అన్వేషించండి

కొత్త కారు కొనేవాళ్లకు గుడ్ న్యూస్‌, Maruti S Presso పై భారీ డిస్కౌంట్‌ - సేవ్‌ చేయడానికి మీరు రెడీనా?

Maruti S Presso Variants: మారుతి ఎస్ ప్రెస్సో ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో బేస్ STD మోడల్ & టాప్-స్పెక్ VXI CNG వేరియంట్ ఉన్నాయి. ఇది 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది.

Maruti S Presso GST Discounted Price: మారుతి సుజుకి, తన ప్రసిద్ధ మైక్రో SUV అయిన ఎస్‌ ప్రెస్సో ధరను భారీగా తగ్గించింది, తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తోంది. GST సంస్కరణలు 2.0 (GST Reforms 2.0) కింద, చిన్న పెట్రోల్ & CNG ఇంజిన్ కార్ల మీద పన్నులు తగ్గాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనేవాళ్లకు ఇది నిజంగా పెద్ద గుడ్‌ న్యూస్‌. GST 2.0 రూల్స్‌ ప్రకారం, మారుతి S ప్రెస్సో బేస్ మోడల్ రేటు ₹ 37,000 తగ్గింపును చూపుతోంది. అదే సమయంలో, టాప్-ఎండ్ CNG వేరియంట్ ధర ₹ 53,000 వరకు తగ్గుతోంది. మారుతి ఎస్ ప్రెస్సో మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో, మారుతి ఎస్‌ ప్రెస్సో ఎక్స్‌-షోరూమ్‌ ధర ప్రస్తుతం రూ. 4,26,500 (Maruti S Presso ex-showroom price, Hyderabad Vijayawada).

మారుతి S ప్రెస్సో రీసెంట్‌ లుక్స్‌ చాలా యూత్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. కారు ఫ్రంట్‌ ఎండ్‌లో షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ & ఎలివేటెడ్‌ గ్రిల్‌ SUV తరహా లుక్స్‌ ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో హై గ్రౌండ్‌ క్లియరెన్స్‌ & కంపాక్ట్‌ బాడీ డిజైన్‌ అర్బన్ డ్రైవింగ్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ అవుతాయి. రియర్‌ పార్ట్‌లో మోడ్రన్‌ టెయిల్‌ ల్యాంప్స్‌ & క్లీన్‌ లైన్స్‌ ఈ బండికి బలమైన ప్రెజెన్స్‌ తెస్తాయి. మొత్తంగా చూస్తే, మారుతి S ప్రెస్సో డిజైన్‌, చిన్న కార్లలోనూ SUV ఫీలింగ్‌ను ఇచ్చేలా ప్రత్యేకంగా ఉంది.

మారుతి S ప్రెస్సో ధరల్లో తగ్గింపు, వేరియంట్ వారీగా:

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో కొత్త ధరల్లో బేస్ మోడల్ STD (O) MT పై ₹ 37,000 డిస్కౌంట్ లభిస్తుంది.

LXI (O) MT వేరియంట్ పై ₹ 43,000 తగ్గింపు వస్తుంది 

VXI (O) MT వేరియంట్ కొంటే ₹ 44,000 వరకు డిస్కౌంట్‌ తీసుకోవచ్చు. 

VXI+ (O) MT ఇప్పుడు ₹ 47,000 తగ్గింపుతో అందుబాటులోకి వస్తుంది.

మారుతి ఎస్ ప్రెస్సో మైలేజ్
మారుతి ఎస్ ప్రెస్సో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఈ ఇంజిన్‌ 68 PS పవర్ & 90 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ లభిస్తుంది. అయితే, CNG వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. మారుతి ఎస్ ప్రెస్సో పెట్రోల్ వేరియంట్‌ లీటరుకు 24.12 నుంచి 25.30 కిలోమీటర్లు & CNG వేరియంట్‌కు కిలోగ్రాముకు 32.73 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

స్మార్ట్ & సేఫ్టీ ఫీచర్లు
ఈ హ్యాచ్‌బ్యాక్ స్మార్ట్‌ & సేఫ్టీ ఫీచర్లలో - 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, సెమీ -డిజిటల్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ & ABS+EBD వంటివి ఉన్నాయి. 

తక్కువ బడ్జెట్‌లో మెరుగైన మైలేజ్ & మోడ్రన్‌ ఫీచర్ల కోసం చూస్తున్నవారికి మారుతి S ప్రెస్సో నమ్మకమైన ఎంపిక అవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget