అన్వేషించండి

Kylaq Automatic Review: స్కోడా కైలాక్ ఆటోమేటిక్ మీ అంచనాలను ఎంతవరకు అందుకుంటుంది? టెస్ట్‌ రివ్యూ ఇదిగో

Skoda Kylaq Automatic Features: స్కోడా మోటార్స్, ఇటీవలే, కైలాక్ ఆటోమేటిక్‌ వేరియంట్‌ను పరిచయం చేసింది. స్కోడా బ్రాండ్‌తో వచ్చిన ఈ ఆటోమేటిక్ SUVని కొనడం వల్ల ప్రయోజనం ఉంటుందా?.

Skoda Kylaq Automatic Price, Mileage And Features In Telugu: భారతీయ మార్కెట్లో సబ్-4 మీటర్ SUVలకు సూపర్‌ డిమాండ్‌ ఉంది, ఈ సెగ్మెంట్‌ కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వీటిలోనూ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న వాహనాలను పట్టణ/నగర వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆటోమేటిక్‌ వేరియంట్‌ డ్రైవర్‌ శ్రమను తగ్గిస్తుంది. బ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బిగించడానికి, స్కోడా ఆటో ఇండియా, కైలాక్ ఆటోమేటిక్‌ను ప్రవేశపెట్టింది. 

ఏ ఆటోమొబైల్‌ కంపెనీ అయినా, తన కార్లకు సాటి లేదంటూ ఊదరగడొతుంది. స్వయంగా టెస్ట్‌ రైడ్‌ చేసి, ఆ బండిలోని అనుకూలతలు & ప్రతికూలతలు తెలుసుకోవడం తెలివైన పని. కంపెనీ చెప్పినట్లు స్కోడా కైలాక్ ఆటోమేటిక్ కారు స్టైలిష్‌గా ఉందా, లేదా?, పనితీరు & మైలేజ్ పరంగా కస్టమర్లకు బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుందా అని తెలుసుకోవడానికి రోడ్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్‌ రిజల్ట్స్‌ గురించి తెలుసుకుందాం. 

ట్రాన్స్‌మిషన్‌ & పెర్ఫార్మెన్స్‌
కైలాక్ ఆటోమేటిక్ 1.0-లీటర్ TSI టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో యాడ్‌ అయింది. ఈ ట్రాన్స్‌మిషన్‌తో డ్రైవింగ్ అనుభవం చాలా సున్నితంగా & సమతుల్యంగా ఉంటుంది. AMTకి బదులుగా నిజమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కారణంగా, గేర్‌లు మార్చేటప్పుడు చిన్న కుదుపులు కూడా లేకుండా చేస్తుంది. 

డ్రైవింగ్‌ను సరదాగా మార్చేందుకు, కారు స్టీరింగ్‌పై ప్యాడిల్ షిఫ్టర్స్‌ కూడా ఉన్నాయి. సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసినా లేదా హైవే మీద లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినా ఈ ఇంజిన్‌ అలసిపోయినట్లు లేదా బలహీనపడినట్లు ఎక్కడా అనిపించదు. దీని మిడ్‌ రేంజ్‌ టార్క్వీ ఓవర్‌టేకింగ్స్‌ను చాలా ఈజీగా మారుస్తుంది.

డైనమిక్ పెర్ఫార్మెన్స్‌
కైలాక్ ఆటోమేటిక్ స్టీరింగ్ అనుభూతి చాలా ఖచ్చితంగా & ప్రతిస్పందనతో కూడి ఉంటుంది. స్పోర్టియర్ సస్పెన్షన్ సెటప్ భారతీయ రోడ్‌ పరిస్థితులకు తగ్గట్లు కఠినంగా ఉంటుంది, అందుకే ఇది ఈ క్లాస్‌లో అత్యుత్తమం అనిపిస్తుంది. 189 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ వల్ల గుంతలు & స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా మీరు నమ్మకంగా డ్రైవ్ చేయవచ్చు.

మైలేజ్ ఎలా ఉంది?
కైలాక్ ఆటోమేటిక్ మైలేజ్ కూడా చాలా బాగుంది, లీటరుకు 10 కి.మీ.ల నుంచి 14 కి.మీ.ల మధ్య మైలేజీ ఇస్తుందని పరీక్షలో తేలింది, ఇది మాన్యువల్ వేరియంట్‌కు సమానం. సాధారణంగా, ఏ కారులోనైనా, మాన్యువల్‌తో పోలిస్తే ఆటోమేటిక్ వెర్షన్‌లో మైలేజీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.

కైలాక్ ఆటోమేటిక్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
కైలాక్ ఆటోమేటిక్ సరైన టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, ఇది AMT కంటే చాలా సున్నితమైన & నమ్మదగిన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. దీని TSI ఇంజిన్ బెస్ట్‌ పెర్ఫార్మ్‌ చేస్తుంది, దాని థ్రోటిల్‌ రెస్పాన్స్‌ కూడా చాలా షార్ప్‌గా ఉంటుంది, నగరం & హైవే డ్రైవింగ్‌లో ఫన్‌ను యాడ్‌ చేస్తుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget