అన్వేషించండి

Life Tax Refund: మీ కారు లేదా బైక్‌ లైఫ్‌ ట్యాక్స్‌ తిరిగి పొందొచ్చు: సింపుల్‌ రూల్స్‌ & ప్రాసెస్‌ వివరాలు

Life Tax Refund For Cars Bikes: వాహనానికి లైఫ్‌ ట్యాక్స్‌ కట్టారా?, రాష్ట్రం మారితే ఆ ట్యాక్స్‌ను రిఫండ్‌గా తిరిగి పొందొచ్చు. NoC, రీరిజిస్ట్రేషన్‌, అవసరమైన డాక్యుమెంట్స్‌ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Process To Get Refund On Vehicle Life Tax: మీరు కొత్త కారు లేదా బైక్‌ కొన్నప్పుడు లైఫ్‌ ట్యాక్స్‌ (జీవిత కాల పన్ను) కట్టడం తప్పనిసరి. సాధారణంగా, ఏదైనా వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు కాబట్టి, ఈ ట్యాక్స్‌ 15 సంవత్సరాల పాటు వాహనానికి వర్తిస్తుంది. కానీ ఉద్యోగం, బిజినెస్‌ లేదా చదువు కారణంగా మీరు మరో రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తే?, అక్కడ మళ్లీ రీరిజిస్ట్రేషన్‌ చేయించుకుని కొత్తగా లైఫ్‌ ట్యాక్స్‌ కట్టాలి. ఇలాంటప్పుడు చాలా మంది “ఇప్పటికే పాత రాష్ట్రంలో చెల్లించాం కదా, డబ్బు పోతుందా?” అని ఆలోచిస్తారు. కానీ గుడ్‌ న్యూస్‌ ఏంటంటే, మీరు కట్టిన పాత లైఫ్‌ ట్యాక్స్‌ను రిఫండ్‌గా తిరిగి పొందవచ్చు.

రీరిజిస్ట్రేషన్‌ చేయించకపోయినా పర్లేదా?

మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వాహనాన్ని తీసుకువెళ్లి, అక్కడ 30 రోజులకుపైగా ఉంటే, కొత్త రాష్ట్రంలో తప్పనిసరిగా రీరిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఉదాహరణకు, విశాఖకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రూ. 1.25 లక్షల లైఫ్‌ ట్యాక్స్‌ కట్టి కొత్త కారు రిజిస్టర్‌ చేయించుకున్నారు. కానీ ఏడాది తిరగకముందే అతనికి బెంగళూరుకు బదిలీ అయింది. తన వాహనాన్ని కర్ణాటకలో వాడాలంటే అక్కడ కొత్తగా లైఫ్‌ ట్యాక్స్‌ కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. అంటే, ఏడాది కూడా కాకముందే ఒకే వాహనానికి రెండు రాష్ట్రాల్లో రెండుసార్లు లైఫ్‌ ట్యాక్స్‌ కట్టాల్సి వచ్చింది. కానీ ఆయన తెలివిగా అప్లై చేసి, ఆంధ్రప్రదేశ్‌లో కట్టిన ట్యాక్స్‌లో మిగిలిన సంవత్సరాల వాటాను రిఫండ్‌గా తిరిగి పొందగలిగారు.

రిఫండ్‌ రూల్స్‌

ప్రస్తుత మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఒక వాహనం లైఫ్‌ పీరియడ్‌ (జీవితకాలం) 15 సంవత్సరాలు అని గుర్తుంచుకోండి.

మీరు ఒక రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు వాడి, కొత్త రాష్ట్రానికి వెళ్తే, మిగిలిన సంవత్సరాలకు ట్యాక్స్‌ అక్కడ కట్టాలి.

గతంలో కట్టిన సంవత్సరాల లైఫ్‌ ట్యాక్స్‌ను పాత రాష్ట్రం నుంచి రిఫండ్‌గా క్లెయిమ్‌ చేయవచ్చు.

రిఫండ్‌ కోసం అప్లై చేసే విధానం

ముందుగా పాత రాష్ట్రంలోని RTO వద్ద నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) తీసుకోవాలి.

కొత్త రాష్ట్రంలో రీరిజిస్ట్రేషన్‌ చేసి, అక్కడి రూల్స్‌ ప్రకారం వెహికల్‌కు ట్యాక్స్‌ కట్టాలి.

కొత్త RC (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) కాపీ, ట్యాక్స్‌ రసీదు, పాత RC, బ్యాంక్‌ వివరాలు కలిపి పాత రాష్ట్రంలోని RTO కార్యాలయంలో రిఫండ్‌కు దరఖాస్తు చేయాలి.

ఉదాహరణకు....

ఒక వాహనం APలో 4 సంవత్సరాలు వాడి, కర్ణాటకకు తీసుకెళ్లారనుకోండి.

కర్ణాటకలో మిగిలిన 11 సంవత్సరాలకు లైఫ్‌ ట్యాక్స్‌ కట్టాలి.

APలో కట్టిన 4 సంవత్సరాల ట్యాక్స్‌ మొత్తాన్ని రిఫండ్‌గా క్లెయిమ్‌ చేయవచ్చు.

ఏపీ & తెలంగాణ స్పెషల్‌ రూల్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్‌ అయిన వాహనం తెలంగాణకు వస్తే, రిఫండ్‌ కోసం ఏపీలో రిజిస్ట్రేషన్‌ చేసిన RTO కార్యాలయంలోనే అప్లై చేయాలి.

అదే విధంగా, తెలంగాణలో రిజిస్టర్‌ అయిన వాహనం ఏపీలో రీరిజిస్ట్రేషన్‌ అయితే, తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చేసిన RTO వద్దే రిఫండ్‌ దరఖాస్తు ఇవ్వాలి.

వాహన యజమానులకు ఉపయోగపడే టిప్‌

చదువులు, ఉద్యోగం లేదా ట్రాన్స్‌ఫర్‌ల వల్ల రాష్ట్రం మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు చాలా మంది పాత రాష్ట్రంలో కట్టిన ట్యాక్స్‌ వృథా అయిపోయిందనుకుంటారు. కానీ అసలు వృథా కాదు. మీరు అప్లై చేస్తే ఆ డబ్బు మీ అకౌంట్‌లో తిరిగి వస్తుంది. కొత్త రాష్ట్రంలో రీరిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత పాత రాష్ట్రం నుంచి రిఫండ్‌ క్లెయిమ్‌ చేసుకుంటే, మీరు మంచి మొత్తాన్ని సేవ్‌ చేసుకోవచ్చు. ఈ రూల్‌ తెలిసినవాళ్లు లాభపడతారు, తెలియని వాళ్లు నష్టపోతారు.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget