల్స్ లక్ష మైలురాయిని చేరుకుంది. 2021 డిసెంబర్ నాటికి 2.5 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయని వెన్యూ ప్రకటించింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే మరో 50 వేల యూనిట్లు అమ్ముడుపోయాయన్న మాట. దీన్ని బట్టి వెన్యూని కొనడానికి ఇంకా వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారన్న మాట.
ఇందులో 1.2 లీటర్ నాచురల్లీ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ యూనిట్ 82 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే... ఎనిమిది అంగుళాల ఇన్ఫోటెయిన్‌మెంట్ బ్లూలింక్ టెక్నాలజీ కనెక్టివిటీ సూట్ ఇందులో ఉంది. మొత్తం 52 ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆర్కామిస్ సౌండ్ సిస్టం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్, వెనకవైపు ఏసీ వెంట్లు, పార్కింగ్ కెమెరా కూడా ఉన్నాయి. దీని ధర రూ.7.11 లక్షల నుంచి రూ.11.83 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram