అన్వేషించండి

కొత్త Maruti Victoris కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి? కార్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్‌ అవుతుంది?

Maruti Victoris భారతదేశంలో అత్యంత చౌకైన హైబ్రిడ్ SUV. ఇది లెవల్-2 ADAS & 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చింది. దీని ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్ & EMI లెక్క గురించి తెలుసుకుందాం.

Maruti Victoris Price, Down Payment, Car Loan and EMI Details: మారుతి సుజుకి, తన కొత్త హైబ్రిడ్ SUV - మారుతి విక్టోరిస్‌ను మన మార్కెట్లో విడుదల చేసింది. ఇది పెట్రోల్, CNG & హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో వచ్చింది. మారుతి విక్టోరిస్‌ ప్రారంభ ధర రూ. 10.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ కారు కోసం బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తక్కువ ధర & అధిక మైలేజ్ కారణంగా ఈ SUV బాగా ప్రాచుర్యం పొందుతోంది, బుకింగ్స్‌ బాగానే వస్తున్నాయి. విక్టోరిస్‌ కోసం ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, కార్‌ లోన్‌ మీద కూడా ఈ కారును కొనవచ్చు. దీనికోసం EMI లెక్కను ముందుగానే అర్ధం చేసుకోవడం మంచిది.

మారుతి విక్టోరిస్ ఆన్-రోడ్ ధర
తెలుగు రాష్ట్రాల్లో మారుతి విక్టోరిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.50 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఇది LXi, VXi, ZXi, ZXi(O), ZXi+ & ZXi+(O) వంటి ఆరు వేరియంట్లలో లభిస్తుంది. మీరు హైదరాబాద్‌లో విక్టోరిస్ బేస్ మోడల్ (LXi)ని కొనుగోలు చేస్తే, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.11 లక్షల వరకు ఉంటుంది. ఇందులో RTO ఛార్జీలు దాదాపు రూ. 1.97 లక్షలు, బీమా దాదాపు రూ. 53,000 & ఇతర పన్నులు ఉంటాయి.
విజయవాడలో ఇదే వేరియంట్‌ను కొనుగోలు చేయాలంటే RTO ఛార్జీలు దాదాపు రూ. 1.87 లక్షలు, బీమా దాదాపు రూ. 52,000 & ఇతర పన్నులు కలుపుకుని, ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 12.99 లక్షలు అవుతుంది.

ఎంత డౌన్ పేమెంట్ అవసరం అవుతుంది?
తెలుగు రాష్ట్రాల్లో మీరు మారుతి విక్టోరిస్ కొనాలనుకుంటే కనీసం రూ. 2.50 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఉదాహరణకు, విజయవాడలో కొనాలనుకుంటే, రూ. 2.50 లక్షల డౌన్ పేమెంట్‌ తర్వాత దాదాపు రూ. 10.49 లక్షల కార్‌ లోన్‌ తీసుకోవాలి. బ్యాంక్‌ ఈ రుణాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం, ఇప్పుడు, బ్యాంక్‌ లోన్‌ తిరిగి చెల్లించడానికి వివిధ EMI ఆప్షన్స్‌ ఉన్నాయి.

నెలకు రూ. 16,876 EMI చొప్పున చెల్లిస్తే, మీ కార్‌ లోన్‌ మొత్తం 7 సంవత్సరాల్లో తీరిపోతుంది.

నెలకు రూ. 18,908 EMI చొప్పున కడితే మీ రుణం మొత్తం 6 సంవత్సరాల్లో పూర్తిగా చెల్లిపోతుంది.

నెలకు రూ. 21,774 EMI చొప్పున జమ చేస్తే, మీ లోన్‌ 5 సంవత్సరాల్లో క్లియర్‌ అవుతుంది.

నెలకు రూ. 26,103 EMI చొప్పున చెల్లిస్తే, కారు కోసం తీసుకున్న అప్పు మొత్తం 4 సంవత్సరాల్లో మాఫీ అవుతుంది.

మీకు కార్‌ లోన్‌ మంజూరు కావడం, కాకపోవడం & వడ్డీ రేటు అనేవి మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్‌ హిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది.

మారుతి విక్టోరిస్: ఇంజిన్ & మైలేజ్
మారుతి విక్టోరిస్‌లో 1.5-లీటర్ మైల్డ్‌ హైబ్రిడ్‌ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ & 1.5 లీటర్ పెట్రోల్ + CNG ఇంజిన్ అనే మూడు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. ఈ SUVలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ & eCVT గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ పరంగా, విక్టోరిస్ తన విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన SUV. పెట్రోల్ వేరియంట్ 18.50 kmpl మైలేజీని ఇస్తుంది, హైబ్రిడ్ వేరియంట్ 28.65 kmpl వరకు మైలేజీ ఇస్తుంది.

మారుతి విక్టోరిస్ ఫీచర్లు & భద్రత
మైలేజ్ & ధరలోనే కాకుండా ఫీచర్లు & భద్రత పరంగా కూడా మారుతి విక్టోరిస్ అద్భుతమైన కారు. పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఆటో క్లైమేట్ కంట్రోల్, 10.54-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ & HUD డిస్‌ప్లే వంటి అధునాతన లక్షణాలు ఈ కారులో ఉన్నాయి. ఈ SUV భారత్‌ NCAP & గ్లోబల్‌ NCAP రెండింటి నుంచి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది, ప్రయాణీకుల భద్రత పరంగా టాప్‌ క్లాస్‌లో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget