అన్వేషించండి

Scorpio Loan EMI Plan: స్కార్పియో N కొనాలంటే ఎంత EMI కట్టాలి, మీ దగ్గర ఎంత డౌన్ పేమెంట్‌ ఉండాలి?

Mahindra Scorpio N Finance Plan: ఈ కారు కొనడానికి మీరు అతి కొద్ది మొత్తాన్ని డౌన్ పేమెంట్‌ రూపంలో డిపాజిట్ చేస్తే, మిగిలిన డబ్బును బ్యాంక్‌ సర్దుబాటు చేస్తుంది.

Scorpio N Price, Down Payment, Loan and EMI Details: మహీంద్రా స్కార్పియో N దేశంలోని అత్యంత విలాసవంతమైన SUVలలో ఒకటి. ఈ బండిని అటు క్లాస్‌ పీపుల్‌, ఇటు మాస్‌ పీపుల్‌ ఇద్దరూ ఇష్టపడతారు. స్కార్పియో N రోడ్డు మీదకు వచ్చిందంటే, మృగరాజు వేటకు బయల్దేరినట్లు కనిపిస్తుంది. ఈ బండి డిజైన్‌లో కనిపించే దర్జా, కారు లోపల కూర్చున్నవాళ్లకు కూడా అంటుకుంటుంది. అందుకే, మహీంద్ర స్కార్పియోకు అంత డిమాండ్‌. 

స్కార్పియో N ధర
మహీంద్రా & మహీంద్రా, స్కార్పియో N ను 6-సీటర్ & 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో మార్కెట్‌లోకి వదిలింది. మీరు కావాలనుకుంటే, మీ అవసరం & డ్రైవింగ్‌ స్టైల్‌కు అనుగుణంగా, ఈ SUVని పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ లేదా డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో కొనుక్కోవచ్చు, మహీంద్రా స్కార్పియో ఎన్ ఎక్స్-షోరూమ్ ధర (Mahindra Scorpio N ex-showroom price) రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, టాప్‌-ఎండ్‌ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ రేటు రూ. 25.15 లక్షల వరకు ఉంటుంది. తెలుగు నగరాల్లో, ఈ పవర్‌ఫుల్‌ ఫోర్‌వీలర్‌ ఆన్‌-రోడ్‌ ధర (Mahindra Scorpio N on-road price) దాదాపు రూ. 17.60 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, వేరియంట్‌ను బట్టి మారుతుంది.

EMIపై ఎలా కొనుగోలు చేయాలి?
మహీంద్రా స్కార్పియో N కొనుగోలు చేసే ముందు, మీరు ఈ మోడల్‌లో ఏ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు, మీరు మహీంద్రా స్కార్పియో Nలో Z2 Petrol MT 7 STR (ESP) (ఇది బేస్‌ వేరియంట్‌) వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, దీని ఆన్‌-రోడ్‌ ధర కోసం దాదాపు రూ. 17.60 లక్షలు చెల్లించాలి. మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ & నెలవారీ ఆదాయం విషయంలో బ్యాంక్‌ సంతృప్తి చెందితే మీకు మ్యాగ్జిమన్‌ లోన్‌ లభిస్తుంది. మీరు కేవలం రూ. 3.52 లక్షలను (కారు ధరలో 20%) డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు, మిగిలిన 80% మొత్తాన్ని బ్యాంక్‌ సర్దుబాటు చేస్తుంది. అంటే, రూ. 14.08 లక్షలను కార్‌ లోన్‌ రూపంలో మంజూరు చేస్తుంది. మీరు ఈ డబ్బును ఈజీ EMIల రూపంలో హ్యాపీ తిరిగి చెల్లించవచ్చు.

EMI ప్లాన్‌
రూ. 14.08 లక్షల రుణాన్ని బ్యాంక్‌ మీకు 9% వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందనుకుందాం. ఇప్పుడు, మీరు ఎంచుకునే టెన్యూర్‌ను బట్టి EMI నిర్ణయమవుతుంది.

7 సంవత్సరాల కాలంలో తిరిగి తీర్చేలా రుణం తీసుకుంటే నెలవారీ EMI రూ. 22,653 అవుతుంది.

6 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ పెట్టుకుంటే మంత్లీ EMIగా రూ. 25,380 తిరిగి చెల్లించాలి.

5 సంవత్సరాల కాల పరిమితితో రుణం తీసుకుంటే నెలకు రూ. 29,228 EMI బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయాలి.

4 సంవత్సరాల కాలంలో రుణం మొత్తం తీర్చే ఆప్షన్‌ ఎంచుకుంటే EMI రూ. 35,038 అవుతుంది.

బ్యాంక్‌ ఇచ్చే రుణం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ & బ్యాంక్‌ పాలసీపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌ చేస్తే, బ్యాంక్‌కు తిరిగి చెల్లించాల్సిన వడ్డీ మొత్తం ఆ మేరకు తగ్గిపోతుంది. కాబట్టి, వీలైనంత ఎక్కువ మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌ చేయండి, తక్కువ రుణం తీసుకోండి. లోన్‌ పేపర్ల మీద సంతకం చేసే ముందు ఆ పత్రాలను చదివి, అర్ధం చేసుకోవడం ముఖ్యం.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
The RajaSaab - King Size Interview: ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
Hair Loss Treatment: బట్టతల కంటే పెద్ద ఆరోగ్య సమస్య లేదు - ఇన్సూరెన్స్ కవర్ చేయాల్సిందే - ఈ దేశాధ్యక్షుడిదే అసలు విజన్ !
బట్టతల కంటే పెద్ద ఆరోగ్య సమస్య లేదు - ఇన్సూరెన్స్ కవర్ చేయాల్సిందే - ఈ దేశాధ్యక్షుడిదే అసలు విజన్ !
Embed widget